|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు - కొత్తగా 4 గ్రామాలు
చిలకలూరిపేట - నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు - కొత్తగా 4 గ్రామాలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న మూలంగా అధికారులు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా తీవ్రతను తగ్గించాలి అని సూచించారు. ఇప్పటికే యడ్లపాడు మండలంలో 3 కంటైన్మెంట్ జోన్లు ఉండగా కరోనా విస్తృతి పెరుగుతున్న రీత్యా మరో 4 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. యడ్లపాడు మండలం యడ్లపాడు గ్రామం, కొండవీడు, కొత్తపాలెం, లింగారావుపాలెం గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్లు గా ఇన్సిడెంట్ కమాండర్ తహసీల్దార్ జ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే వంకాయలపాడు, ఉప్పరపాలెం, బోయపాలెం గ్రామాలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. ఆయా గ్రామాలలో ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే అత్యవసరంగా బయటకు రావాలి అని తెలిపారు. ప్రజలందరు సహకరించాలి అని కోరారు. అలాగే కరోనా నియమాలు పాటించని వారిపైన ఖఠినమైన చర్యలు, కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు.
చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు మొత్తం 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
నాదెండ్ల మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి.
చంద్రవరం గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 1
చిరుమామిళ్ల గ్రామంలో - 2
సంక్రాంతిపాడు గ్రామంలో - 2
సాతులూరు గ్రామంలో - 1
గిరిజవోలు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయింది.
తిమ్మాపురం గ్రామంలో - 1 గా నమోదు అయింది.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 3 కేసులు నమోదు అయ్యాయి.
గోవిందపురం గ్రామంలో - 2
వేలూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి.
తూర్పుమలపల్లి లో - 1
విశ్వబ్రాహ్మణ కాలనీ లో - 1
శివాలయం వీధి లో - 1 గా నమోదు అయ్యాయి.
Use MASK & Sanitizers and keep Social-Distance
చిలకలూరిపేట - MLA రజినికి మినిష్టర్ ఇవ్వాలి - బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
చిలకలూరిపేట - MLA రజినికి మినిష్టర్ ఇవ్వాలి - బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
చిలకలూరిపేట పట్టణానికి శుక్రవారం రోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పట్టణానికి విచ్చేసారు. ముందుగా పొట్టిశ్రీరాములు కాంప్లెక్స్ వద్ద బీసీ సంఘ నాయకులూ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సంఘాలు మొత్తం ఏకమై మన హక్కులను మనం కాపాడుకోవాలి అని తెలిపారు. అలాగే చిలకలూరిపేటలో అనుకోకుండా రావలసి వచ్చిన అప్పటికి అప్పుడు ఎంత మంది రావటం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. అలాగే ఎప్పుడు అయిన ఉద్యమానికి పిలుపునిస్తే పట్టణాన్ని స్థంబింప చేసేంతగా ఆక్టివ్ గా ఉన్నారు మీరు అందరూ అని అన్నారు.బీసీ సంఘ నాయకులు,కూరగాయల మార్కెట్ కమిటీ ఆయనకు సన్మానం చేసారు.
అనంతరం వైస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు అయ్యారు. పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి బీసీ లకు పూర్తి న్యాయం చేస్తున్నారు అని.దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వం సొంతం అని తెలియజేసారు.రేపు జగన్ క్యాబినెట్ విస్తరణలో MLA రజిని గారికి మినిస్టర్ ఇస్తే రాష్ట్రం లోనే కాదు దేశంలో ఉన్న బీసీలు అందరూ ఆనందిస్తారు అని తెలిపారు.రజిని మేడంకు ఏపీలోనే కాదు తెలంగాణాలో కూడా చాల ఫాలోయింగ్ ఉంది, చాల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అని కొనియాడారు.
వీడియో :-








