మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ అప్‌డేట్‌ల పేరిట పగటి దోపిడీ!

చిలకలూరిపేట - బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ అప్‌డేట్‌ల పేరిట పగటి దోపిడీ!

అధికంగా డబ్బులు గుంజుతున్నారని పట్టణవాసి నాయుడు శివ ఆరోపణ.. అధికారులకు వినతిపత్రం అందజేత.

​చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): కేంద్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలు కొందరు సిబ్బంది కాసుల కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా చిలకలూరిపేట పట్టణంలోని గాంధీపేటలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలోని ఆధార్ కేంద్రంలో అప్‌డేట్‌ల పేరుతో ప్రజల నుంచి ఇష్టానుసారంగా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త నాయుడు శివ తీవ్రంగా ఆరోపించారు.

​అసలేం జరిగిందంటే..

పట్టణంలోని సుబ్బయ్య తోట ప్రాంతంలో నివసించే నాయుడు శివ కుటుంబ సభ్యులు తమ ఆధార్ కార్డులో పేరు మార్పు, ఇతర అప్‌డేట్‌ల నిమిత్తం బుధవారం గాంధీపేట బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ పని పూర్తయిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన నిర్దేశిత రుసుము కాకుండా, సదరు కంప్యూటర్ ఆపరేటర్ దౌర్జన్యంగా అదనపు డబ్బులు డిమాండ్ చేసినట్లు శివ ఆరోపించారు. ఎందుకు ఎక్కువ అడుగుతున్నారని ప్రశ్నించిన వారిపై నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానం ఇచ్చారని మండిపడ్డారు.

​నిత్యం ఎంతో మంది సామాన్యులు, వృద్ధులు, విద్యార్థులు తమ ఆధార్ పనుల కోసం ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలబడితే.. ఇలాంటి ఆపరేటర్లు మాత్రం వారి అవసరాన్ని బట్టి జేబులు గుల్ల చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

​అధికారులకు ఫిర్యాదు.. చర్యలకు డిమాండ్

ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాయుడు శివ.. వెంటనే స్పందించి స్థానిక బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారిని స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్న సదరు కంప్యూటర్ ఆపరేటర్ పై, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు.

​ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఆధార్ కేంద్రం వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా 'ప్రభుత్వ నిర్దేశిత రుసుములతో కూడిన బోర్డు'ను ఏర్పాటు చేయాలని కోరారు. అమాయక ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, ఈ దందాను అరికట్టకపోతే ప్రజల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని ఆయన అధికారులకు విన్నవించారు.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - సీజ్ చేసిన గోడౌన్లలో మాయమైన బాణాసంచా.. అధికారుల రియాక్షన్ ఏంటి ?

చిలకలూరిపేట - సీజ్ చేసిన గోడౌన్లలో మాయమైన బాణాసంచా.. అధికారుల రియాక్షన్ ఏంటి ?

ఫైర్ సేఫ్టీ లేదు.. అనుమతులు లేవు.. ఇక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలకు గ్యారెంటీ లేదు!

​చిలకలూరిపేట ప్రజలారా అప్రమత్తం! మన పక్కనే ప్రాణాలను బలితీసుకునే డెత్ ట్రాప్‌లు ఉన్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. కాకినాడలో జరిగిన అగ్నిప్రమాదంలో 28 మంది అమాయకులు సజీవ దహనమైన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ క్రమంలో నిద్రలేచిన అధికారులు చిలకలూరిపేటలో తనిఖీలు చేపట్టగా... కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు మన ఊళ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

అసలేం జరిగింది?

​కాకినాడ ఘటన నేపథ్యంలో చిలకలూరిపేట రూరల్ పరిధిలోని బొప్పూడి, పసుమర్రు గ్రామాల పరిధిలో ఉన్న బాణాసంచా గోడౌన్లు, దుకాణాలపై జాయింట్ యాక్షన్ కమిటీ (రెవెన్యూ, పోలీస్, ఫైర్ విభాగాలు) కొరడా ఝుళిపించింది. రెండు రోజుల క్రితం ఒకసారి, ఈరోజు (గురువారం) మరోసారి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

​ఈ తనిఖీల్లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు ఇవే:

  • నిబంధనలు గాలికి: వ్యాపారం ప్రారంభించడానికి ముందు తీసుకోవాల్సిన కనీస 'ఫైర్ సేఫ్టీ' సర్టిఫికెట్లు ఇక్కడి దుకాణదారుల వద్ద లేవు.
  • అధికారుల నిర్ధారణ: చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లోని ఈ గోడౌన్లకు అసలు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, అనుమతులే లేవని స్వయంగా జిల్లా అధికారే స్పష్టం చేయడం గమనార్హం.

అతిపెద్ద ట్విస్ట్: తాళాలు అధికారుల దగ్గరే... సరుకు మాత్రం మాయం!

​ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలను, అధికారులను విస్మయానికి గురిచేసిన అసలు పాయింట్ మరొకటి ఉంది.

​నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మొన్నటి తనిఖీల్లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు బొప్పూడి పరిధిలోని బాణాసంచా గోడౌన్లను పరిశీలించి, వాటికి తాళాలు వేసి కీస్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కానీ, ఈరోజు (గురువారం) ట్రైనీ డీఎస్పీ, రూరల్ ఎస్సై అనిల్, మండల తహశీల్దార్ షేక్ హుస్సేన్ మరియు ఇతర శాఖల అధికారులు ఆ గోడౌన్లను అధికారికంగా తనిఖీ చేయడానికి వెళ్లి తాళాలు తెరిచారు. లోపల చూస్తే సరుకు (బాణాసంచా) లేదు! అధికారుల చేతిలో తాళాలు ఉండగానే... సీజ్ చేసిన గోడౌన్లలోంచి లక్షలాది రూపాయల బాణాసంచా ఎలా మాయమైంది? ఎటు వెళ్లింది? ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు? అనేది ఇప్పుడు చిలకలూరిపేటలో హాట్ టాపిక్‌గా మారింది.

చిలకలూరిపేట ప్రజల పక్షాన స్పీడ్ న్యూస్ అడుగుతున్న ప్రశ్నలు:

  1. ​ఎలాంటి అనుమతులు లేని ఈ మృత్యుకూపాలకు ఇన్నాళ్లూ కరెంట్ ఎలా ఇచ్చారు? వ్యాపారం ఎలా చేసుకోనిచ్చారు?
  2. ​సీజ్ చేసిన గోడౌన్ల నుంచి సరుకు రాత్రికి రాత్రే జనావాసాల్లోకి మారిందా? అయితే ప్రజల ప్రాణాలకు రక్షణ ఏది?
  3. ​అధికారుల కన్నుగప్పి సరుకును మాయం చేసిన వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు?

​కాకినాడ తరహా విషాదం మన చిలకలూరిపేటలో జరగకముందే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట రూరల్ - భర్త అనుమానం.. బలిగొన్న ప్రాణం

చిలకలూరిపేట రూరల్ - భర్త అనుమానం.. బలిగొన్న ప్రాణం

కట్టుబడివారిపాలెంలో విషాదం.. వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
అనాథలైన ముగ్గురు పసిపిల్లలు.. కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు
​చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): భర్త అనుమానం ఆ సంసారంలో చిచ్చురేపింది. కట్టుకున్న వాడే కక్ష కట్టడంతో ఆ వివాహిత తల్లడిల్లిపోయింది. రోజురోజుకూ వేధింపులు శృతిమించడంతో.. ఆ నరకం భరించలేక తన ప్రాణాలనే తీసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
​పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మక్కే తిరుమల (28) అనే మహిళను ఆమె భర్త వీరాంజనేయులు గత కొంతకాలంగా అనుమానంతో తీవ్రంగా వేధిస్తున్నాడు. భర్త పెట్టే శారీరక, మానసిక హింసను భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన తిరుమల జీవితంపై విరక్తి పెంచుకుంది. ఈ క్రమంలోనే గత నెల 28వ తేదీ (శుక్రవారం) సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి, ఓ శీతల పానీయంలో ఎలుకల మందు (పేస్టు) కలుపుకుని తాగేసింది.
​అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తిరుమలను హుటాహుటిన మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH)కి తరలించారు. దాదాపు వారం రోజుల పాటు అక్కడ మృత్యువుతో పోరాడిన తిరుమల.. పరిస్థితి విషమించడంతో ఈరోజు చికిత్స పొందుతూ కన్నుమూసింది.
​అనాథలైన ముగ్గురు పిల్లలు..
తిరుమల మృతితో కట్టుబడివారిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పసిప్రాయంలోనే తల్లి దూరం కావడంతో ఆ ముగ్గురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో అనాథలుగా మారారు. తల్లి లేని లోటును తలచుకుని వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
​తన కుమార్తె మరణానికి అల్లుడు వీరాంజనేయులు పెట్టిన వేధింపులే కారణమని, నిష్కారణంగా తన బిడ్డను పొట్టనబెట్టుకున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి తాటికొండ శివపార్వతి పోలీసులకు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి