మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం

చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోని పండరీపురం 10 వ లైన్ లో గత రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం గురించి మా రిపోర్టర్ అక్కడికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. అది అగ్ని ప్రమాదం కాదు అని గతంలో కూడా రెండు సార్లు ఇలాంటి చర్యలకు పాల్బడ్డారు అని బాధితులు తెలిపారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆరికట్ల నరసమ్మ అనే 60 సంవత్సరాల మహిళా పొట్టకూటి కోసం అని చిలకలూరిపేట పండరీపురం 10వ లైన్ నందు బడ్డీ కొట్టు పెట్టుకొని బ్రతుకు సాగిస్తుంది. బుధవారం రాత్రి సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు ఆమె బడ్డీకొట్టు తగలబడటం చూసి ఆమెకు సమాచారం అందించే లోపే బంకు మొత్తం కాలిపోయేది. గత మూడు నెలల క్రితం 20 వేల రూపాయలతో చిన్న పాక నిర్మించుకున్నారు. బంకు లోని సరుకులు సామానులు, బంకు తో కలిపి లక్ష రూపాయల ఆస్థి నష్టం జరిగినట్లు ఆమె చెప్పి కన్నీరుమున్నీరు అయ్యారు. ముసలదానిని ఎవరిపైన ఆధార పడకుండా ఇలా బ్రతుకుతుంటే ఎవరో కావాలి అని ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె తెలిపారు. గతంలో కూడా ఇలాగే రెండు సార్లు బంకు తాళాలు పగులగొట్టిన ఘటనలు ఉన్నాయి అలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలి అని ఆమె కోరారు. అసలే కరోనా కష్ట కాలం మళ్ళి ఈ ఘటనతో నేను ఎలా బతకాలి అని ఆమె బాధపడ్డారు. అధికారులు చొరవతీసుకుని ఆమెకు ఆర్ధిక సాయం చెయ్యాలి అని స్థానికులు కోరారు 















































Share:

చిలకలూరిపేట - ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణి

చిలకలూరిపేట - ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - కరోనా వలన ప్రైవేట్ టీచర్లు ఆర్ధికంగా బాగా నష్టపోయారు. ఆత్మభిమానం చంపుకొని బయట పనులు చెయ్యలేక ఎవరికీ ఏమి చెప్పుకోలేక ఏ పని చెయ్యాలో తెలియక సతమతం అవుతున్న ప్రైవేట్ టీచర్లకు చిలకలూరిపేట మునిసిపల్ సిబ్బంది మునిసిపల్ కౌన్సిల్ హాలు నందు నిత్యావసర సరుకులు పంపిణి చేసారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న MLA రజిని 1లక్ష 30 వేల రూపాయల నిత్యావసర సరుకులను ప్రైవేట్ టీచర్లకు అందజేశారు. తమకు అవసరాన్ని తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాన్ని చేసిన మునిసిపల్ సిబ్బందికి ప్రైవేట్ టీచర్లు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్, ప్రైవేట్ టీచర్లు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. 









































Share:

చిలకలూరిపేట - డాక్టర్ల పైనా దాడి కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన - ప్రతి ఆసుపత్రిని పోలీసులతో రక్షణ కల్పించాలి

 చిలకలూరిపేట - డాక్టర్ల పైనా దాడి కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన - ప్రతి ఆసుపత్రిని పోలీసులతో రక్షణ కల్పించాలి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోని డాక్టర్ లావు సతీష్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయిన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు  మంది తమ యొక్క సహనాన్ని కోల్పోయాయి డాక్టర్ల పైన దాడికి పాల్పడటం నిజంగా వైద్య రంగానికి సిగ్గు చేటుగా అని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితిలో ఇంట్లో వాళ్ళకి దూరముగా ఉంటూ పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటే కొంత మంది ఇలా దాడులకు పాల్పడటం ఏంటి అని బాధని వ్యక్తం చేసారు. 

కరోనా వలన చనిపోయిన వైద్య కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించాలి అని కోరారు, అలాగే హాస్పిటలను రక్షణ కేంద్రాలుగా ప్రకటించి ప్రతి ఆసుపత్రి వద్ద కొంత మంది పోలీసులను తో రక్షణ చర్యలు చేపట్టాలి అని కోరారు. ఈ సమావేశంలో కొల్ల రాజమోహన్, కొల్ల అమర్, గణేశుని పరశురామ్, ముద్దన రమేష్,లావు సతీష్,లావు అరుణ,వెల్లటూరు రాణి, సురేష్ బాబు, వ్ కిషోర్, గారు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు 









































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం  నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

యడ్లపాడు మండలంలో 6 కరోనా కేసులు నమోదు అయ్యాయి 

ఉప్పరపాలెం గ్రామంలో - 2

సొలస గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 

నాదెండ్ల మండలంలో 11 కేసులు నమోదు అయ్యాయి 

కనపర్రు గ్రామంలో - 2

సాతులూరు గ్రామంలో - 1

గణపవరం గ్రామంలో -  3

అప్పాపురం గ్రామంలో - 1

గిరిజవోలు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 17-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 17-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు 


చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమోదు అయ్యాయి 


తూర్పు మాలపల్లి  లో - 3

పండరీపురం లో - 1 గా నమోదు అయ్యాయి 


చిలకలూరిపేట మండల గ్రామంలో 2 కేసులు నమోదు అయ్యాయి 


లింగంగుంట్ల గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి 


































Share:

చిలకలూరిపేటలో 18-06-2021 శుక్రవారం నాడు ఈ ప్రాంతాలలో విధ్యుత్ నిలిపివేసే ప్రాంతాలలో

చిలకలూరిపేటలో 18-06-2021 శుక్రవారం నాడు ఈ ప్రాంతాలలో విధ్యుత్ నిలిపివేసే ప్రాంతాలలో 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 18-06-2021 శుక్రువారం నాడు డైక్ మెన్ నగర్ నందు ఉన్న సబ్ స్టేషన్ నందు మరమ్మతుల నిమిత్తం కొన్ని ప్రాంతాలలో విధ్యుత్ సరఫరా నిలిపియేయ్యనున్నారు అని సీహెచ్ రాంబొట్ల తెలిపారు. 

శారదా హైస్కూల్ రోడ్డు, ఓల్డ్ పోలీస్టేషన్ రోడ్డు, తూర్పు మాలపల్లి, క్రిస్టియన్ కాలనీ, నెహ్రూనగర్, వేలూరు రోడ్డు, డైక్ మెన్ నగర్, గుర్రాలచావిడీ ప్రాంతాలలో రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విధ్యుత్ సరఫరా నిలిపివేయును. 




































Share:

చిలకలూరిపేట - బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు

చిలకలూరిపేట - బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

 బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు- వివరాలలోకి వెళ్తే బొప్పూడి గ్రామానికి చెందిన తాడికొండ నాగమణి, మండలంలోని పోతవరం గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ స్కూల్ నందు స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం నాడు తన సోదరునితో కలిసి స్కూల్ కి వెళ్లే సమయంలో పోతవరం గ్రామా సమీపలో చీర అంచు బైక్ చక్రంలో చిక్కుకొని కింద పడి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 సిబ్బంది ఆమెకు ప్రధమ చికిత్స చేసిన అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 
















































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి