మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

భార్యని 'ఎర'గా వేసిన భర్త.. ఆపై పడక గదిలో సీక్రెట్ వీడియోలు - డాక్టర్లు, వ్యాపారులే టార్గెట్.. కటకటాల్లో కిలాడీ జంట! అసలు ఏం జరిగింది?

భార్యని 'ఎర'గా వేసిన భర్త.. ఆపై పడక గదిలో సీక్రెట్ వీడియోలు - డాక్టర్లు, వ్యాపారులే టార్గెట్.. కటకటాల్లో కిలాడీ జంట! అసలు ఏం జరిగింది? 

భర్త డైరెక్షన్.. భార్య యాక్షన్! ఈజీ మనీ కోసం 'హనీ ట్రాప్'.. కటకటాలపాలైన కిలాడీ దంపతులు

​వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, ఈజీ మనీకి అలవాటుపడి సొంత భార్యనే ఎరగా వేసి అమాయకులను నిండా ముంచిన ఓ జంట బాగోతం కరీంనగర్‌లో బట్టబయలైంది. సోషల్ మీడియాలో పరిచయాలతో మొదలై, బెదిరింపులతో లక్షలు దండుకుంటున్న వీరి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసలేం జరిగింది?

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకటాపురానికి చెందిన సందింటి శరత్ కుమార్ రెడ్డి, అతని భార్య లలిత గత పదేళ్లుగా కరీంనగర్‌లోని ఆరెపల్లిలో నివాసం ఉంటున్నారు.

  • ​శరత్ కుమార్ రెడ్డి మార్బుల్ మరియు ఇంటీరియర్ వ్యాపారం చేసేవాడు. అందులో భారీగా నష్టాలు రావడం, చేసిన అప్పులు, ఫ్లాట్ ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడ్డారు.
  • ​దీంతో కష్టపడి సంపాదించడం కన్నా, అడ్డదారిలో డబ్బు సంపాదించడమే మేలని భావించిన భర్త.. భార్యతో కలిసి 'హనీ ట్రాప్' ప్లాన్ రచించాడు.

వలపు వల.. సీక్రెట్ రికార్డింగ్:

ఈ మోసానికి సోషల్ మీడియానే ప్రధాన వేదికగా మార్చుకున్నారు.

  • ​భార్య లలిత తన యూట్యూబ్ ఛానల్ (Karimnagar Pilla 123) మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన రీల్స్, అర్ధనగ్న ఫోటోలు పోస్ట్ చేస్తూ యువకులను, డబ్బున్న వారిని ఆకర్షించేది.
  • ​వారితో ఛాటింగ్ చేసి, మాయమాటలతో నమ్మించి తన ఫ్లాట్‌కు పిలిపించుకునేది.
  • ​వచ్చిన వారితో ఆమె ఏకాంతంగా, చనువుగా ఉన్న సమయంలో భర్త శరత్ కుమార్ రెడ్డి చాటుగా వీడియోలు చిత్రీకరించేవాడు.
  • ​ఆ తర్వాత ఆ వీడియోలు బాధితులకు పంపి, డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించి లక్షలకు లక్షలు వసూలు చేసేవారు.

లారీ ఓనర్ ఫిర్యాదుతో వెలుగులోకి:

గత మూడేళ్లుగా డాక్టర్లు, వ్యాపారులు, విద్యార్థులు ఇలా సుమారు 100 మందికి పైగా వీరి వలలో చిక్కుకున్నట్లు సమాచారం. వీరి నుంచి వసూలు చేసిన డబ్బుతో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఖరీదైన కారు, ఫర్నిచర్ కూడా కొనుగోలు చేశారు.

​అయితే, ఇటీవల కరీంనగర్‌కు చెందిన ఓ 27 ఏళ్ల లారీ యజమానిని ఇదే రీతిలో ట్రాప్ చేసి విడతల వారీగా రూ.13 లక్షలు వసూలు చేశారు. చివరగా మరో 5 లక్షలు ఇవ్వాలని వేధించడంతో, బాధితుడు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించి ఆధారాలు సమర్పించాడు. దీంతో రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు ఈ కిలాడీ దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ హెచ్చరిక:

సోషల్ మీడియాలో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, అందమైన ఫోటోలు చూసి మోసపోకండి. తెలియని వ్యక్తులతో చనువుగా ఉంటూ, ఏకాంతంగా కలుస్తున్నారంటే అది మీ జీవితాన్ని నాశనం చేసే ఉచ్చు కావచ్చు. లైక్, కామెంట్ల వరకు ఓకే.. కానీ హద్దు దాడితే నిలువునా గుండు గీయించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త!

​☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.

​💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!

​🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.

​📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423

 చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

​చిలకలూరిపేట మొదటిరోజు ఎడ్ల పందాల విజేతలు వీరే!

చిలకలూరిపేట మొదటిరోజు ఎడ్ల పందాల విజేతలు వీరే!

చిలకలూరిపేట: సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 'పాల పళ్ళ విభాగం'లో మొత్తం 29 జతల ఎడ్లు పాల్గొనగా, పోటీలు హోరాహోరీగా సాగాయి.

​ఈ విభాగం విజేతలకు బహుమతులను చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు. మొదటి రోజు పోటీలకు పూర్తి ప్రైజ్ మనీని చిలకలూరిపేటకు చెందిన కావూరి రమేష్ బాబు స్పాన్సర్ చేశారు.

🏆 విజేతల వివరాలు (పాల పళ్ళ విభాగం):

  • ​🥇 ప్రథమ బహుమతి (రూ. 25,000/-):
    • యజమాని: కన్నెదార రామ్ తేజ చౌదరి (పెదకూరపాడు)
    • లాగిన దూరం: 3,943 అడుగుల 7 అంగుళాలు
  • ​🥈 ద్వితీయ బహుమతి (రూ. 20,000/-):
    • యజమాని: తల్లపునేని సుధీర్ (బయ్యారం & జె. పంగులూరు)
    • లాగిన దూరం: 3900 అడుగులు
  • ​🥉 తృతీయ బహుమతి (రూ. 18,000/-):
    • యజమాని: డాక్టర్ కాకాని వెంకట సురేంద్ర (వినుకొండ)
    • లాగిన దూరం: 3873 అడుగుల 9 అంగుళాలు
  • 4వ బహుమతి (రూ. 16,000/-):
    • యజమాని: చండ్ర వెంకటేశ్వర రావు (నందలూరు)
    • లాగిన దూరం: 3840 అడుగులు
  • 5వ బహుమతి (రూ. 14,000/-):
    • యజమాని: దేవాభక్తుని చక్రవర్తి (కానూరు)
    • లాగిన దూరం: 3730 అడుగుల 4 అంగుళాలు
  • 6వ బహుమతి (రూ. 12,000/-):
    • యజమాని: మండవ సూరిబాబు మరియు దినేష్ చౌదరి (కోమటినేనివారి పాలెం)
    • లాగిన దూరం: 3703 అడుగుల 8 అంగుళాలు
  • 7వ బహుమతి (రూ. 10,000/-):
    • యజమాని: గోర్ల గోపాల్ (రాజాంపల్లె)
    • లాగిన దూరం: 3631 అడుగుల 6 అంగుళాలు
  • 8వ బహుమతి (రూ. 8,000/-):
    • యజమాని: తోట ధనుంజయ నాయుడు (అంచులవారి పాలెం)
    • లాగిన దూరం: 3601 అడుగుల 3 అంగుళాలు
  • 9వ బహుమతి (సంయుక్త విజేతలు - చెరో రూ. 6,000/-):
    • ​ఈ స్థానంలో ఇద్దరు రైతులు సమాన ప్రతిభ కనబరిచారు.
      • ​పోరుమళ్ల శివ మార్కండేయలు (గోరంట్ల)
      • ​బైరెడ్డి లక్ష్మీరెడ్డి (బండి ఆత్మకూరు)
    • లాగిన దూరం: 3600 అడుగులు (ఇరువురికీ రూ. 6000 చొప్పున అందించారు).

🎁 ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు:

పోటీలో పాల్గొని విజేతలుగా నిలవలేకపోయిన మిగిలిన 20 జతల ఎడ్ల యజమానులను నిరాశపరచకుండా, ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున కంసోలేషన్ బహుమతిని అందజేసి నిర్వాహకులు రైతులను సత్కరించారు

​☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.

​💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!

​🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.

​📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423

 చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేటలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి: అన్న స్మరణలో తరించిన పట్టణం.. రాజకీయాలకు దిక్సూచి ఎన్టీఆర్ అని కొనియాడిన ప్రత్తిపాటి, లావు, గొట్టిపాటి

చిలకలూరిపేటలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి: అన్న స్మరణలో తరించిన పట్టణం.. రాజకీయాలకు దిక్సూచి ఎన్టీఆర్ అని కొనియాడిన ప్రత్తిపాటి, లావు

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణం ఆదివారం ఎన్టీఆర్ నామస్మరణతో పులకించింది. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు, స్మారక సభల్లో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా పాల్గొని, ఆ మహానేతకు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయనొక మహాశక్తి అని, తెలుగు రాజకీయ చరిత్రను 'ఎన్టీఆర్ కు ముందు, ఎన్టీఆర్ కు తర్వాత' అనేంతలా ప్రభావితం చేసిన యుగపురుషుడని నేతలు కొనియాడారు. అనేక ప్రజాకర్షక పథకాలు, సామాజిక సంస్కరణలతో తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ధీరోధాత్తుడు ఎన్టీఆర్ అని వారు స్మరించుకున్నారు. అఖిల భారతావని మెచ్చేలా ఆయన సాగించిన సుపరిపాలన నేటికీ ఎందరో రాజకీయ నాయకులకు దిక్సూచిగా నిలిచిందని ప్రత్తిపాటి, లావు పేర్కొన్నారు.
​వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఎన్.ఆర్.టీ కూడలిలో పండుగ వాతావరణం నెలకొంది. అక్కడి ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక మోటార్ మెకానిక్స్ వర్కర్లు, చిరు వ్యాపారులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ స్వయంగా పేదలకు, కార్యకర్తలకు ఆహార పదార్థాలను వడ్డించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. అన్నగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ నిజంగా కారణజన్ముడని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు.
​అనంతరం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూటమి నాయకులతో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని అడ్డరోడ్డు, కళామందిర్ సెంటర్, భవనృషి నగర్ (32వ వార్డు), సుగాలీ కాలనీ, 26, 27, 34, 35 వార్డులతో పాటు, గ్రామీణ ప్రాంతాలైన పసుమర్రు, గోరంట్లవారిపాలెం, నాగభైరువారిపాలెం గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. 7వ వార్డులో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాటి చేతుల మీదుగా సుమారు 300 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

​☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.
​💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!
​🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.
​📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423

 చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 
Share:

చిలకలూరిపేట వైసీపీలో కొత్త జోష్.. పార్టీ బలోపేతంపై మాజీ మంత్రి విడదల రజినీ స్పెషల్ ఫోకస్!

చిలకలూరిపేట వైసీపీలో కొత్త జోష్.. పార్టీ బలోపేతంపై మాజీ మంత్రి విడదల రజినీ స్పెషల్ ఫోకస్!

చిలకలూరిపేట: పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో పార్టీ సంస్థాగత కమిటీ నిర్మాణం, కార్యకర్తల ఆత్మీయ సమావేశం మాజీ మంత్రి విడదల రజినీ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజర్ సుధాకర్ బాబు, పరిశీలకులు చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముఖ్యాంశాలు:

  • జగన్ అంతటి వాడే రజినీ సలహాలు తీసుకుంటారు: రాష్ట్ర రాజకీయాల్లో విడదల రజినీకి మంచి గుర్తింపు ఉందని, సాక్షాత్తు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమె సలహాలు తీసుకుంటారని టీజర్ సుధాకర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
  • లోకల్ సెంటిమెంట్: తాను చిలకలూరిపేట నియోజకవర్గంలోని తూబాడు గ్రామానికి చెందిన వ్యక్తినని, రజినీ గారిని గెలిపించే బాధ్యత తనపై ఉందని సుధాకర్ బాబు ఉద్ఘాటించారు.
  • గత తప్పులు సరిదిద్దుకుందాం: గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా, స్థానిక నాయకత్వాన్ని బలపరిచేలా పార్టీ అధిష్టానం స్పెషల్ డ్రైవ్ చేపట్టిందని పరిశీలకులు చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు.
  • కూటమి అరాచకాలపై పోరు: ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మాజీ మంత్రి విడదల రజినీ పిలుపునిచ్చారు.
  • వార్డుకో అబ్జర్వర్: త్వరలోనే తానే స్వయంగా వచ్చి ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు ఒక పరిశీలకుడిని నియమిస్తానని రజినీ స్పష్టం చేశారు.

​పార్టీని గ్రామ, వార్డు స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

​☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.

​💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!

​🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.

​📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423

 చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

​చిలకలూరిపేట రూరల్: ఎడ్ల పందేల సరదా మిగిల్చిన విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

​చిలకలూరిపేట రూరల్: ఎడ్ల పందేల సరదా మిగిల్చిన విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిలకలూరిపేట స్పీడ్ న్యూస్:

సరదాగా ఎడ్ల పందేలు చూసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. బైక్‌పై వెళ్తుండగా మరో వాహనం ఢీకొనడంతో క్షణాల్లోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ హృదయవిదారక ఘటన చిలకలూరిపేట రూరల్ పరిధిలో చోటుచేసుకుంది.

📍 ప్రమాదం ఎలా జరిగింది?

నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన గాండ్రు వేణుగోపాలకృష్ణ (48) ప్రస్తుతం చిలకలూరిపేట పండరీపురంలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం అన్నంబోట్లవారిపాలెంలో జరుగుతున్న ఎడ్ల పందేలను వీక్షించేందుకు ఆయన తన బుల్లెట్ వాహనంపై ఉత్సాహంగా బయలుదేరారు.

​అయితే, పసుమర్రు గ్రామ సమీపంలోని కొత్త NH-167A రోడ్డుపై లక్ష్మి లలిత కోల్డ్ స్టోరేజ్ వద్దకు రాగానే విధి వక్రించింది. అన్నంబోట్లవారిపాలెం వైపు నుండి అతివేగంగా వచ్చిన ఓ షైన్ మోటార్ సైకిల్ ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేణుగోపాలకృష్ణ తలకు తీవ్ర గాయాలై, రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

🚓 కేసు నమోదు - విచారణ

మృతుని భార్య దీప్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

🕯️ విషాదంలో కుటుంబం

ఎంతో ఉల్లాసంగా పందేలకు వెళ్లిన వేణుగోపాలకృష్ణ విగతజీవిగా మారడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో అప్పాపురం, పండరీపురం ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిరంతర తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి..

- చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

​☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.

​💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!

​🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.

​📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423

 చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట సుబ్బయ్యతోటలో అదరగొట్టిన సంక్రాంతి సంబరాలు - చుట్టుపక్కల గ్రామాల నుండి భారీగా పాల్గొన్న మహిళలు

చిలకలూరిపేట సుబ్బయ్యతోటలో అదరగొట్టిన సంక్రాంతి సంబరాలు - చుట్టుపక్కల గ్రామాల నుండి భారీగా పాల్గొన్న మహిళలు 

చిలకలూరిపేట స్పీడ్ న్యూస్:

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. వీ.కే. (V.K.) ఫ్రెండ్ సర్కిల్ మరియు సుబ్బయ్య తోట యూత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మన సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి చాటిచెప్పేలా జరిగిన ఈ వేడుకలు స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

​ముఖ్యంగా ఈ వేడుకల్లో సుబ్బయ్య తోట యువకుల ఉత్సాహం, చొరవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంచి పని ఎక్కడున్నా, పండుగ సంబరం ఏదున్నా తాము ఎప్పుడూ ముందే ఉంటామని సుబ్బయ్య తోట యువత మరోసారి నిరూపించుకున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను భుజాన వేసుకొని నిర్వహించడం వీరికి పరిపాటిగా మారింది. పండుగ వాతావరణంలో వారు సృష్టించే కోలాహలం స్థానికుల్లో కొత్త జోష్‌ను నింపింది. మన సంస్కృతిని కాపాడాలనే వారి తపనను స్థానికులు ఘనంగా కొనియాడారు.

​వేడుకల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు కేవలం చిలకలూరిపేట పట్టణమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల నుంచి, అంతెందుకు గుంటూరు నగరం నుండి కూడా యువతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారు వేసిన రంగురంగుల ముగ్గులతో ఆ ప్రాంగణమంతా ఇంద్రధనస్సు నేలకి దిగివచ్చినట్లుగా కళకళలాడింది.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలావతి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లావు సుష్మ గారు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాశ్చాత్య పోకడలు పెరుగుతున్న ఈ రోజుల్లో గ్రామీణ కళలను, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో సుబ్బయ్య తోట యువత లాంటి వారు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, ఇలాంటి సృజనాత్మక రంగాల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ సుష్మ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మొత్తానికి తెలుగుదనం ఉట్టిపడేలా జరిగిన ఈ వేడుకల్లో స్థానిక నేతలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

​⚡ కరెంట్ బిల్లుల మోతతో బెంబేలెత్తుతున్నారా? ⚡

​ఇక ఆ చింత మానుకోండి! ☀️ ఆదిత్య సోలార్‌తో మీ ఇంటిని వెలిగించుకోండి.

​✅ మీ కరెంట్ బిల్లును పూర్తిగా 0 (జీరో) చేసుకోండి.

✅ కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 78,000/- వరకు భారీ సబ్సిడీని పొందండి. 🇮🇳

​సౌరశక్తిని వాడండి - డబ్బులు ఆదా చేయండి! 💰

​మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:

☀️ ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, చిలకలూరిపేట

📞 +91 8074300423

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట రూరల్ - ఎస్సై కారు ఢీకొని వృద్ధుడు మృతి

చిలకలూరిపేట రూరల్ - ఎస్సై కారు ఢీకొని వృద్ధుడు మృతి 
చిలకలూరిపేట మండలం పోతవరంలో సంక్రాంతి రోజున ఘోర ప్రమాదం జరిగింది. ఉప్మాగులూరుకు చెందిన దండ వీరయ్య (63) బైక్‌పై పాలకేనులతో వెళ్తుండగా, ఎర్రగొండపాలెం ఎస్సై ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.
​పోతవరం వైయస్సార్ విగ్రహం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన వీరయ్యను చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పండగ నాడు ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

​⚡ కరెంట్ బిల్లుల మోతతో బెంబేలెత్తుతున్నారా? ⚡
​ఇక ఆ చింత మానుకోండి! ☀️ ఆదిత్య సోలార్‌తో మీ ఇంటిని వెలిగించుకోండి.
​✅ మీ కరెంట్ బిల్లును పూర్తిగా 0 (జీరో) చేసుకోండి.
✅ కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 78,000/- వరకు భారీ సబ్సిడీని పొందండి. 🇮🇳
​సౌరశక్తిని వాడండి - డబ్బులు ఆదా చేయండి! 💰
​మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
☀️ ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, చిలకలూరిపేట
📞 +91 8074300423

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

​#Chilakaluripet #RoadAccident #Pothavaram #Tragedy #SpeedNews #PoliceInvestigation
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి