మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

లావు శ్రీకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరికపై - అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం

లావు శ్రీకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరికపై - అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం 

మార్చి 2న తెలుగుదేశం పార్టీలోకి లావు శ్రీ కృష్ణదేవరాయలు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం

పలనాడు జిల్లా :- ఎప్పుడు ఎప్పుడు పార్టీలో చేరుతారా అని నరసరావుపేట పార్లమెంట్ టిడిపి కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు లావు శ్రీకృష్ణ TDP లో చేరిక తేదీ ఖరారు చేశారు. మార్చి 2వ తేదీన గురజాల నియోజకవర్గం, దాచేపల్లిలో జరగబోయే 'రా కదలి రా ' సభలో టిడిపిలోకి చేరుతున్నట్లు లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు.  సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, అభివృద్ధిని సాధించుటకే తన ప్రతి అడుగు, ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో సాధించుకున్న వాటిని పూర్తి చేసుకోవటంతో పాటుగా రానున్న కాలంలో ఇంకొన్ని మన పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉంటానని మరలా ఆశీర్వదించాలని శ్రీ కృష్ణ దేవరాయలు పల్నాడు ప్రజనీకాన్ని కోరారు.

- లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారి కార్యాలయం

Share:

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

చిలకలూరిపేట:-  మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు పత్తిపాటి శరత్ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తూ పట్టణంలోని టిడిపి శ్రేణులు సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం దిష్టిబొమ్మ తగలబెట్టి నరసరావుపేట సెంటర్లో భారీ మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ

జగన్మోహన్ రెడ్డి రాజకీయ వికృత చర్యకు పరాకాష్ట ఈ కేసు. ఆ కంపెనీతో ఎటువంటి సంబంధం లేకపోయినా మా అబ్బాయి శరత్ బాబుని అక్రమంగా ఈ కేసులో అరెస్టు చేశారు.

నారా చంద్రబాబు గారు నాకు సీటు కన్ఫర్మేషన్ చేయగానే కొన్ని గంటలలోనే ఈ కేసు రిజిస్టర్ అయింది అంటే అర్థమవుతుంది రాజకీయ ప్రేరేపిత కేసు అని.. కుటుంబ సభ్యుల పైన కేసులు పెట్టి మా మానసిక ధైర్యాన్ని నీవు దెబ్బతీయాలనుకుంటే అది జరగని పని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో.. నీ ఉడత ఊపులకి ఇక్కడ భయపడేది ఎవరూ లేరు. నాలుగు సంవత్సరాల నుంచి మమ్ములను వేధించిన వేధింపులు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి నిన్ను ప్రజా క్షేత్రం నుంచి తరిమి వేసే రోజులు దగ్గర పడ్డాయి.. అందుకే ఇటువంటి చేష్టకు నీవు పూనుకుంటున్నావు అంటూ ఆయన ద్వజమెత్తారు.

ప్రత్తిపాటి శరత్ బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన తెలియజేసిన టిడిపి శ్రేణులు..

పత్తిపాటి నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేశారు. బైపాస్ పై నిరసన తెలియజేస్తూ డౌన్ డౌన్ సీఎం, నశించాలి నిరంకుశ పాలన డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపీ -  జనసేనలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?


చిలకలూరిపేట మంత్రి పార్టీ తనయుడు ప్రత్తిపాటి శరత్ ను బ్రెస్ట్ చేశారు వివరలోకి వెళితే ... GST పన్ను ఎగవేత కేసులో కృష్ణాజిల్లా విజయవాడ పరిధిలోని మాచవరం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎటువంటి కంపెనీలలో షేర్ హోల్డర్ గా లేని తన తనయుడిని అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేపించారని ప్రత్తిపాటి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సమాచారాన్ని అందుకున్న టిడిపి శ్రేణులు భారీ ఎత్తున ప్రత్తిపాటి నివాసానికి చేరుకుని అరెస్టుని ఖండిస్తూ ర్యాలీని నిర్వహించారు.

Share:

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-11-24T23:49:00-05:00&max-results=14&start=28&by-date=false&m=1

చిలకలూరిపేట రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో  అన్యాయంపై పోరాటం చేయడంలో ముందుండే నవతరం పార్టీ 15 మంది అసెంబ్లీ 15 మంది పార్లమెంటు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది.

నవతరంపార్టీ ఆంధ్రప్రదేశ్ 2024 సాధారణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా పార్లమెంట్ 15 మరియు అసెంబ్లీ 15 మొత్తం 30 మంది అభ్యర్థులను నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు చిలకలూరిపేటలోని నవతరంపార్టీ కార్యాలయంలో ప్రకటించారు. మంగళగిరి అసెంబ్లీ నుండి నారా లోకేష్ పై జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూరేలా తమ మేనిఫెస్టో ఉన్నదని అధికారంలోకి వచ్చిన వెంటనే తమ మేనిఫెస్టో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

అసెంబ్లీ నియోజకవర్గాలు అభ్యర్థులు: -

1) మంగళగిరి : శ్రీ రావు సుబ్రహ్మణ్యం

2)చిలకలూరిపేట : శ్రీమతి రావు రామతులసి

3)ప్రత్తిపాడు (sc) : శ్రీ మేరుగ విజయరాజు

4)తిరుపతి : శ్రీ షేక్ నౌషాద్ బాషా

5)పీలేరు : శ్రీమతి భుక్కే లలిత

6)తంబళ్లపల్లె : శ్రీ కొక్కాల శ్రీకాంత్

7)శ్రీకాళహస్తి : శ్రీ గానుగపెంట రమేష్

8)చీరాల : శ్రీ కొమరగిరి దుర్గారావు

9)సంతనూతలపాడు(ఎస్సి):శ్రీచెరుకూరి సుబ్బారావు

10)బాపట్ల : శ్రీ షేక్ కరీం

11)పర్చూరు: గోనుగుంట్ల వెంకట సుబ్బారావు

12)గుంటూరు తూర్పు : శ్రీ షేక్ అబ్దుల్ రజాక్

13)గుంటూరుపశ్చిమ:శ్రీవెల్లాల సాయి సుబ్రహ్మణ్యంరాజు

14)సత్తెనపల్లి:శ్రీ బక్కా వెంకట విఘ్నేశ్వరస్వామి

15)పెనుకొండ : ఎల్.ఆనంద్ కుమార్


*పార్లమెంట్ నియోజకవర్గాలు అభ్యర్థులు:*

1) శ్రీకాకుళం : శ్రీ నాయుడుగారి శేఖర్

2) విజయనగరం : శ్రీ పైడి గోవిందరావు

3)మచిలీపట్నం : శ్రీ కందుల చంద్రమౌళి

4)విజయవాడ :శ్రీ యణమండ్ర కృష్ణకిషోర్ శర్మ  

5)గుంటూరు: శ్రీమతి పోకూరి కవిత

6)నరసరావుపేట : శ్రీ చెల్లి దయారత్నం

7)బాపట్ల (ఎస్సి) : శ్రీ నలమాల తిరుపతిరావు

8)ఒంగోలు : శ్రీ వేమిశెట్టి యశ్వంత్

9)నంద్యాల : శ్రీ ఐ జె వెంకట రమణ

10)కర్నూల్ : శ్రీ తుడుము ఓబులేసు

11)   అనంతపూర్: శ్రీమతి హరిజన చాముండేశ్వరి

12)హిందుపూర్ : శ్రీ అల్లు మాలకొండ్రాయుడు

13)కడప : శ్రీ అల్లు వెంకటేశ్వర్లు

14)నెల్లూరు : శ్రీ తెనాలి రాంప్రసాద్

15)తిరుపతి (ఎస్సి) : శ్రీ Dr.కుక్కంబాకం చంద్రశేఖర్.

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం


Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి