చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 19-06-2021 శనివారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట - RTC బస్టాండ్ వద్ద రోడ్డు ఆక్సిడెంట్ - ఒకరు మృతి
చిలకలూరిపేట - ప్రత్తిపాటి విలేకర్ల సమావేశానికి కౌంటర్ గా వెంటనే విలేకర్ల సమావేశం ఎర్పాటు చేసిన వైస్సార్సీపీ నాయకులు
చిలకలూరిపేట - ప్రత్తిపాటి విలేకర్ల సమావేశానికి కౌంటర్ గా వెంటనే విలేకర్ల సమావేశం ఎర్పాటు చేసిన వైస్సార్సీపీ నాయకులు
చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ప్రత్తిపాటి వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో యార్డు చెర్మన్ బొల్లెద్దు చిన్న,మునిసిపల్ చెర్మన్ రఫాని,తలహ ఖాన్ పాల్గొన్నారు.
ముందుగా యార్డు చెర్మన్ చిన్న మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గురించి విమర్శించే అర్హత నీకు లేదు అని, ఎడవల్లి భూముల గురించి మాట్లాడాలి అనే మొదటిగా వారికీ క్షమాపణ చెప్పాలి అని. మీరు అధికారంలో ఉన్నపుడే దళితుల పైనా దాడులు జాగాయి. చీరాల రోడ్డులో, పోలిరెడ్డిపాలెం నందు చర్చిలను కూల్చింది మీరే ఎస్.సి లకు మొదటి నుండి మీరు చేసిన అన్యాయాన్ని మర్చిపోరు అని, మీరు చేసిన అన్యాయాలకు మొదటి నుండి అడ్డుకట్ట వేస్తుంది వైస్సార్సీపీ ప్రభుత్వం అని, ఖచ్చితంగా సీఎం గారు ఇచ్చిన హామీ మేరకు ఎడవల్లి రైతులకు న్యాయం చేస్తాం అని తెలిపారు.
మునిసిపల్ చెర్మన్ రఫాని మాట్లాడుతూ అక్రమం గురించి మీరు మాట్లాటం సిగ్గుచేటు అని, మీరు అధికారంలో ఉన్నపుడు అక్రమాలను పాతుకుపోయేలా చేసారు. మా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మీరు చేసిన అక్రమాలను కూకటివేళ్లతో సహా పీకివేయటానికి మాకు రెండు సంవత్సరాలు పట్టింది అని, మేము గెలిచినా వెంటనే MLA రజిని గారు మొదటిగా పేకాట సామ్రాజ్యం అయిన CR క్లబ్ మూసివేశం అని సొంత పార్టీ వాళ్లు అయినా అక్రమాలకు, పేకాట లాంటి వాటిలలో పాల్పడిన కఠిన చర్యలు తప్పవు అని రజిని గారు తెలిపారు అని గుర్తుచేశారు. జరిగిన మునిసిపల్ ఫలితాలు, రాబోవు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు రజిని గారి పాలనకు నిదర్శనం అని తెలిపారు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 18-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట - స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు
అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట - స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట - మాజీ మినిష్టర్ ప్రత్తిపాటి పుల్లారావు ఏంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో నేను అధికారంలో ఉన్నపుడు ఎన్నిక ప్రచారంలో దళిత భూముల విషయంలో తన పైన విమర్శలు చేసిన జగన్ మోహనరెడ్డి ఈ రోజు అధికారంలో ఉండి అదే దళిత భూములను ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుంది అని ప్రశ్నించారు. స్థానిక నాయకులు నేతలు కూడా దీని పైనా మౌనం వహించటం ఏంటని, అలాగే దీని పైనా జగన్ మోహన రెడ్డి స్పష్టత ఇవ్వాలి అని అన్నారు. దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని దిని పైనా పోరాటం చేస్తాం అని తెలిపారు. అలాగే చిలకలూరిపేట అధికారం అడ్డం పెట్టుకొని అక్రమ దందా సాగిస్తున్నారు అని 175 నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా అక్రమ మద్యం,పేకాట, గుట్కా వ్యాపారాలకు కేరాఫ్ గా మార్చారు, ఎక్కడో పక్క జిల్లా పోలీసులు ఇక్కడ అక్రమ గుట్కాలు పట్టుకునే వరకు ఎక్కడ పొలిసువారు ఎందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నించారు.
సెంట్రల్ గవర్నమెంట్ జర్నలిస్ట్ లను ఫరంట్ లైన్ వర్కర్లుగా గుర్తించినా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అని , మరణించిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు 50 లక్షల ఆర్ధిక నష్టం చెలించాలి అని డిమాండ్ చేసారు.












