మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట మానుకొండవారిపాలెం,దండమూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం --- హోమ్ గార్డ్ మృతి

చిలకలూరిపేట మానుకొండవారిపాలెం,దండమూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం --- హోమ్ గార్డ్ మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నుండి పెదనందిపాడు వెళ్లే మార్గంలోని మానుకొండవారిపాలెం , దండమూడి జంక్షన్ వద్ద చిలకలూరిపేట వస్తున్నహోమ్ గార్డ్ నిరీక్షణరావు ని నందిపాడు వైపు గా వెళ్తున్న మహేంద్ర మినీ వ్యాను ఢీ కొని మరణించారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని ఎంవి నారాయణపురం లో నివాసం ఉంటున్న వేముల నిరీక్షణరావు (46) గతం లో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ నందు హోమ్ గార్డ్గా  విధులు నిర్వహించారు. అయితే ప్రస్తుతానికి డిప్యుటేషన్ పైన గుంటూరు ఎన్ఫోర్స్మెంట్ నందు పని చేసున్నారు. అయితే ఈస్టర్ పండుగ సందర్భంగా స్వగ్రామం అయిన గరికపాడు లోని పెద్దల సమాధులకు రంగులు వేపించటానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినది. ప్రమాద సమయములో నిరీక్షణరావు హెల్మెట్ పెట్టుకున్నారు. కానీ అది పగిలిపోవటం వలన తలకు బలమైన గాయం తో అక్కడికి అక్కడే చనిపోయారు. పట్టణ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుదేహాన్ని పట్టణ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తోటి హోమ్ గార్డులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి చేరుకున్నారు. ఉదయమే తమతో పాటుగా కరోనా వ్యాక్సిన్ వేపించుకున్నాడు ఇంతలో ఇలా జరగటం ధిక్బ్రాంతి లోనయ్యారు. మృతుడికి ఒక పాప,ఒక బాబు, వారి భార్య సన్నిధి గారు ఆర్టీసీ నందు కండక్టర్ గా పనిచేస్తున్నారు. 

















Share:

చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ సెస్ వసూళ్ల హక్కులు వేలంపాట భారీ ధర పలికాయి.

  చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ సెస్ వసూళ్ల హక్కులు వేలంపాట భారీ ధర పలికాయి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ నందు బుధవారం నాడు సెస్ వసూళ్లు చేసుకునే హక్కుల వేలం నిర్వహించారు. గతంలో చంద్రమౌళి కూరగాయ మార్కెట్ హక్కుల విలువ 7 లక్షల రూపాయలు సంవత్సరానికి , 2021 సంవత్సరానికి గాను సర్కారివారి పాట నెలకు 90,420 గా నిర్ణయించారు. విడదల శేషగిరిరావు గారు 1,12,000 రూపాయలకి దకించుకున్నారు. ఆ లెక్కన సంవత్సరానికి 13,44,000 రూపాయలు అవుతుంది  గతం తో పోలిస్తే ఇది చాల ఎక్కువ . అలాగే సండ్రీ మార్కెట్, చేపల& మాంసము మార్కెట్ కు కూడా వేలం నిర్వహించారు. ( 1-04-2021 నుండి 31-03-2021 వరకు ) సండ్రీ మార్కెట్ సర్కారి వారి పాట 17,60,000 కాగా షేక్ నాసర్ వలి 17,64,000 గా , చేపల&మాంసము మార్కెట్ సర్కారు వారి పాట 1,60,000 కాగా షేక్ అబ్రహం 1,65,000 కి దక్కిన్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ముసిపల్ అధికారులు, కమిషనర్ పాల్గొన్నారు. 







Share:

చిలకలూరిపేటలో వరుసగా రెండవ రోజు కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

చిలకలూరిపేటలో వరుసగా రెండవ రోజు కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. 


https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో వరుసగా రెండవ రోజు కూడా 44 డిగ్రీల మార్క్ ని టచ్ అయింది. పట్టణ ప్రజలు రోడ్లు బయట తిరగకుండా లాక్ డౌన్ రోజులని తలపిస్తున్నాయి.  రోజు రోజు కి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పట్టణ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ఇలా ఉంటే రేపు వచ్చే రోహిణి కార్తీలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే భయం వేసేలా ఉంది. ఇప్పటికే విద్యార్థులకు స్కూళ్లు కి ఒంటిపూట బడులు మొదలుపెట్టటం వలన కొంచం ఇబ్బంది తెగినట్లే. ఇక ముసలివాళ్ళు సంగతి చెప్పే పనే లేదు ఉదయం వడగాలులు, సాయంత్రానికి ఉక్క,చమటలు తో సతమతం అవుతున్నారు. ఏది ఏమి అయినా పొద్దునే 11 గంటలకల్లా బయటపని చూసుకోవటం.  సాయంత్రం 5 గంటల వరకు బయటకి రావొద్దు. ఇక రోజువారీ కూలి పని చేసుకునే వారు, ముఠావారు, ఉద్యోగులు నీడ పట్టున ఉండటానికి ట్రై చెయ్యండి.  








Share:

చిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు

చిలకలూరిపేట- మానుకొండవారిపాలెం,ఏలూరు గ్రామ ప్రజల ధర్నా- కొంత సేపు ట్రఫిక్ అంతరాయం, MLA రజని చొరవతో అంతా సర్దుబాటు  

https://chilakaluripetspeednews.blogspot.com/


ఏలూరు- మానుకొండవారిపాలెం గ్రామస్థులు ధర్నా - వివరాలలోకి వెళ్తే గణపవరం లోని ప్రముఖ కంపెనీ,స్పిన్నింగ్ మిల్లుల నుండి వచ్చే వ్యర్ధాలను గణపవరం గ్రామం మీదుగా వచ్చే కుప్పగంజి వాగు లోకి కలుపుతున్నారు. అందువలన వాగులో నీరు కాలుష్యం ఎర్పడి రంగు మరి , అందులో ఉండే జలచరాలు చేపలు,కప్పలు భారీగా చనిపోతున్నాయి, అంతేకాకుండా ఆ వాగు నుండి వచ్చే నీరును మానుకొండవారిపాలెం , ఏలూరు ప్రజలు పంటల సేద్యానికి వాడుతుంటారు, కొందరు త్రాగునీరుగా వాడుతుంటారు. అయితే అక్కడి గ్రామ ప్రజలు ఈ కాలుష్యానికి అడ్డుకట్ట వేయటానికి  నిరసనగా ధర్నా చేపట్టారు. దాని వలన  రోడ్లు పైన ట్రాఫిక్ అంతరాయం ఎర్పడింది. విషయం తెలుసుకున్న MLA రజని గారు హుటా హుటిన అక్కడికి చేరుకొని వాగుని పరిశీలించారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

దీనిపైనా స్పందించిన రజని ఈ కాలుష్యానికి కారణం అయిన  కంపెనీల పైన తగు చర్యలు తీసుకుంటాని హామీ ఇచ్చారు. అలాగే ఆయా నీటిని శాంపిల్ తెలుసుకొని ల్యాబ్ కి పంపాలి అని ఆదేశించారు, రైతులకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని , ఏ కంపెనీ నుండి వ్యర్ధాలు నీటిలో కలవకూడదు అని , నీటిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైనా ఉన్నది అని, MLA రజని తో పాటుగా పోలీస్,పొల్యూషన్ అధికారులని, తహశీల్ధార్ సుజాత గారు,అక్కడికి చేరుకున్నారు. 

పొల్యూషన్ అధికారి AE శ్రీనివాసరావు మాట్లాడుతూ శాంపిళ్లను విజయవాడ ల్యాబ్ లకు పంపారు అని, ఒక వారం రోజులలో రిపోర్ట్స్ వస్తాయి అని, అప్పుడు ఆయా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటాం అని అవసరం అయితే మూసివేస్తాం అని హామీ ఇచ్చారు. అప్పటికిగాని గ్రామ ప్రజలు శాంతించారు. ఈ ధర్నాలో గ్రామా పెద్దలు , గ్రామ సర్పంచ్ లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు . 
https://chilakaluripetspeednews.blogspot.com/

  
https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/










Share:

చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు

చిలకలూరిపేట అర్బన్, రూరల్ ప్రాంతాలకు కొత్త SI లు  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట రూరల్, అర్బన్ ప్రాంతాలకు  కు కొత్త SI లు. పట్టణంలో అర్బన్ SI గా బాధ్యతలు నిర్వహిస్తున్న SI రాంబాబు గారిని యడ్లపాడు పోలీస్టేషన్ SI గా , పెదకూరపాడు SI గా విధులు నిర్వహిస్తున్న వేజండ్ల అజయ్ బాబు గారిని చిలకలూరిపేట టౌన్ SI గా, అలాగే గుంటూరు రూరల్ డి ఎస్ బి గా విధులు నిర్వహిస్తున్న ఆళ్ళ మోహన్ రెడ్డి గారిని చిలకలూరిపేట రూరల్ SI గా  బాధ్యతలు స్వీకరించనున్నారు. 








Share:

యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS

యడ్లపాడు SI గా నియమితులు అయిన SI పైడి రాంబాబు గారికి శుభాకాంక్షలు -- CHILAKALURIPET SPEED NEWS 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొంతకాలంగా చిలకలూరిపేట లో SI గా తన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిస్తూ. పట్టణ ప్రజల రక్షణకై శ్రమిస్తూ ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయంలో చిలకలూరిపేటకు  విశిష్టమైన సేవలు అందించిన SI పైడి రాంబాబు గారికి పట్టణ ప్రజల తరుపున ప్రత్యేక  ధన్యవాదాలు.  లాక్ డౌన్ సమయంలో అక్రమ మద్యం పైన ఉక్కు పాదం, పేకాట శిబిరాల పైనా దాడులు,  అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టలు వేసి, విధి నిర్వహణలో తనకి తానే సాటి అనీ విధంగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మన యంగ్ డైనమిక్ పోలీస్ SI రాంబాబు గారు యడ్లపాడు SI గా బదిలీ అయ్యారు. ఎక్కడ ఉన్న మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటు -- చిలకలూరిపేట ప్రజల తరుపున CHILAKALURIPETA SPEED NEWS తరుపున శుభాకాంక్షలు. 







Share:

చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

 చిలకలూరిపేటలో అక్రమ రేషన్ బియ్యం  పట్టివేత 


https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలో అక్రమంగా  రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. వివరాలలోకి వెళ్తే బుధవారం పట్టణంలోని శాంతినగర్ లో ఓ మిని లారీ లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు అనే సమాచారం తెలుసుకున్న పోలీసులు . హుటాహుటిన అక్కడికి చేసుకొని వాహనాన్ని అర్బన్ పోలీసుస్టేషన్ కి తరలించారు. ఆయా వాహనంలో సుమారు 150 క్వింటా బియ్యం ఉన్నట్లు సమాచారం. 









Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి