మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో క్రిమినల్ కేసు! - ఏబీఎన్ ఆర్కేకు బిగ్ షాక్ - ఆర్కేపై భగ్గుమన్న చిలకలూరిపేట వైసీపీ కేడర్ !

చిలకలూరిపేటలో క్రిమినల్ కేసు! - ఏబీఎన్ ఆర్కేకు బిగ్ షాక్ -  ఆర్కేపై భగ్గుమన్న చిలకలూరిపేట వైసీపీ కేడర్ !


మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం.. మాజీ మంత్రి విడదల రజిని ఆదేశాలతో కదిలిన క్యాడర్

​వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలను, మహిళలను ఉద్దేశించి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన అత్యంత జుగుప్సాకరమైన, అమర్యాదకర వ్యాఖ్యలపై చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. జర్నలిజం ముసుగులో నాయకుల కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని ప్రసారం చేసిన కథనాలు, రాసిన రాతలను స్థానిక నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఖండించారు.

పాత్రికేయ విలువలకు పాతర:

ఒక ప్రధాన మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ, సామాజిక నైతికతకు, పాత్రికేయ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయమని నాయకులు విమర్శించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మహిళలను పావులుగా వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. పచ్చ మీడియా పైశాచిక ఆనందం కోసం మహిళల గౌరవాన్ని తుంగలో తొక్కడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. రాధాకృష్ణ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బేషరతుగా యావత్ మహిళా లోకానికి, ప్రజాస్వామ్యానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

చర్యలు తీసుకోకుంటే సహించేది లేదు:

మహిళల గౌరవాన్ని కాపాడటం సమాజంలోని ప్రతి పౌరుడి నైతిక బాధ్యత అని, ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి రాతలు రాయాలన్నా, కూతలు కూయాలన్నా భయపడేలా చట్టపరమైన శిక్షలు ఉండాలని సంబంధిత అధికారులను కోరారు.

పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు:

ఈ నేపథ్యంలో, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారి స్పష్టమైన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు భారీగా కదిలాయి. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు, వారి గౌరవానికి భంగం కలిగించినందుకు ఆయనపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి, కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను గట్టిగా డిమాండ్ చేశారు. పచ్చపత్రికల రాతలకు భయపడే ప్రసక్తే లేదని, న్యాయపోరాటం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు తేల్చి చెప్పారు.

— చిలకలూరిపేట స్పీడ్ న్యూస్


ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ - సీజ్‌ఫైర్ నాటకం వెనుక మహా కుట్ర ఉందా?

చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ - సీజ్‌ఫైర్ నాటకం వెనుక మహా కుట్ర ఉందా?

​పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయి. ఒకపక్క శాంతి ఒప్పందాలు జరిగినట్లు ప్రపంచాన్ని నమ్మిస్తూనే, మరోపక్క దాడుల పరంపర ఉధృతంగా కొనసాగుతోంది. అసలు పశ్చిమ ఆసియాలో తెర వెనుక ఏం జరుగుతోంది?

ట్రంప్ సీజ్‌ఫైర్ ప్రకటన - పాకిస్తాన్ 'క్రెడిట్' గేమ్

​అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో 14 రోజుల పాటు 'సీజ్‌ఫైర్' (యుద్ధ విరమణ) ఒప్పందాన్ని ప్రకటించడంతో యుద్ధం ముగిసిందని అందరూ భావించారు. ఈ ఒప్పందం వెనుక తమ దౌత్యమే ఉందని, ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిపామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అంతర్జాతీయ మీడియాలో క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారు.

అమెరికా vs ఇరాన్: ఎవరి వాదన వారిదే!

​ఈ ఒప్పందంపై ఇరు దేశాలు భిన్న ప్రకటనలు చేస్తున్నాయి. ఇరాన్ తన అణు శుద్ధి కార్యక్రమాలను ఆపేస్తుందని, అలాగే కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) ని తెరిచి ఉంచుతుందని, తమ ఆంక్షలకు ఇరాన్ తలొగ్గిందని అమెరికా చెబుతోంది. కానీ, ఇరాన్ వాదన మరోలా ఉంది. అమెరికా తమను చూసి భయపడిందని, తమ న్యూక్లియర్ శుద్ధికి లైన్ క్లియర్ అయిందని ఇరాన్ బహిరంగంగానే చెప్పుకుంటోంది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ మారణహోమం

​సీజ్‌ఫైర్ జరిగిందన్న వార్త చల్లారకముందే, ఇజ్రాయెల్ 'లెబనాన్' పై అత్యంత భయంకరమైన దాడులతో విరుచుకుపడింది. బీరుట్ లక్ష్యంగా జరిగిన ఈ బాంబు దాడుల్లో ఏకంగా 250 మందికి పైగా మరణించగా, 1100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.

ఇరాన్ ప్రతీకారం - మళ్లీ మూతపడ్డ హార్ముజ్ జలసంధి

​ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాన్, ప్రతీకార చర్యలకు దిగింది. సౌదీ, ఖతార్‌ ఆయిల్ రిఫైనరీల వైపు దాడులు చేయడమే కాకుండా, ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి'ని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.

భారత్ అలర్ట్ - ముందే ఉప్పందిందా?

​ఇంతటి గందరగోళం మధ్య, ఏప్రిల్ 8న టెహ్రాన్ లోని భారత ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్‌లో ఉన్న భారత విద్యార్థులు, పౌరులు ఉన్నపళంగా ("expeditiously") దేశాన్ని విడిచిపెట్టి రావాలని అత్యవసరంగా కోరింది. అంతేకాదు, ఎంబసీ సూచించిన మార్గాల్లోనే రావాలని, ఎవరూ సొంతంగా ఇరాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించింది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన కొద్ది రోజులకే ఇజ్రాయెల్ ఈ మెరుపు దాడులకు దిగడం గమనార్హం. ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ చేతిలో 'న్యూక్లియర్ పవర్' ఉండకూడదనే వాదనను భారత్ కూడా పరోక్షంగా సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్‌పై అతిపెద్ద దాడి జరగబోతోందని ఇజ్రాయెల్ ద్వారా భారత్‌కు ముందే సమాచారం ఉందా అన్న కోణంలో చర్చ జరుగుతోంది.

అసలు వ్యూహం ఏమిటి? ముందున్నది మహా విధ్వంసమా?

​ఇప్పుడు ప్రపంచ దేశాల మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. అసలు ఇరాన్ పై యుద్ధం ఆగుతుందా? లేక ఇదంతా ఒక వ్యూహమా?

ఇరాన్ భూభాగంలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ మరియు భారత పౌరులను సురక్షితంగా బయటకు తరలించడానికి కొంత సమయం కావాలి కాబట్టే ఈ 14 రోజుల సీజ్‌ఫైర్ నాటకం ఆడుతున్నారా? దేశంలోని విదేశీయుల తరలింపు పూర్తయిన తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ భూభాగంపై బాంబుల వర్షం కురిపించేందుకు స్కెచ్ వేశాయా?

​ఏం జరగబోతోందో వేచి చూద్దాం... పశ్చిమ ఆసియాలో రాబోయే కొన్ని రోజులు అత్యంత కీలకం!

— చిలకలూరిపేట స్పీడ్ న్యూస్


చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట టౌన్ - ​గంజాయి మత్తులో టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన కారు... వణికిపోయిన స్థానికులు

చిలకలూరిపేట టౌన్ - ​గంజాయి మత్తులో టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన కారు... వణికిపోయిన స్థానికులు


చిలకలూరిపేట (పల్నాడు జిల్లా): పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తృటిలో ఓ పెను ప్రమాదం తప్పింది. పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో గంజాయి మత్తులో కొందరు యువతీయువకులు సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి నేరుగా హోటల్‌లోకి దూసుకెళ్లడంతో పెను కలకలం రేగింది.

ఘటన వివరాల్లోకి వెళితే...

స్థానిక విజయ బ్యాంకు సెంటర్ సమీపంలో ఉన్న ఒక టిఫిన్ హోటల్‌లోకి బెలెనో (Baleno) కారు అదుపుతప్పి అత్యంత వేగంగా దూసుకొచ్చింది. కారు వేగానికి హోటల్‌లోని కుర్చీలు, బల్లలు, ఇతర వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పిందని, అదే ఉదయం రద్దీ సమయంలో జరిగి ఉంటే ఘోరం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు.

కారులో ఐదుగురు... మత్తులో యువత!

ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు. అందులో ఇద్దరు యువకులు కాగా, ముగ్గురు యువతులు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వీరంతా గంజాయి మత్తులో ఉన్నారని, ఆ మత్తులోనే కారును విపరీతమైన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. యువత ఇలా మత్తు పదార్థాలకు బానిసలై ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై స్థానికులు మండిపడుతున్నారు.

బెంబేలెత్తిన విద్యార్థులు, తల్లిదండ్రులు:

ప్రమాదం జరిగిన విజయ బ్యాంకు సెంటర్ పరిసర ప్రాంతాల్లో పలు స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి. నిత్యం వందలాది మంది విద్యార్థులు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. కారు బీభత్సం సృష్టించిన తీరు చూసి అటుగా వెళ్తున్న విద్యార్థులు, వారిని బడిలో దింపేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకవేళ ఆ కారు రోడ్డుపై వెళ్లే విద్యార్థులను ఢీకొట్టి ఉంటే పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు:

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే చిలకలూరిపేట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, ధ్వంసమైన హోటల్‌ను పరిశీలించారు. అనంతరం కారులో ఉన్న యువతీయువకులను అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

https://www.instagram.com/reel/DW5XYVriak2/?igsh=MXdqdzJ0emZncXpsNg==

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి