మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

పల్నాడులో మోగిన ఎన్నికల సైరన్...ఎల్లుండి నుంచే నామినేషన్లు..స్థానిక పోరుకు పల్నాడు సై..జేసీ సంజన శ్రీ హర్ష కీలక ప్రకటన.. పూర్తి వివరాల కోసం క్రింద లింకుపై క్లిక్ చేయండి

🚨 పల్నాడులో మోగిన ఎన్నికల నగారా.. జడ్పీటీసీ, ఎంపీపీ పోరుకు సర్వం సిద్ధం! 

పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది! జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి నరసరావుపేట ఆర్డీవో (RDO) కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి సంజనా శ్రీ హర్ష  ప్రెస్ మీట్ నిర్వహించి, ఎన్నికల ఏర్పాట్లపై కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు.

​📍 28 మండలాల్లో ఎన్నికల సందడి:

పల్నాడు జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ప్రతీ మండలానికి ఒక రిటర్నింగ్ అధికారిని (RO) ప్రత్యేకంగా నియమించి, బాధ్యతలు అప్పగించారు.

​📝 రేపటి  నుంచే నామినేషన్ల పర్వం - ఆన్‌లైన్‌లోనూ ఛాన్స్:

ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి రేపటి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈసారి టెక్నాలజీని సైతం పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను నేరుగా కాకుండా 'ఆన్లైన్' ద్వారా కూడా సమర్పించే అత్యుత్తమ సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల సమయం ఆదాతో పాటు పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

​👮 పకడ్బందీ ఏర్పాట్లు - RO లకు ప్రత్యేక శిక్షణ:

ఎన్నికల ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు ఇప్పటికే నియమితులైన ఆర్వోలకు పూర్తిస్థాయిలో ప్రత్యేక శిక్షణను అందించారు. నామినేషన్ల స్వీకరణ దగ్గరి నుంచి కౌంటింగ్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

​🗳️ 1548 కేంద్రాల్లో పోలింగ్ - ప్రశాంతంగా ఓటెయ్యాలి:

జిల్లా వ్యాప్తంగా పల్లె ఓటర్లు తమ తీర్పును వెలువరించేందుకు మొత్తం 1548 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జేసీ స్పష్టం చేశారు. "ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం. ప్రతీ ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలకు, భయాందోళనలకు గురికాకుండా, అత్యంత ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి" అని జాయింట్ కలెక్టర్ సంజనా శ్రీ హర్ష  ప్రజలకు పిలుపునిచ్చారు.

​⚡ మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ (స్పాట్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!) ⚡

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి