|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు
చిలకలూరిపేట - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు
చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ నందు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీబీఎన్ ఆర్మీ, పట్టాన టీడీపీ యూత్, సీనియర్ నాయకులూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను పార్టీ ఉపాధ్యక్షులు కరీముల్లా గారు కట్ చేసారు. 4000 కోట్ల రూపాయలతో చిలకలూరిపేట నియోజకవర్గ రూపురేఖలు మార్చి వేసిన పుల్లారావు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వర్ధిలాలి అని తెలిపారు. పట్టణంలోని నిరాశ్రయులకు బిర్యానీ పంచిపెట్టారు. అలాగే బాపూజీ వృధాశ్రమం నందు బిర్యానీ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీనియర్ నాయకులు, యూత్ సభ్యులు, పార్టీ నాయకులూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చిలకలూరిపేట - వ్యాక్సిన్ తీసుకున్నవారికి కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అధికారులు - రావు సుబ్రహ్మణ్యం
చిలకలూరిపేట - వ్యాక్సిన్ తీసుకున్నవారికి కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అధికారులు - రావు సుబ్రహ్మణ్యం
చిలకలూరిపేట నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు శనివారం మధ్యాన్నం 3 గంటల సమయం లో రజక కాలనీ నందు ఉన్న ఆరోగ్య కేంద్రం నందు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకొని జిల్లా వైద్య అధికారులతో మాట్లాడారు. 240 వ్యాక్సిన్లు కేటాయిస్తే 50 మందికి మాత్రమే వేశారు. 190 వ్యాక్సిన్లు మిగిలాయి వాటిని కూడా అర్హులకు ఉపయోగించాలి అని . వాలటరీలు స్లిప్స్ ఇచ్చిన తరువాత వ్యాక్సిన్ కోసం అని ఇక్కడికి వస్తే 84 రోజులు గడిచాకే సెకండ్ డోస్ వేస్తాం అని చెప్పటంతో వాళ్ళు వెనుతిగారు అని ఇలా ప్రజలను అనవసరంగా వ్యాక్సిన్ సెంటలకు తిప్పటం పట్ల జిల్లా వైద్య అధికారుల పని తీరు పైనా ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారికీ కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నారు అని తెలిపారు. అలాగే కొన్ని వ్యాక్సిన్ సెంటర్లలో 2000 రూపాయలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అని వాటిపైన ద్రుష్టి పెట్టాలి అని తెలియజేసారు .






