మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో దారుణం: భార్యను చంపిన భర్త అరెస్ట్ - భార్యపై అనుమానం.. రోకలిబండతో దాడి.. చిలకలూరిపేటలో కలకలం రేపిన హత్య

చిలకలూరిపేటలో దారుణం: భార్యను చంపిన భర్త అరెస్ట్ - భార్యపై అనుమానం.. రోకలిబండతో దాడి.. చిలకలూరిపేటలో కలకలం రేపిన హత్య

​చిలకలూరిపేట స్పీడ్ న్యూస్: క్షణికావేశం, అకారణ అనుమానం నిండు ప్రాణాన్ని బలిగొంది. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో భార్యను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
​పూర్తి వివరాలు:
​ఘటన: వేలూరు గ్రామానికి చెందిన అల్లాడి సల్మాన్ రాజు తన భార్య పుష్ప (30)పై అనుమానం పెంచుకున్నాడు.
​దాడి: గత నెల 29న అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య తలపై రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేశాడు.
​మృతి: తీవ్ర గాయాలపాలైన పుష్ప గుంటూరు GGHలో చికిత్స పొందుతూ డిసెంబర్ 30న మృతి చెందింది.
​అరెస్ట్: మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు, శనివారం (జనవరి 3) నిందితుడు సల్మాన్ రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును రూరల్ సీఐ బి. సుబ్బా నాయుడు పర్యవేక్షించారు.

అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
Share:

జాతీయ స్థాయికి చిలకలూరిపేట ఏఎంజీ విద్యార్థి.. నెట్‌బాల్ పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయికి చిలకలూరిపేట ఏఎంజీ విద్యార్థి.. నెట్‌బాల్ పోటీలకు ఎంపిక

​చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఏఎంజీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి చొప్పరపు శ్రీ మణికంఠ, జాతీయ స్థాయి అండర్-17 నెట్‌బాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు మరియు పట్టణానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ నెల (జనవరి) 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు రాజస్థాన్‌లోని బల్మార్ వేదికగా జరగనున్న జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరపున మణికంఠ ప్రాతినిధ్యం వహించనున్నారు. గత డిసెంబర్ నెలలో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున పాల్గొని, అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతి, హెచ్‌ఎం కృపాదానం, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల స్కూల్ గేమ్స్ కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఏఎంజీ పీఈటీలు రాజు, రాజేష్ మరియు తోటి విద్యార్థులు మణికంఠను ప్రత్యేకంగా అభినందించారు.

అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
Share:

గాల్లో పల్టీలు కొట్టిన కారు.. అక్కడికక్కడే మృతి చెందిన గణపవరం యువకుడు

గాల్లో పల్టీలు కొట్టిన కారు.. అక్కడికక్కడే మృతి చెందిన గణపవరం యువకుడు 

​పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల కాటన్ కంపెనీ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది.
​వివరాల్లోకి వెళ్తే..
గణపవరం గ్రామానికి చెందిన యువకులు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.
🚗 సినిమా ఫక్కీలో..: అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి, రోడ్డు పక్కన ఉన్న ముగ్గురు పాదాచారులను తప్పించబోయి గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది.
​కిరణ్ దుర్మరణం:
ఈ భయానక ప్రమాదంలో గణపవరానికి చెందిన కిరణ్ అనే యువకుడు కారులోనే ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు.
​ఐదుగురికి గాయాలు:
కారులో ఉన్న మిగిలిన వారితో పాటు, పాదాచారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
​పోలీసుల దర్యాప్తు:
విషయం తెలుసుకున్న ఎడ్లపాడు ఎస్సై టి. శివరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
​- చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
Share:

చిలకలూరిపేట - నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!

నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!

👮‍♂️ పట్టణ ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ సీఐ రమేష్

​చిలకలూరిపేట పట్టణ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను (New Year Celebrations) అత్యంత క్రమశిక్షణతో, చట్టానికి లోబడి జరుపుకోవాలని అర్బన్ సీఐ రమేష్ గారు సూచించారు. 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూనే, ప్రజల భద్రత దృష్ట్యా ఆయన కీలక హెచ్చరికలు జారీ చేశారు.

నిఘా నీడలో చిలకలూరిపేట:

డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధులు మరియు కీలక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక బృందాలు (Special Teams) రంగంలోకి దిగాయి.

​🛑 యువతకు సీఐ సీరియస్ వార్నింగ్:

ఉత్సాహం పేరుతో యువత హద్దు మీరవద్దని సీఐ రమేష్ హెచ్చరించారు. ముఖ్యంగా ఈ క్రింది పనులు చేస్తే కేసులు తప్పవు:

  • ​❌ నడిరోడ్డుపై కేక్ కటింగ్స్ చేయకూడదు.
  • ​❌ రోడ్లపై బైక్ రేసింగ్‌లు, రాష్ డ్రైవింగ్ చేయడం నిషేధం.
  • ​❌ మద్యం సేవించి వాహనాలు నడపడం (Drunk & Drive) చట్టరీత్యా నేరం.
  • ​❌ బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం చేస్తే సహించేది లేదు.

కఠిన చర్యలు తప్పవు:

ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, కఠిన శిక్షలు ఉంటాయని సీఐ స్పష్టం చేశారు. ఆనందం అనేది ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకే బాగుంటుందని హితవు పలికారు.

​🙏 పోలీసుల విజ్ఞప్తి:

పట్టణ ప్రజలందరూ పోలీసులకు సహకరించి, ఎవరి ఇంటి వద్ద వారు ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సీఐ రమేష్ కోరారు.

మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి - చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

2024 vs 2025: పల్నాడులో తగ్గిన ఫ్యాక్షన్... పెరిగిన టెక్నాలజీ! వార్షిక నేర సమీక్షలో ఆసక్తికర విషయాలు....

​🚨 పల్నాడు పోలీస్ వార్షిక నివేదిక - 2025: ఫ్యాక్షన్ రహిత జిల్లాగా పల్నాడు... టెక్నాలజీతో నేరాలకు చెక్! 🚓✨

​(చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ - న్యూస్ డెస్క్): ✍️
పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో 2025 సంవత్సరం ఒక కీలకమైన మలుపుగా నిలిచింది. జిల్లా ఎస్పీ గారు విడుదల చేసిన వార్షిక నేర సమీక్షలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గణాంకాలను పరిశీలిస్తే, గత ఏడాది (2024)తో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో నమోదైన మొత్తం నేరాల సంఖ్య 4,222 నుండి 5,025కు పెరిగి, సుమారు 19% పెరుగుదల కనిపించింది 📈. అయితే, ఈ సంఖ్యను చూసి ఆందోళన చెందాల్సిన పనిలేదు, ఎందుకంటే కేసుల నమోదు పెరిగినప్పటికీ, వాటిని పరిష్కరించడంలో పోలీసులు ‘జెట్ స్పీడ్’ చూపించారు ⚡. దర్యాప్తు వేగాన్ని గణనీయంగా పెంచడం ద్వారా పెండింగ్‌లో ఉన్న (UI) కేసులను 12.24% మేర తగ్గించగలిగారు, ఇది పోలీసుల పనితీరుకు నిదర్శనం 👮‍♂️👏.
​ఒకప్పుడు వర్గ పోరులు, ఫ్యాక్షన్ గొడవలతో దద్దరిల్లిన పల్నాడు గడ్డపై ఈ ఏడాది 'శాంతి కపోతం' ఎగిరింది 🕊️. 2024లో 28 ఫ్యాక్షన్ ఘటనలు జరగ్గా, పోలీసుల వ్యూహాత్మక చర్యలు, నిరంతర కౌన్సెలింగ్ ఫలితంగా 2025లో ఆ సంఖ్య కేవలం 8కి పడిపోయింది. అలాగే అల్లర్ల (Riotings) కేసులు ఏకంగా 88.53% మేర తగ్గుముఖం పట్టడం జిల్లా ప్రజలకు నిజంగా పెద్ద ఊరట 😊. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట 10 మందిపై పిడి యాక్టును (PD Act) ప్రయోగించారు 🚫. ఇక జిల్లాను 'మూడో కన్ను' నిరంతరం గమనిస్తూనే ఉంది; 3,478 సిసిటివి కెమెరాలు 📹 మరియు 31 అత్యాధునిక డ్రోన్ల 🚁 సాయంతో నేరస్థుల కదలికలపై నిఘా ఉంచి, పల్నాడును హైటెక్ పోలీసింగ్ వైపు నడిపిస్తున్నారు.
​మహిళా భద్రతే ధ్యేయంగా జిల్లాలో 5 ప్రత్యేక 'శక్తి టీమ్'లను (Shakti Teams) 👩‍✈️ ఏర్పాటు చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి; అత్యాచార కేసుల్లో 18.75% తగ్గుదల నమోదైంది. అయితే, ప్రస్తుత డిజిటల్ యుగంలో కొత్త సవాలుగా మారిన 'సైబర్ నేరాలు' 💻 69% పెరగడం, అలాగే పోక్సో కేసులు, గృహ హింస కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కానీ, సోషల్ మీడియా వేధింపులు 📱 మరియు ఎస్సీ/ఎస్టీలపై దాడులు తగ్గడం శుభపరిణామం. పాఠశాల విద్యార్థులు గంజాయి బారిన పడకుండా ఉండేందుకు వినూత్నంగా 'ఈగల్ క్లబ్'లను (Eagle Clubs) 🦅 ఏర్పాటు చేసి, పాఠశాలల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
​రోడ్డు భద్రత 🚦 మరియు సామాజిక రుగ్మతలపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపారు. రోడ్డు ప్రమాద మరణాలు స్వల్పంగా (5%) పెరగడంతో, 34 ప్రమాదకర ప్రాంతాలను (Black Spots) గుర్తించి 7 హైవే పెట్రోలింగ్ వాహనాల 🚓 ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బహిరంగంగా మద్యం సేవించే వారిపై (Open Drinking) 🍾 కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేశారు. ఇక కోర్టుల ద్వారా శిక్షలు ఖరారు చేయించడంలోనూ పోలీసులు సఫలమయ్యారు; ఈ ఒక్క ఏడాదే 862 కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడగా, అందులో ఒకరికి మరణశిక్ష మరియు ఎనిమిది మందికి జీవిత ఖైదు ⚖️ విధించబడింది. ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు 'వాట్సాప్ గవర్నెన్స్' (📲 9552300009) విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఫిర్యాదు చేయడం నుండి FIR స్టేటస్ తెలుసుకోవడం వరకు అన్నీ వాట్సాప్ ద్వారానే జరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో పల్నాడును పూర్తిగా నేర రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు 🤝🇮🇳.

అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
Share:

చెల్లి చావుకు ప్రతీకారం? నరసరావుపేటలో భావన కాలేజీ డైరెక్టర్ పై కత్తితో దాడి

చెల్లి చావుకు ప్రతీకారం? నరసరావుపేటలో భావన కాలేజీ డైరెక్టర్ పై కత్తితో దాడి

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలకలం: భావన కాలేజీ డైరెక్టర్ ఎం.ఎస్.ఆర్ పై కత్తితో దాడి

​వివరాలు: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇవాళ సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భావన కాలేజీ డైరెక్టర్ ఎం.ఎస్.ఆర్ (MSR) పై హత్యాయత్నం జరిగింది.

​ఘటన వివరాలు: డైరెక్టర్ ఎం.ఎస్.ఆర్ వాకింగ్ చేస్తున్న సమయంలో, మంకీ క్యాప్ ధరించిన వెంకటేష్ అనే యువకుడు ఆయను వెంబడించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఎం.ఎస్.ఆర్‌కు రెండు చోట్ల కత్తి గాయాలయ్యాయి.

​ఆసుపత్రికి తరలింపు: తీవ్ర గాయాలపాలైన ఆయన్ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

​నిందితుడు అరెస్ట్: దాడికి పాల్పడిన వెంకటేష్‌ను నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

​దాడికి కారణం (నేపథ్యం):

గత ఏడాది నిందితుడు వెంకటేష్ సోదరి ఇదే కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే మనోవేదనతో వారి తండ్రి కూడా మరణించారు. తన చెల్లి, తండ్రి మరణాలకు కాలేజీ యాజమాన్యమే కారణమని భావించిన వెంకటేష్, డైరెక్టర్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే నేడు (సోమవారం) పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

​Chilakaluripet Speed News - మన ఊరు మన వార్తలు.

అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట రూరల్ - గాఢనిద్రలో ఉన్న భార్యపై రోకలిబండతో భర్త దాడి.. వేలూరులో విషాదం

అనుమానం పెనుభూతం: గాఢనిద్రలో ఉన్న భార్యపై రోకలిబండతో భర్త దాడి.. వేలూరులో విషాదం

​పచ్చని కాపురంలో అనుమానం అనే పెనుభూతం చిచ్చు రేపింది. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా, క్షణికావేశంలో ఓ భర్త చేసిన కిరాతక దాడి ఇప్పుడు చిలకలూరిపేట రూరల్ పరిధిలోని వేలూరు గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. అనుమానంతో మొదలైన గొడవలు చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి వెళ్లడం స్థానికులను షాక్‌కు గురిచేసింది.
​వేలూరు గ్రామానికి చెందిన అల్లడి సల్మాన్ రాజు, తన భార్య పుష్ప (34) ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే అతన్ని మృగాడిగా మార్చింది. ఈ క్రమంలో సోమవారం (డిసెంబర్ 29) అర్ధరాత్రి దాటాక, సుమారు ఒంటి గంట సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సల్మాన్ రాజు విచక్షణ కోల్పోయాడు. ఏమీ తెలియక గాఢనిద్రలో ఉన్న భార్య తలపై ఇంట్లో ఉన్న రోకలిబండతో బలంగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
​రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న పుష్పను గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆమెను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె తలకు తగిలిన గాయం తీవ్రంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం గుంటూరు సర్వజన ఆసుపత్రి (GGH)కి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె అక్కడ వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతోంది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
​అందరినీ కలిచివేస్తున్న అంశం ఏమిటంటే.. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఇప్పుడు తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం, తండ్రి చేసిన పనికి జైలు పాలయ్యే పరిస్థితి రావడంతో.. ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉండటం చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి