ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ తీరుపై భగ్గుమన్న పల్నాడు: పులిగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ శవయాత్ర, దిష్టిబొమ్మ దహనం
పలానాడు : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ పల్నాడు జిల్లాలో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం జరిగింది.
అంతర్జాతీయ వేదికపై భారతదేశ సాంకేతిక ప్రగతిని దిగజార్చేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరించారని మండిపడుతూ, నరసరావుపేటలోని పల్నాడు రోడ్‌లో బీజేవైఎం పల్నాడు జిల్లా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి తమ తీవ్ర వ్యతిరేకతను తెలియజేశారు. ఏఐ సమ్మిట్‌లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం దేశానికి తీరని అవమానమని నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పాల్గొన్న ముఖ్య అతిథులు మరియు నాయకులు:
ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్,
బిజెపి జిల్లా ఇన్చార్జి కొక్కెర శ్రీనివాస్ హాజరయ్యారు.
వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ముఖ్య నాయకులు:
జన్నాభట్ల ఆదిత్య (బిజెపి ప్రధాన కార్యదర్శి )
గంటా విజయ భాస్కర్ రెడ్డి (బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి)
వంకాయలపాటి వంశీ ధర్ (బీజేవైఎం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్)
గట్టా హేమ కుమార్ (బిజెపి జిల్లా కార్యదర్శి)
తులాబందుల సత్యనారాయణ (బిజెపి ఎడ్లపాడు మండల అధ్యక్షులు)
తెల్లబాటి మనోహర్ (బీజేవైఎం చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు)
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు, బీజేవైఎం యువత మరియు అభిమానులు పాల్గొన్నారు.
- చిలకలూరిపేట స్పీడ్ న్యూస్
ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.




