|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లకుండా ఆర్చి నిర్మించారు - కాపులకు & కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు - ఎడవల్లి సర్పంచ్ తిరుమలేశ్వరి
చిలకలూరిపేట - కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లకుండా ఆర్చి నిర్మించారు - కాపులకు & కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు - ఎడవల్లి సర్పంచ్ తిరుమలేశ్వరి
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడవల్లి గ్రామ సర్పంచ్ తిరుమలేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఏడవల్లి గ్రామ సర్పంచ్ గా చేసిన మహిళా కుమారుడు గ్రామంలో మూడు ఆర్చీలు నిర్మించారని వాటి వలన కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లడానికి అడ్డంగా ఉందని పలుసార్లు చెప్పినా కూడా వారు పట్టించుకోవటం లేదని ఆమె తెలిపారు. ఊరిలో కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని, కాపుల స్మశాన వాటికను పూర్తిగా ఆక్రమించుకున్నారని... ఏంటని ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్లారని ఎమ్మార్వో ని కలిస్తే ఆమె కూడా వారికే వత్తాసు పలికారని తిరుమలేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న పోరంబోకు స్థలాలు మొత్తాన్ని ఆక్రమించుకున్నారని చివరకు వాగులను స్మశానవాటికలను కూడా వదలడం లేదని ఆమె తెలిపారు. గ్రామంలో కాపులకు, కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారని, స్మశాన వాటికలో ఆక్రమాలు తొలగించాలని పలుమార్లు ఎమ్మార్వో చుట్టూ తిరిగిన ఆమె ఏమాత్రం పట్టించుకోలేదని చివరిగా ఆమె ట్రాన్స్ఫర్ వెళ్లిపోయిందని ఆవేదనను తెలియజేశారు.





