మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Showing posts with label గొట్టిపాటి. Show all posts
Showing posts with label గొట్టిపాటి. Show all posts

చిలకలూరిపేటలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి: అన్న స్మరణలో తరించిన పట్టణం.. రాజకీయాలకు దిక్సూచి ఎన్టీఆర్ అని కొనియాడిన ప్రత్తిపాటి, లావు, గొట్టిపాటి

చిలకలూరిపేటలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి: అన్న స్మరణలో తరించిన పట్టణం.. రాజకీయాలకు దిక్సూచి ఎన్టీఆర్ అని కొనియాడిన ప్రత్తిపాటి, లావు


తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణం ఆదివారం ఎన్టీఆర్ నామస్మరణతో పులకించింది. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు, స్మారక సభల్లో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా పాల్గొని, ఆ మహానేతకు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయనొక మహాశక్తి అని, తెలుగు రాజకీయ చరిత్రను 'ఎన్టీఆర్ కు ముందు, ఎన్టీఆర్ కు తర్వాత' అనేంతలా ప్రభావితం చేసిన యుగపురుషుడని నేతలు కొనియాడారు. అనేక ప్రజాకర్షక పథకాలు, సామాజిక సంస్కరణలతో తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ధీరోధాత్తుడు ఎన్టీఆర్ అని వారు స్మరించుకున్నారు. అఖిల భారతావని మెచ్చేలా ఆయన సాగించిన సుపరిపాలన నేటికీ ఎందరో రాజకీయ నాయకులకు దిక్సూచిగా నిలిచిందని ప్రత్తిపాటి, లావు పేర్కొన్నారు.
​వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఎన్.ఆర్.టీ కూడలిలో పండుగ వాతావరణం నెలకొంది. అక్కడి ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక మోటార్ మెకానిక్స్ వర్కర్లు, చిరు వ్యాపారులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ స్వయంగా పేదలకు, కార్యకర్తలకు ఆహార పదార్థాలను వడ్డించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. అన్నగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ నిజంగా కారణజన్ముడని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు.
​అనంతరం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూటమి నాయకులతో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని అడ్డరోడ్డు, కళామందిర్ సెంటర్, భవనృషి నగర్ (32వ వార్డు), సుగాలీ కాలనీ, 26, 27, 34, 35 వార్డులతో పాటు, గ్రామీణ ప్రాంతాలైన పసుమర్రు, గోరంట్లవారిపాలెం, నాగభైరువారిపాలెం గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. 7వ వార్డులో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాటి చేతుల మీదుగా సుమారు 300 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

​☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.
​💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!
​🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.
​📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423

 చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి