మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Showing posts with label Chilakaluripet. Show all posts
Showing posts with label Chilakaluripet. Show all posts

చిలకలూరిపేట ప్రయాణికులకు కావేరి ట్రావెల్స్ చేదు అనుభవం...నాది మాచర్ల.. దిక్కున్న చోట చెప్పుకోండి! అర్ధరాత్రి ప్రయాణికులపై కావేరి ట్రావెల్స్ సిబ్బంది వీరంగం! పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి....

చిలకలూరిపేట ప్రయాణికులకు కావేరి ట్రావెల్స్ చేదు అనుభవం...నాది మాచర్ల.. దిక్కున్న చోట చెప్పుకోండి! అర్ధరాత్రి ప్రయాణికులపై కావేరి ట్రావెల్స్ సిబ్బంది వీరంగం! 


చిలకలూరిపేట ప్రయాణికులకు కావేరి ట్రావెల్స్ చేదు అనుభవం...నాది మాచర్ల.. దిక్కున్న చోట చెప్పుకోండి! అర్ధరాత్రి ప్రయాణికులపై కావేరి ట్రావెల్స్ సిబ్బంది వీరంగం! పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి....ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం అంటేనే జనం జంకుతున్నారు. వేలకు వేలు చార్జీలు వసూలు చేయడంలో ఉండే శ్రద్ధ, ప్రయాణికులకు కనీస మర్యాద ఇవ్వడంలో, వారి భద్రతను పట్టించుకోవడంలో ట్రావెల్స్ యాజమాన్యాలకు లేకుండా పోయింది. శనివారం రాత్రి హైదరాబాద్ నుండి చిలకలూరిపేట మీదుగా మార్టూరు, ఒంగోలు వెళ్లే 'కావేరి ట్రావెల్స్' బస్సులో చోటుచేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. ప్రయాణికుల పట్ల బస్సు సిబ్బంది ప్రదర్శించిన రౌడీయిజం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

​వివరాల్లోకి వెళితే...

​⏰ గంటకో మెసేజ్.. నడిరోడ్డుపై ప్రయాణికుల పడిగాపులు

హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట, మార్టూరు వెళ్లేందుకు శనివారం రాత్రి పలువురు ప్రయాణికులు కావేరి ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారు. రాత్రి 10 గంటలకు బోర్డింగ్ పాయింట్‌కు రావాల్సిన బస్సు 11 గంటలకు వస్తుందని ముందుగా ఓ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కాసేపటికే 'బస్సు బ్రేక్ డౌన్ అయింది, ఇంకో గంట ఆలస్యం అవుతుంది' అంటూ మరో మెసేజ్. దీంతో పసిపిల్లలు, మహిళలు, వృద్ధులతో సహా ప్రయాణికులంతా గమ్యస్థానాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈలోపు వచ్చిన ఒక బస్సులో నుంచి కొందరిని దించేసి, కనెక్టింగ్ బస్సుల ద్వారా వారిని హైదరాబాదులోని ప్రాంతాలకు పంపడానికి మరొక చిన్న బస్సులోకి ఎక్కించారు.

​🚌 బ్రేక్ డౌన్ కాదు.. ప్రాణాలతో చెలగాటం!

తీరా అర్ధరాత్రి బస్సు వచ్చాక అసలు బండారం బయటపడింది. బ్రేక్ డౌన్ అని చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలింది. వాస్తవానికి ఒంగోలు నుంచి హైదరాబాద్ వచ్చిన అదే బస్సును.. కనీసం డ్రైవర్లకు విశ్రాంతి కూడా ఇవ్వకుండా, ఏమాత్రం చెక్ j తిరిగి హైదరాబాద్ నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరే ప్రయత్నం చేశారు. యంత్రాలకే కాదు, మనుషులకు కూడా కనీస విశ్రాంతి ఇవ్వకుండా నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లతో బస్సులు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైనం తెలిసి ప్రయాణికులు విస్మయానికి గురయ్యారు.

​😡 "నాది మాచర్ల.. నా సంగతేంటో చూపిస్తా".. సిబ్బంది వీరంగం

అప్పటికే సమయం రాత్రి ఒంటిగంట దాటిపోవడంతో, విసిగిపోయిన ప్రయాణికులు "ఎందుకింత ఆలస్యం? అబద్ధాలు ఎందుకు చెప్పారు?" అని నిలదీశారు. తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాల్సిన బస్సు సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. "నాది మాచర్ల.. నేనేంటో, నా సంగతేంటో చూపిస్తా.. ఏంచేసుకుంటారో చేసుకోండి" అంటూ ప్రయాణికులపైకి రౌడీల్లా దూసుకొచ్చారు. దీంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై బస్సు సిబ్బంది బూతులు, బెదిరింపులతో ప్యాసింజర్లు అవాక్కయ్యారు.

​💸 ముక్కుపిండి వసూళ్లు.. బాధ్యత ఏదీ?

పండుగలు,) అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చిలకలూరిపేట, మార్టూరు ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

 దీనికి సంబంధించిన వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

https://www.instagram.com/reel/DaoyG4spNbp/?igsh=a2ExZmgzZTRwNml1

Share:

చిలకలూరిపేట - విమర్శల స్థానంలో భావోద్వేగాలు: మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశంలో కదిలించే దృశ్యాలు! రాజకీయాలకు అతీతంగా ఆత్మీయతలు.. ముగిసిన చిలకలూరిపేట కౌన్సిలర్ల పదవీకాలం!

చిలకలూరిపేట - విమర్శల స్థానంలో భావోద్వేగాలు: మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశంలో కదిలించే దృశ్యాలు! రాజకీయాలకు అతీతంగా ఆత్మీయతలు.. ముగిసిన చిలకలూరిపేట కౌన్సిలర్ల పదవీకాలం!


చిలకలూరిపేట: నిన్నటి వరకు ప్రజా సమస్యలపై వాడివేడి చర్చలు... అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిన మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలు సోమవారం భావోద్వేగాలకు వేదికైంది. ఐదేళ్ల సుదీర్ఘ మున్సిపల్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ సభ్యులు బరువెక్కిన గుండెలతో ఒకరికొకరు ఆత్మీయ వీడ్కోలు పలికారు. చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన జరిగిన ఈ చివరి అత్యవసర సమావేశంలో రాజకీయాలకు అతీతంగా ఆత్మీయతలు వెల్లివిరిశాయి.

రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ ఆలింగనం:

ఈ నెల 17తో కౌన్సిలర్ల పదవీకాలం ముగియనుండటంతో, రేపటి నుంచి తామంతా ఇలా ఒకేచోట కలిసే అవకాశం ఉండదన్న సత్యం సభ్యులను కలచివేసింది. పార్టీ సిద్ధాంతాలు, రాజకీయాలు పక్కనపెట్టి, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ వీడ్కోలు చెప్పుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి.

కన్నీటి పర్యంతమైన కౌన్సిలర్లు:

ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు, సహకరించిన తోటి సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ మహిళా కౌన్సిలర్ కన్నీటి పర్యంతమయ్యారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో తమకు దక్కిన స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆమె ఉద్వేగంగా పేర్కొన్నారు.

పొరపాట్లు ఉంటే క్షమించండి - వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల పట్ల గానీ, తోటి కౌన్సిలర్ల పట్ల గానీ తాను ఎప్పుడైనా దురుసుగా ప్రవర్తించి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు కోరారు. ఐదేళ్ల పాలనలో అడుగడుగునా సహకరించిన చైర్మన్ షేక్ రఫానికి, మున్సిపల్ అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అభివృద్ధి పథంలో మన చిలకలూరిపేట - చైర్మన్ షేక్ రఫాని

గత ఐదేళ్లుగా కౌన్సిల్ సభ్యులంతా కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పనిచేశారని చైర్మన్ షేక్ రఫాని ప్రశంసించారు. తమ హయాంలో మున్సిపాలిటీని 'సెలెక్షన్ గ్రేడ్'గా తీర్చిదిద్దామని, త్యాగధనులు డాక్టర్ జాన్ డేవిడ్ సేవలకు గుర్తింపుగా ఒక ప్రధాన రహదారికి ఆయన పేరు పెట్టామని గుర్తుచేశారు. పట్టణంలో నీటి ఎద్దడి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

జ్ఞాపకాలను నెమరువేసుకున్న అధికారులు:

కేవలం కౌన్సిలర్లే కాకుండా, ఐదేళ్లుగా వారితో కలిసి పనిచేసిన మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, డీఈఈ షేక్ అబ్దుల్ రహీం తమ అనుభవాలను పంచుకుంటూ కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, మరికొందరు సభ్యులు వీధి కుక్కల నివారణ, తాగునీటి సమస్యలను ఈ చివరి సమావేశంలోనూ ప్రస్తావించడం వారి బాధ్యతకు అద్దం పట్టింది.

ఘన నివాళులు:

సమావేశం ప్రారంభంలో ఏఎంజీ వ్యవస్థాపకుడు డాక్టర్ జాన్ డేవిడ్ కుమార్తె పెర్సీ స్వరూప మృతి పట్ల సభ సంతాపం ప్రకటించింది. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

దద్దరిల్లిన చిలకలూరిపేట.. కొండవీడు 2K రన్ గ్రాండ్ సక్సెస్! - 2K రన్‌లో ఎమ్మెల్యే, కలెక్టర్ పరుగు!

దద్దరిల్లిన చిలకలూరిపేట.. కొండవీడు 2K రన్ గ్రాండ్ సక్సెస్! - 2K రన్‌లో ఎమ్మెల్యే, కలెక్టర్ పరుగు!

చిలకలూరిపేటలో 'కొండవీడు' జోష్.. 2K రన్‌తో దద్దరిల్లిన వీధులు! 🏃‍♂️✨
​చారిత్రక వైభవానికి నాంది.. యువతలో సరికొత్త ఉత్సాహం!
​చిలకలూరిపేట స్పీడ్ న్యూస్:
పల్నాడు పౌరుషానికి ప్రతీకైన కొండవీడు కోట ఉత్సవాలకు చిలకలూరిపేట పట్టణం సిద్దమైంది! గురువారం ఉదయం పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో నిర్వహించిన 'కొండవీడు-2కే రన్' (Kondaveedu 2K Run) గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
​🌟 హైలైట్స్ ఇవే:
​ముఖ్య అతిథులు: స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా గారు జెండా ఊపి ఈ రన్‌ను ప్రారంభించారు. వారే స్వయంగా యువతతో కలిసి అడుగులో అడుగు వేయడం విశేషం.
​జనసంద్రాన్ని తలపించిన రోడ్లు: ఉదయం 7 గంటలకే స్థానిక రైతుబజార్ ప్రాంతం యువత కేరింతలతో మార్మోగిపోయింది. అక్కడి నుండి ఎన్.ఆర్.టి సెంటర్ (NRT Center) వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, యువకులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
​🚩 అదనపు ఆకర్షణ & ప్రత్యేకత:
కేవలం పరుగు మాత్రమే కాదు.. ఇది మన సంస్కృతికి నిదర్శనం! దారి పొడవునా "జై కొండవీడు - జైజై కొండవీడు" నినాదాలతో పట్టణం హోరెత్తింది. రెడ్డి రాజుల కాలం నాటి వైభవాన్ని గుర్తుచేసేలా ప్లకార్డులు చేబూని విద్యార్థులు ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమం కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా, మన ప్రాంత పర్యాటక అభివృద్ధికి (Tourism Development) ఒక మెట్టుగా నిలిచింది.
​🗣️ ప్రముఖుల మాట:
​ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు: "కొండవీడు అంటేనే ఒక చరిత్ర.. ఒక ఎమోషన్. ఈ ఉత్సవాల ద్వారా మన ప్రాంత ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేయాలి. రాబోయే ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలి."
​కలెక్టర్ కృతిక శుక్లా: "యువతలో ఇంతటి స్పందన చూడటం ఆనందంగా ఉంది. శారీరక దృఢత్వంతో పాటు మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది."
​🔜 రాబోయేవి..:
ఇది కేవలం ఆరంభం మాత్రమే! కొండవీడు ఉత్సవాల్లో భాగంగా రాబోయే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సాహస క్రీడలు (Adventure Sports), మరియు కోటలో ప్రత్యేక ప్రదర్శనలు ఉండబోతున్నాయి.
​📢 పిలుపు:
మన ఊరి పండుగలో మనమే భాగస్వాములవుదాం! చిలకలూరిపేట, పల్నాడు ప్రజలందరూ ఈ ఉత్సవాలకు తరలిరావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
​మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ కోసం... ✍️
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి