|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - కుప్పగంజివాగులో గల్లంతు కాబోయిన వ్యక్తిని కాపాడిన పోలీస్,ఫైర్ సిబ్బంది
చిలకలూరిపేట - కుప్పగంజివాగులో గల్లంతు కాబోయిన వ్యక్తిని కాపాడిన పోలీస్,ఫైర్ సిబ్బంది
చిలకలూరిపేట మండల గ్రామాలైన మానుకొండవారిపాలెం & ఏలూరు గ్రామాల మధ్యలో ప్రవహించే కుప్పగంజి వాగు ఎగువున కురిసిన వర్షానికి భారీగా వరద నీరు చేరింది.అయితే వేలూరు గ్రామానికి చెందిన దాసు అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పైన వరద దాటానికి ట్రై చేసాడు. వరద ఉధృతికి బైకుతో సహా దాసు కూడా వరదలో కొట్టుకొని వెళ్ళబోయి అక్కడ ఉన్న చెట్టుకొమ్మకి చిక్కుకొని ఆగిపోయాడు. అంతలో అప్రమత్తం అయిన గ్రామస్థులు MLA రజని ని సంప్రదించగా ఆమె వెంటనే స్పందించి సదరు వ్యక్తిని కాపాడలిని అధికారులను ఆదేశించారు. వెంటనే అప్రమత్తం అయిన ఫైర్,పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని దాసు ను కాపాడారు. మునిసిపల్ ఛైర్మెన్ రఫాని హుటా హుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రురల్ SI భాస్కర్,ఫైర్ ఆఫీసర్ సునీల్ తోపాటు గ్రామ సర్పంచ్ తిరుపతయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు దౌలతాఖాన్ ఆధ్వర్యంలో దాసుని ప్రాణాలతో రక్షించారు. అయితే వాహనం మాత్రం వరద ఉధృతిలో కొట్టుకుపోయింది.
చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలలో 17-07-2021,శనివారం నాడు మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండలం & యడ్లపాడు మండల గ్రామాలలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
నాదెండ్ల మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి.
అప్పాపురం గ్రామంలో - 1
చిరుమామిళ్ల గ్రామంలో - 4
నాదెండ్ల గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 17-07-2021,శనివారం నాడు మొత్తం 2 కేసులు నమోదు అయ్యాయి.
పురుషోత్తమపట్నం లో - 2 గా నమోదు అయ్యాయి.
కరోనా కేసులు తగ్గుతున్నాయి అని మాస్క్ లేకుండా బయటకి వస్తే పరాధరుసుము వెయ్యటానికి టౌన్ పోలీసువారు రెడీగా మీకోసమే వేచివున్నారు జాగ్రత్త. రాష్ట్రం మొత్తం ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటూ కరోనా ప్రోటోకాల్ పాటిస్తూన్నారు. మన పట్టణంలో మాత్రం కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కరోనా ప్రోటోకాల్ పాటించండి 🙏.
చిలకలూరిపేట - మన మంచినీటి చెరువును కాపాడేవారు లేరా - మునిసిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు.
చిలకలూరిపేట - మన మంచినీటి చెరువును కాపాడేవారు లేరా - మునిసిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు.
చిలకలూరిపేట - పట్టణంలోని ప్రజలందరి దాహం తీరుస్తూ వారి నిత్య అవసరాలు తీరుస్తున్న మన అందరి జీవనాధారం పట్టణ శివారులలో ఉన్న మన మంచినీటి చెరువు. ఇంతమందికి జీవనాధారం అయిన మంచినీటి చెరువుకు భద్రత కరువైంది. గత కొంత కాలం క్రితం చెరువు చెరువులో అకృత్యాలు ఎక్కువ అయిపోయాయి.పట్టణంలో ఇన్ని లక్షల దాహం తీరుతున్న మన మంచినీటి చెరువును పట్టించుకునే నాధుడు లేరా అని అక్కడికి వచ్చిన పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికి అయినా మునిసిపల్ కమిష్నర్ చెరువు దగ్గిర పరిస్థితిని సమీక్షించాలి అని ప్రజలు కోరుతున్నారు. సాయంత్రానికి చెరువులో గేదెలు,మేకలు జలకాలాడటం పట్ల పట్టణ ప్రజలు ఒకింత అభద్రతకు లోనవుతున్నారు. అధికారులు వీటి పైనా తగిన చర్యలు తీసుకోవాలి అని సామాన్యులు కోరుకుంటున్నారు.








