మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో గుట్కా, ఖైనీ విక్రయించేవారిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు

 చిలకలూరిపేటలో గుట్కా, ఖైనీ విక్రయించేవారిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో కృష్ణారెడ్డి డొంక నందు గుట్కా, ఖైనీ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి 3500 పాకెట్లను సీజ్ చేసారు అధికారులు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిని కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  


































 

Share:

చిలకలూరిపేటలో ఇలా వ్యాక్సిన్ కోసం అని వెళ్తే కరోనా కచ్చితంగా వస్తుంది

చిలకలూరిపేటలో ఇలా వ్యాక్సిన్ కోసం అని వెళ్తే కరోనా కచ్చితంగా వస్తుంది
https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట శాలిపేట నందు ఉన్న డిస్పెన్సరీ వద్ద వ్యాక్సిన్ కోసం గుంపులు గుంపులుగా ప్రజలు. కరోనా భయంతో ప్రజలు వ్యాక్సిన్ బాట పట్టారు కానీ వెళ్ళే చోటే కరోనా ప్రమాదం పొంచి ఉన్నది అని అర్ధం చేసుకోలేకపోతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించమని రోజు టీవీలలో, మైకులలో,అవగాహన కలిపిస్తుంటే. వీరు మాత్రం ఇలా ! , వాక్సిన్ వేసుకుంటే కరోనా భయం తగ్గుతుంది కానీ వాక్సిన్ ఉన్న ఏరియాలో ఉంటే కరోనా రాదు అని ఎవరు చెప్పలేదు కదా ! వ్యాక్సిన్ ప్రక్రియ రెండు రోజులలో అయిపోతుంది అన్నట్లుగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. దయచేసి ఇలా ఉన్న చోటే కరోనా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నాకు లేదు కదా అనుకుంటే పొరపాటే ప్రక్కవాడికి  ఉంటే మీరు ఏంచేస్తారు. వ్యాక్సిన్ వేపించుకున్నాం అని అనుకున్నటున్నారు కానీ దగర ఉండి కరోనని ఇంటికి తీసుకువెతున్నాం అని ఎవరు ఏలోచించటం లేదు అని తెలిపే చిత్రం ఇది.    



https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/


























Share:

చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ ను వైయస్ఆర్ కూరగాయల మార్కెట్ గా పేరు మార్పు

చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ ను వైయస్ఆర్ కూరగాయల మార్కెట్ గా పేరు మార్పు

https://chilakaluripetspeednews.blogspot.com/


ఒకప్పటి దేవాదాయ మినిస్టర్ అయిన కల్లూరి చంద్రమౌళిగారి చేతుల మీదుగా అప్పటి చిలకలూరిపేట పంచాయితీ లో మొదటిసారిగా ఎర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ కు గుర్తుగా చంద్రమౌళి కూరగాయల మార్కెట్ గా నామకరణం చేసారు. ఈ రోజు జరిగిన కౌంసిల్ సమావేశంలో షేక్ రాఫ్ఫాని గారి అధ్యక్షతన సభ్యుల ఆమోదం మేరకు చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరును వైయస్ఆర్ కూరగాయల మార్కెట్ గా పేరు మార్చారు. 

















Share:

యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్

యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/


యడ్లపాడు భూషయ్య నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్- వివరాల్లోకి వెళ్తే గరికపాడు చెక్ పోస్ట్ వద్ద TSRTC బస్సు నందు నిర్వహించిన తనిఖీలలో 100 రెమిడేసివర్ ఇంజక్షన్ లను తరలిస్తూ పట్టుబడ్డారు. వీటి విలువ దాదాపు బ్లాక్ మార్కెట్లో 45 లక్షలు ఉండవొచ్చు అని అంచనా. పోలీసులకు అందిన సమాచారం మేరకు హైదరాబాద్ నందు ల్యాండ్ మార్క్ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్ డాక్టర్గా పనిచేస్తున్న భవ్య  ద్వారా తీసుకువస్తునట్లు సమాచారం. రేపు ఆమెని కూడా విచారించి ఎక్కడి నుండి తీసుకువచ్చారు అని విచారణ చెయ్యనున్నారు. అసలు కరోనా కేసులు ట్రీట్మెంట్ చెయ్యటనికి గుర్తింపు లేని హాస్పిటల్ నందు కరోనా రోగులకు ఎలా వైద్యం అందిస్తారు అని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అని తెలియచేసారు.  
















Share:

చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్

చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని 52 ఎకరాలో ఉన్న టిడ్కొ  ఇళ్లలో కరోనా కేర్ సెంటర్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న కరోనా రోగులతో మాట్లాడారు. అన్ని సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడి వారు తమకి సరిఅయిన ఆహారం అందచేయటం లేదు అని, మంచినీటి వసతి సరిగా ఉండటం లేదు అని ఫిర్యాదు చేసారు. అక్కడే ఉన్న ఫుడ్ కాంట్రాక్టర్ పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి ఆహారాన్ని మీరు తీసుకుంటారా, వాళ్ళు కూడా మనుషులే అని ఇంకొకసారి ఇలా జరిగితే కాంట్రాక్టు రద్దు చేస్తాం అని తెలిపారు. అలాగే ప్రతి రూమ్ లోను డాక్టర్ నెంబర్ ఉండేలా చూడాలి అని, వైద్య సదుపాయాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలి అని తెలిపారు.   













Share:

కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా RTPCR , రాపిడ్ టెస్ట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనకి ఒక శాంపిల్ ఐడీ జెనరేట్ అవుతుంది. అది ID : 201758399(శాంపిల్) ఇలా ఉంటుంది. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి 

http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/ 

పైన ఇచ్చిన లింక్ క్లిక్ చేసి "సెలెక్ట్ సెర్చ్ టైప్" అని ఉంటుంది అందులో"శాంపిల్ ఐడి" పైన కిక్ చేసి పక్కనే "ఎంటర్ వాల్యూ" అని ఉంటుంది అందులో మీ ID నెంబర్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న "సెర్చ్" పైన క్లిక్ చెయ్యండి. మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్ ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మనకి రిపోర్ట్ స్టేటస్ వస్తుంది. 











Share:

చిలకలూరిపేట నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB) కరొనతో మృతి చెందారు

చిలకలూరిపేట నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB) కరొనతో మృతి చెందారు

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలోని నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB ) (35) కరొనతో ఈ రోజు మృతి చెందారు. పట్టణములోని సుబ్బయ్యతోటలో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ 20 రోజులుగా కరొనతో పోరాడుతూ ఈ రోజు విజయవాడలోని ప్రముఖ హాస్పిటల్ లో మృతి చెందారు. చిన్న వయసులోనే మృతి చెందటం ఆ ప్రాంత ప్రజలని కలచివేసింది. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ఎంతో మందికి ఆర్ధికంగా ఆదుకున్న వ్యక్తి ఈ రోజు లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం సాయంత్రం విజయ్ మృతి దేహాన్ని తీసుకువచ్చి కరోనా కారణంగా త్వరగా అంతక్రియలు నిర్వహించారు. విజయ్ మృతి కారణంగా ఆ ప్రాంతం అంతా మూగబోయింది. 

                                                                              మీ అకాలమృతికి సంతాపం తెలుపుతూ                                                                                        CHILAKALURIPETA SPEED NEWS, Bad Boy's  Youth  


 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి