చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
చిలకలూరిపేట - గుంటూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
గుంటూరు - చిలకలూరిపేట నేషనల్ హైవే మధ్యలో ఆటో ప్రైవేటు బస్సుని ఢీకొనడంతో ఆటోలో ఉన్న వ్యక్తితో పాటు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఈనాడు ఆఫీస్ సమీపంలో రాత్రి ఒంటిగంట సమయంలో విజయవాడ నుండి కడప వెళ్తున్న జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సును ఆటో ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఆటోలో డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఆటోని రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి బస్సును ఢీకొన్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఆటోలో ఉన్న వ్యక్తులు మధ్య మధ్యలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆటోలోని వ్యక్తులు కోండ్రుపాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన అనంతరం రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో హుటాహుటిన ట్రాఫిక్ పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించారు.
Follow below






No comments:
Post a Comment