|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం
చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం
చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం
చిలకలూరిపేట - పట్టణంలోని పండరీపురం 10 వ లైన్ లో గత రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం గురించి మా రిపోర్టర్ అక్కడికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. అది అగ్ని ప్రమాదం కాదు అని గతంలో కూడా రెండు సార్లు ఇలాంటి చర్యలకు పాల్బడ్డారు అని బాధితులు తెలిపారు.
ఆరికట్ల నరసమ్మ అనే 60 సంవత్సరాల మహిళా పొట్టకూటి కోసం అని చిలకలూరిపేట పండరీపురం 10వ లైన్ నందు బడ్డీ కొట్టు పెట్టుకొని బ్రతుకు సాగిస్తుంది. బుధవారం రాత్రి సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు ఆమె బడ్డీకొట్టు తగలబడటం చూసి ఆమెకు సమాచారం అందించే లోపే బంకు మొత్తం కాలిపోయేది. గత మూడు నెలల క్రితం 20 వేల రూపాయలతో చిన్న పాక నిర్మించుకున్నారు. బంకు లోని సరుకులు సామానులు, బంకు తో కలిపి లక్ష రూపాయల ఆస్థి నష్టం జరిగినట్లు ఆమె చెప్పి కన్నీరుమున్నీరు అయ్యారు. ముసలదానిని ఎవరిపైన ఆధార పడకుండా ఇలా బ్రతుకుతుంటే ఎవరో కావాలి అని ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె తెలిపారు. గతంలో కూడా ఇలాగే రెండు సార్లు బంకు తాళాలు పగులగొట్టిన ఘటనలు ఉన్నాయి అలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలి అని ఆమె కోరారు. అసలే కరోనా కష్ట కాలం మళ్ళి ఈ ఘటనతో నేను ఎలా బతకాలి అని ఆమె బాధపడ్డారు. అధికారులు చొరవతీసుకుని ఆమెకు ఆర్ధిక సాయం చెయ్యాలి అని స్థానికులు కోరారు







No comments:
Post a Comment