మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

భార్యని 'ఎర'గా వేసిన భర్త.. ఆపై పడక గదిలో సీక్రెట్ వీడియోలు - డాక్టర్లు, వ్యాపారులే టార్గెట్.. కటకటాల్లో కిలాడీ జంట! అసలు ఏం జరిగింది?

భార్యని 'ఎర'గా వేసిన భర్త.. ఆపై పడక గదిలో సీక్రెట్ వీడియోలు - డాక్టర్లు, వ్యాపారులే టార్గెట్.. కటకటాల్లో కిలాడీ జంట! అసలు ఏం జరిగింది? 

భర్త డైరెక్షన్.. భార్య యాక్షన్! ఈజీ మనీ కోసం 'హనీ ట్రాప్'.. కటకటాలపాలైన కిలాడీ దంపతులు

​వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, ఈజీ మనీకి అలవాటుపడి సొంత భార్యనే ఎరగా వేసి అమాయకులను నిండా ముంచిన ఓ జంట బాగోతం కరీంనగర్‌లో బట్టబయలైంది. సోషల్ మీడియాలో పరిచయాలతో మొదలై, బెదిరింపులతో లక్షలు దండుకుంటున్న వీరి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసలేం జరిగింది?

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకటాపురానికి చెందిన సందింటి శరత్ కుమార్ రెడ్డి, అతని భార్య లలిత గత పదేళ్లుగా కరీంనగర్‌లోని ఆరెపల్లిలో నివాసం ఉంటున్నారు.

  • ​శరత్ కుమార్ రెడ్డి మార్బుల్ మరియు ఇంటీరియర్ వ్యాపారం చేసేవాడు. అందులో భారీగా నష్టాలు రావడం, చేసిన అప్పులు, ఫ్లాట్ ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడ్డారు.
  • ​దీంతో కష్టపడి సంపాదించడం కన్నా, అడ్డదారిలో డబ్బు సంపాదించడమే మేలని భావించిన భర్త.. భార్యతో కలిసి 'హనీ ట్రాప్' ప్లాన్ రచించాడు.

వలపు వల.. సీక్రెట్ రికార్డింగ్:

ఈ మోసానికి సోషల్ మీడియానే ప్రధాన వేదికగా మార్చుకున్నారు.

  • ​భార్య లలిత తన యూట్యూబ్ ఛానల్ (Karimnagar Pilla 123) మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన రీల్స్, అర్ధనగ్న ఫోటోలు పోస్ట్ చేస్తూ యువకులను, డబ్బున్న వారిని ఆకర్షించేది.
  • ​వారితో ఛాటింగ్ చేసి, మాయమాటలతో నమ్మించి తన ఫ్లాట్‌కు పిలిపించుకునేది.
  • ​వచ్చిన వారితో ఆమె ఏకాంతంగా, చనువుగా ఉన్న సమయంలో భర్త శరత్ కుమార్ రెడ్డి చాటుగా వీడియోలు చిత్రీకరించేవాడు.
  • ​ఆ తర్వాత ఆ వీడియోలు బాధితులకు పంపి, డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించి లక్షలకు లక్షలు వసూలు చేసేవారు.

లారీ ఓనర్ ఫిర్యాదుతో వెలుగులోకి:

గత మూడేళ్లుగా డాక్టర్లు, వ్యాపారులు, విద్యార్థులు ఇలా సుమారు 100 మందికి పైగా వీరి వలలో చిక్కుకున్నట్లు సమాచారం. వీరి నుంచి వసూలు చేసిన డబ్బుతో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఖరీదైన కారు, ఫర్నిచర్ కూడా కొనుగోలు చేశారు.

​అయితే, ఇటీవల కరీంనగర్‌కు చెందిన ఓ 27 ఏళ్ల లారీ యజమానిని ఇదే రీతిలో ట్రాప్ చేసి విడతల వారీగా రూ.13 లక్షలు వసూలు చేశారు. చివరగా మరో 5 లక్షలు ఇవ్వాలని వేధించడంతో, బాధితుడు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించి ఆధారాలు సమర్పించాడు. దీంతో రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు ఈ కిలాడీ దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ హెచ్చరిక:

సోషల్ మీడియాలో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, అందమైన ఫోటోలు చూసి మోసపోకండి. తెలియని వ్యక్తులతో చనువుగా ఉంటూ, ఏకాంతంగా కలుస్తున్నారంటే అది మీ జీవితాన్ని నాశనం చేసే ఉచ్చు కావచ్చు. లైక్, కామెంట్ల వరకు ఓకే.. కానీ హద్దు దాడితే నిలువునా గుండు గీయించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త!


​☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.

​💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!

​🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.

​📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423

 చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

​చిలకలూరిపేట మొదటిరోజు ఎడ్ల పందాల విజేతలు వీరే!

చిలకలూరిపేట మొదటిరోజు ఎడ్ల పందాల విజేతలు వీరే!

చిలకలూరిపేట: సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 'పాల పళ్ళ విభాగం'లో మొత్తం 29 జతల ఎడ్లు పాల్గొనగా, పోటీలు హోరాహోరీగా సాగాయి.

​ఈ విభాగం విజేతలకు బహుమతులను చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు. మొదటి రోజు పోటీలకు పూర్తి ప్రైజ్ మనీని చిలకలూరిపేటకు చెందిన కావూరి రమేష్ బాబు స్పాన్సర్ చేశారు.

🏆 విజేతల వివరాలు (పాల పళ్ళ విభాగం):

  • ​🥇 ప్రథమ బహుమతి (రూ. 25,000/-):
    • యజమాని: కన్నెదార రామ్ తేజ చౌదరి (పెదకూరపాడు)
    • లాగిన దూరం: 3,943 అడుగుల 7 అంగుళాలు
  • ​🥈 ద్వితీయ బహుమతి (రూ. 20,000/-):
    • యజమాని: తల్లపునేని సుధీర్ (బయ్యారం & జె. పంగులూరు)
    • లాగిన దూరం: 3900 అడుగులు
  • ​🥉 తృతీయ బహుమతి (రూ. 18,000/-):
    • యజమాని: డాక్టర్ కాకాని వెంకట సురేంద్ర (వినుకొండ)
    • లాగిన దూరం: 3873 అడుగుల 9 అంగుళాలు
  • 4వ బహుమతి (రూ. 16,000/-):
    • యజమాని: చండ్ర వెంకటేశ్వర రావు (నందలూరు)
    • లాగిన దూరం: 3840 అడుగులు
  • 5వ బహుమతి (రూ. 14,000/-):
    • యజమాని: దేవాభక్తుని చక్రవర్తి (కానూరు)
    • లాగిన దూరం: 3730 అడుగుల 4 అంగుళాలు
  • 6వ బహుమతి (రూ. 12,000/-):
    • యజమాని: మండవ సూరిబాబు మరియు దినేష్ చౌదరి (కోమటినేనివారి పాలెం)
    • లాగిన దూరం: 3703 అడుగుల 8 అంగుళాలు
  • 7వ బహుమతి (రూ. 10,000/-):
    • యజమాని: గోర్ల గోపాల్ (రాజాంపల్లె)
    • లాగిన దూరం: 3631 అడుగుల 6 అంగుళాలు
  • 8వ బహుమతి (రూ. 8,000/-):
    • యజమాని: తోట ధనుంజయ నాయుడు (అంచులవారి పాలెం)
    • లాగిన దూరం: 3601 అడుగుల 3 అంగుళాలు
  • 9వ బహుమతి (సంయుక్త విజేతలు - చెరో రూ. 6,000/-):
    • ​ఈ స్థానంలో ఇద్దరు రైతులు సమాన ప్రతిభ కనబరిచారు.
      • ​పోరుమళ్ల శివ మార్కండేయలు (గోరంట్ల)
      • ​బైరెడ్డి లక్ష్మీరెడ్డి (బండి ఆత్మకూరు)
    • లాగిన దూరం: 3600 అడుగులు (ఇరువురికీ రూ. 6000 చొప్పున అందించారు).

🎁 ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు:

పోటీలో పాల్గొని విజేతలుగా నిలవలేకపోయిన మిగిలిన 20 జతల ఎడ్ల యజమానులను నిరాశపరచకుండా, ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున కంసోలేషన్ బహుమతిని అందజేసి నిర్వాహకులు రైతులను సత్కరించారు


​☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.

​💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!

​🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.

​📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423

 చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి