|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - నాదెండ్ల,యడ్లపాడు మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట - నాదెండ్ల,యడ్లపాడు మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
నాదెండ్ల మండల గ్రామాలలో 6 కేసులు నమోదు అయ్యాయి.
గణపవరం గ్రామంలో - 5
కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి.
పండరీపురం లో - 2 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి.
పసుమర్రు గ్రామంలో - 1
బొప్పూడి గ్రామంలో - 1
మురికిపూడి గ్రామంలో - 1
వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి
చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి
చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం ఆధ్వర్యంలో MLA విడదల రజిని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విడదల గోపి, మునిసిపల్ చెర్మన్ రఫాని, యార్డ్ చెర్మన్ బొల్లెద్దు చిన్న ముఖ్య అతిధులుగా విచ్చేసి 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి చేసారు. కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కరోనా విజృంభిస్తున్న సమయంలో మునిసిపల్ సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివి అని మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు.పట్టణంలో ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు వచ్చిన చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం తరుపున తమ వంతు కృషి చేసాము, చేస్తూనే ఉంటాము అని తెలిపారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.
మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత
CHILAKALURI PET SPEED NEWSThursday, June 24, 2021ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం, భారత్
No comments
మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత
చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగి మన తెలుగు వారి స్థాయిని దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో తన ఆలోచనలతో చాకచక్యంగా వాటిని అధిగమించిన మన IAS మైలవరపు కృష్ణ తేజ మరో అరుదైన ఘనత సాధించారు. కృష్ణ తేజకు ప్రతిష్ఠాత్మకం అయిన బుక్ ఆఫ్ అఛీవర్స్ నందు చోటు దక్కటం కృష్ణ తేజ కీర్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళింది అని చెప్పాలి. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో IAS గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 ఆగష్టు నెలలో కేరళలో వచ్చిన వరదలలో మన కృష్ణ తేజ తన ఆలోచనలతో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఆపరేషన్ కుట్టనాడు ఆ రాష్ట్రం చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో కేరళలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను తన భుజాల పైన వేసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఆపరేషన్ పూర్తి చేసారు.లక్షల మంది జీవితాల గురించి అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అంతటి క్రిటికల్ పరిస్థితులలో ఒక్క తప్పిదం జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆనాడు చేపట్టిన ఆపరేషన్ కుట్టనాడు కి గాను బుక్ అఫ్ అఛీవర్స్ నందు మన కృష్ణ తేజకు చోటు దక్కింది. బుక్ అఫ్ అఛీవర్స్ అంటే అసాధ్యాన్ని సాధించిన అరుదైన వ్యక్తుల గురించి అందులో పంచుకుంటారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన మన చిలకలూరిపేట ముద్దు బిడ్డ IAS మైలవరపు కృష్ణ తేజకు అభినందనలు తెలుపుకుంటున్నాము.
అలాగే కరోనా వీరవిజృభిస్తున్న సమయంలో కూడా కేరళ ప్రభుత్వం మన కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి కరోనా కట్టడికి కృషి చేసారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యత వ్యవహిరిస్తు తన ఆలోచనలతో నిర్ణయాలతో కరోనా తీవ్రతని తగ్గించారు.
Book of Achievers
కేరళలోని మన కృష్ణ తేజ ఆఫీస్ నందు పని చేసే ఉద్యోగి అయన గురించి ఏమి అన్నారో అయన మాటలలోనే
మనం నిత్యం ఎంతో మంది అధికారుల అవినీతి గురించి వింటూనే వుంటాం.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాల్లో చేరేవారు కొంతమంది అయితే, ప్రజలకు సేవచేయాలని వచ్చేవారు మరికొంతమంది. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను విన్నది, చూసింది...........
జీవితంలో కొంతమందిని కలసినందుకు గర్వ పడుతుంటాం.అలాంటి ఒక వ్యక్తి గురించి, ఈయన పేరు కృష్ణతేజ మైలవరపు.కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం అల్లెప్పే సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.నేను అనుకోకుండా ఒక రోజు ఎన్నికల విధుల్లో బాగంగా అల్లెప్పేకి వెళ్ళటం జరిగింది.అప్పుడే ఈయన్ని కలిసే అదృష్టం దక్కింది.
అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే....
🔹ప్రజలకు ఏదోకటి చేయాలనే సంకల్పం.
🔹ఒక అధికారిగా పాలనలో తనదైన ముద్ర చూపించాలనే ఉత్సాహం.
🔹 ఎదుటి మనిషితో నేను ఒక అధికారిని అనే గర్వం లేకుండా మాట్లాడే మనస్తత్వం, ఎదుటి వారికి ఇచ్చే గౌరవం.
🔹 సర్వీసులో చేరిన ముడేళ్లకే దేశ వ్యాప్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.
ఆయన గురించి అక్కడి ప్రజలు,అధికారులు చెప్పిన కొన్ని విషయాలు...........
🔹 గతంలో వరదలు వచ్చిన సమయంలో కుట్టు నాడు ప్రాంతంలో వరద భీభత్సాన్నీ ముందుగానే ఊహించి ఆయన చేపట్టిన రేస్కూ ఆపరేషన్.
🔹 కేవలం 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం.
🔹సమర్దవంతంగా శిబిరాల నిర్వహణ.
🔹 తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు తరలించంటం.
🔹వరదల అనంతరం ఆయన చేపట్టిన I AM FOR ALLEPPEY అనే కార్యక్రమం.
🔹వరదల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి కొత్త ఇళ్లు ఇవ్వటం.
🔹పిల్లల బడుల ఆధునికీకరణ, రక్షిత త్రాగునీరు ఏర్పాటు.
🔹 ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం.
🔹I AM FOR ALLEPPEY ద్వారా ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
🔹 ఇంకా ఇటువంటివి మరెన్నో...........
అంటూ ఎన్నో విషయాలను పంచుకున్నారు.
చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.
CHILAKALURI PET SPEED NEWSThursday, June 24, 2021గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.
చిలకలూరిపేట - పట్టణంలో ఈ రోజు 24-06-2021 MLA విడదల రజిని పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని పలు సెంటర్లలో MLA ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే మోడ్రన్ మాల్ వద్ద భారీ ఎత్తున రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. కూరగాయల మార్కెట్ వర్తక సంఘం తరుపున నిరు పేదలకు బట్టలు పంచారు. ఎరువుల కొట్ల బజారులో కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వాడ వాడల ఈ రోజు రజిని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. వార్డు స్థాయి వ్యక్తుల నుండి పార్టీ సీనియర్ నాయకులు వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. MLA పుట్టిన రోజుతో పట్టణం అంతా పండుగ వాతావరం అలుముకుంది.









