మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

మావోయిస్టు కాల్పుల్లో అమరులైన పోలీసుల విగ్రహాలను ఏర్పాటు చేస్తాం - అమరవీరుల వారోత్సవాల్లో - CI రాజేశ్వరరావు

మావోయిస్టు కాల్పుల్లో అమరులైన పోలీసుల విగ్రహాలను ఏర్పాటు చేస్తాం - అమరవీరుల వారోత్సవాల్లో - CI రాజేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో గురువారం అర్బన్ సిఐ రాజేశ్వరరావు అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. మావోయిస్టుల కాల్పుల్లో విధినిర్వహణలో అమరులైన పోలీసులు సి.ఐ ఆర్. ప్రసాదు,హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు, కానిస్టేబుల్ ఉమర్,హోం గార్డ్ వెంకటేశ్వర రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లు, కానిస్టేబుల్స్, హోంగార్డులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే సంవత్సరం లో  అమరులైన నలుగురు పోలీసుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


Share:

చిలకలూరిపేట:- అటు టిడిపి దీక్ష - ఇటు వైసిపి దీక్ష

చిలకలూరిపేట:- అటు టిడిపి దీక్ష - ఇటు వైసిపి దీక్ష

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- అటు టిడిపి దీక్ష - ఇటు వైసిపి దీక్ష

వైసీపీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష

ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ ను నోటితో చెప్పలేని భాషలో తిట్టడమే కాక రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చి, అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు దిగాలన్న చంద్రబాబు నిర్ణయం అప్రజాస్వామికమని వైసీపీ నేతలు అన్నారు. దీనికి నిరసనగా... బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో నేడు(గురువారం, రేపు(శుక్రవారం) రెండురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు నిర్వహించాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ పిలుపు మేరకు,గురువారం ఉదయం 10:00 గంటలకు ఎమ్మెల్యే  విడదల రజిని గారి ఆధ్వర్యంలో ముప్పాళ్ల హనుమంతరావు హాస్పిటల్  ఎదురు దీక్షాస్థలి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు,కౌన్సిలర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం తలపెట్టిన 36 గంటల నిరవధిక నిరసన దీక్షకు సంఘీభావం తెలిపేందుకు  చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున  తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తరలిరావాలని పార్టీ నాయకులు కోరారు. ఉదయం 11 గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. చిలకలూరిపేట నియోజకవర్గానికి నేడు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు  చంద్రబాబుతో వేదికను పంచుకునే అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. కావున నియోజకవర్గంలో పార్టీ  ముఖ్యనాయకులు, రైతు సోదరులు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు రేపటి కార్యక్రమంలో పాల్గొని  చంద్రబాబు దీక్షను విజయవంతం చేయాలన్నారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి