|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేటలో గుట్కా విక్రయాల పైనా పోలీసుల పంజా - ఒకరు అరెస్ట్
చిలకలూరిపేటలో గుట్కా విక్రయాల పైనా పోలీసుల పంజా - ఒకరు అరెస్ట్
చిలకలూరిపేట పట్టణంలో గుట్కా విక్రయించే వారి పైనా పోలీసులు పంజా విసిరారు. అర్బన్ CI బిలాలుద్దీన్ గారి ఆధ్వర్యంలో SI సుబ్బారావు, నరసాదాసు మరియు పోలీస్ సిబ్బంది తో పట్టణంలోని పలు షాపులలో తనిఖీలు చేపట్టారు. అయితే చలివేంద్రం బజార్ నందు ఒక షాపునందు అనుమానంతో వెతకగా వందల సంఖ్యలో నిషేధిత గుట్కా, విమల్ ప్యాకెట్స్ బయటపడ్డాయి. అయితే సదరు వ్యక్తిని విచారించగా కొంతమంది వ్యక్తులు టూ వీలర్ లో వచ్చి తమకు వీటిని MRP ధరలకు అమ్ముతున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తి 5,10 రూపాయల లాభంతో వీటిని అమ్ముతున్నట్లు తెలిపారు. అయితే ఆ వ్యక్తిపైన కేసు నమోదు చేసి, పాకెట్స్ సీజ్ చేసి, అరెస్ట్ చేసారు. 5,10 రూపాయల లాభంకోసం ఇతరుల ప్రాణాలని రిస్క్లో పెడుతున్నారని, పట్టణంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
చిలకలూరిపేట - చల్లగా ఉన్నకూడా వడగాలులు
చిలకలూరిపేట - చల్లగా ఉన్నకూడా వడగాలులు
చిలకలూరిపేట గత కొన్ని రోజలుగా పట్టణంలోని చల్లగాలులకు అలవాటుపడ్డ పురప్రజలు ఈ రోజు మాత్రం ఎండ లేకపోయినా కానీ వడగాలులు మాత్రం బాగా వీచాయి. కొన్ని రోజులుగా తుపానులు, అల్పపీడనం వలన పట్టణములో మధ్యాన్నం సమయానికి చల్లటి వాతావరం, చిరుజల్లులతో సాయంత్రానికి సేద తీరేవాళ్ళు, రాత్రి సమయాలలో హాయిగా నిద్రపోయేవారు. కానీ ఈ రోజు 41డిగ్రీల టెంపరేచర్ నమోదు అయినది. గత 20 రోజులుగా ఇంత ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. రాబోవు రెండు & మూడు రోజులు ఇలాగే ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి అని అంచనా.
చిలకలూరిపేట ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఎక్కడ చేస్తారు అంటే !
చిలకలూరిపేట ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఎక్కడ చేస్తారు అంటే !
చిలకలూరిపేట మొబైల్ నెంబర్ కు ఆధార్ కార్డు లింక్ ఎక్కడ చేస్తారో చాల మందికి తెలియక తెలిసిన 1,2 ప్రదేశాలలో క్యూ లైన్ లో నుంచొని 12 గంటలకి లాక్ డౌన్ మొదలవుతుంది కావున ఇంటికివెళ్ళి తరువాతి రోజు అదేవిధంగా జరుగుతుంది.
అయితే మన చిలకలూరిపేట నందు 5 ఆధార్ ఎన్రొల్మెంట్ సెంటర్లు ఉన్నాయి. వాటి వివరాలు
1) మంజు నర్సింగ్ హోమ్, గాంధీపేట ,ఆపోజిట్ RVSCVS హైస్కూల్
2) స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా , రామకోటి బిల్డింగ్స్ , ఆపోజిట్ గ్రాండ్ వెంకటేశా
3) ఆంధ్ర బ్యాంకు , సుబ్బయ్యతోట ఆంజనేయ స్వామి గుడి రోడ్
4) BSNL ఆఫీస్ , RVSCVS హైస్కూల్ రోడ్
5) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ , ఆధార్ సేవ కేంద్రం, గ్రామా సచివాలయం-1, పసుమర్రు
పైన తెలియచేయబడిన ఆధార్ కేంద్రాలలో మొబైల్ నెంబర్ ని ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవచ్చు







