|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
అనుమానం
,
చిలకలూరిపేట
,
చిలకలూరిపేట స్పీడ్ న్యూస్
,
భర్త దాడి
,
వేలూరు
» చిలకలూరిపేట రూరల్ - గాఢనిద్రలో ఉన్న భార్యపై రోకలిబండతో భర్త దాడి.. వేలూరులో విషాదం
చిలకలూరిపేట రూరల్ - గాఢనిద్రలో ఉన్న భార్యపై రోకలిబండతో భర్త దాడి.. వేలూరులో విషాదం
అనుమానం పెనుభూతం: గాఢనిద్రలో ఉన్న భార్యపై రోకలిబండతో భర్త దాడి.. వేలూరులో విషాదం
పచ్చని కాపురంలో అనుమానం అనే పెనుభూతం చిచ్చు రేపింది. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా, క్షణికావేశంలో ఓ భర్త చేసిన కిరాతక దాడి ఇప్పుడు చిలకలూరిపేట రూరల్ పరిధిలోని వేలూరు గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. అనుమానంతో మొదలైన గొడవలు చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి వెళ్లడం స్థానికులను షాక్‌కు గురిచేసింది.
వేలూరు గ్రామానికి చెందిన అల్లడి సల్మాన్ రాజు, తన భార్య పుష్ప (34) ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే అతన్ని మృగాడిగా మార్చింది. ఈ క్రమంలో సోమవారం (డిసెంబర్ 29) అర్ధరాత్రి దాటాక, సుమారు ఒంటి గంట సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సల్మాన్ రాజు విచక్షణ కోల్పోయాడు. ఏమీ తెలియక గాఢనిద్రలో ఉన్న భార్య తలపై ఇంట్లో ఉన్న రోకలిబండతో బలంగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న పుష్పను గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆమెను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె తలకు తగిలిన గాయం తీవ్రంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం గుంటూరు సర్వజన ఆసుపత్రి (GGH)కి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె అక్కడ వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతోంది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అందరినీ కలిచివేస్తున్న అంశం ఏమిటంటే.. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఇప్పుడు తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం, తండ్రి చేసిన పనికి జైలు పాలయ్యే పరిస్థితి రావడంతో.. ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉండటం చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423
మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g





No comments:
Post a Comment