మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Showing posts with label సుబ్బయ్య తోట. Show all posts
Showing posts with label సుబ్బయ్య తోట. Show all posts

చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో ఆకతాయిల బీభత్సం.. మాటువేసి పెట్రోల్ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు

చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో ఆకతాయిల బీభత్సం.. మాటువేసి పెట్రోల్ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు


పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోట, గౌడ వీధిలో గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి పూట కొందరు ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇళ్ల ముందు ఆపి ఉంచిన ద్విచక్ర వాహనాలు, సైకిళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా దాడులకు తెగబడుతోంది. బైకులను కింద పడేయడం, అద్దాలు పగలగొట్టడం, సెంట్రల్ స్టాండ్లు విరగ్గొట్టడం లాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఉదయం నిద్రలేచి చూసేసరికి తమ వాహనాలు డ్యామేజ్ కావడాన్ని గమనించిన బజారు వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

​వరుసగా రెండు రోజుల పాటు ఇదే తంతు కొనసాగడంతో విసిగిపోయిన స్థానికులు, నిన్న రాత్రి ఆ వీధిలో పక్కాగా మాటు వేశారు. అదే సమయంలో సుజాత డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దేవరకొండ గోపాలకృష్ణకు చెందిన ద్విచక్ర వాహనంలోంచి పెట్రోల్ దొంగిలిస్తుండగా.. జల్లెడ గణేష్ అనే స్థానికుడు ఒక యువకుడిని గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అతన్ని గట్టిగా నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, స్థానికులంతా ఒక్కటయ్యారు. తమ వాహనాలకు నష్టం చేకూరుస్తున్న ఆకతాయికి బుద్ధి వచ్చేలా దేహశుద్ధి చేసి, నేరుగా తీసుకెళ్లి చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.


​స్థానికుల కలవరం - హెచ్చరిక:

​చిలకలూరిపేట నడిబొడ్డున ఉండే సుబ్బయ్య తోట ప్రాంతం హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. తెల్లవారుజామున ఒంటిగంట నుంచే మార్కెట్ హడావిడి మొదలవుతుంది కాబట్టి, పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇక్కడ ఎప్పుడూ జన సంచారం ఉంటుంది. జనావాసం ఎక్కువగా ఉండే ఇలాంటి రద్దీ ప్రాంతంలో దొంగతనాలు జరగడం చాలా అరుదు. కానీ, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలతో బజారు వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

​దీనిపై పోలీసులు వెంటనే స్పందించి రాత్రి పూట పెట్రోలింగ్ పెంచాలని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మళ్లీ ఎవరైనా ఇలాంటి దొంగతనాలకు, వాహనాల ధ్వంసానికి పాల్పడుతూ దొరికితే.. తీవ్రమైన దేహశుద్ధి తప్పదని, అలాగే పోలీసు కేసులు పెట్టి కఠినంగా శిక్షింపజేస్తామని స్థానికులు గట్టిగా హెచ్చరించారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

సుబ్బయ్య తోట లింకు రోడ్డును వెంటనే బాగు చేయాలి, ప్రమాదాలకు అడ్డాగా మెయిన్ రోడ్డు:- సీపీఐ నేత శివకుమార్


 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ :- 
​🚧 సుబ్బయ్య తోట లింకు రోడ్డును వెంటనే బాగు చేయాలి: సీపీఐ నేత శివకుమార్ డిమాండ్
​చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోట, రాయుడు కంటి ఆసుపత్రి రోడ్డులోని సచివాలయం వద్ద ఉన్న దుస్థితిపై సీపీఐ నాయకులు నాయుడు శివకుమార్ స్పందించారు.
​📍 ప్రధాన సమస్యలు:
👉 సుబ్బయ్య తోట నుండి NH16 (జాతీయ రహదారి)ను కలిపే లింకు రోడ్డు చాలా కాలంగా అధ్వానంగా ఉంది.
👉 ఇక్కడ కల్వర్టు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
👉 పక్కనే ఉన్న రెండు రోడ్లకు కల్వర్టులు కట్టి బాగు చేసినా, ఈ రోడ్డును మాత్రం అధికారులు విస్మరించారు.
​🗣️ నాయుడు శివకుమార్ ఏమన్నారంటే:
"గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదు. పక్క రోడ్లు బాగుచేసి దీన్ని వదిలేయడం సరికాదు. వెంటనే కల్వర్టు నిర్మించి, లింకు రోడ్డును ఏర్పాటు చేయాలి. లేదంటే ప్రమాదాలకు అధికారులే బాధ్యత వహించాలి. గతంలో చాలా ప్రమాదాలు జరిగి ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని త్వరగా నిధులు మంజూరు చేసి రోడ్డును బాగు చేయాలని ఆయన కోరారు "


 అధిక కరెంట్ బిల్లులతో బాధపడుతున్నారా ఇప్పుడే వెంటనే సోలార్ ని బిగించండి. ఆదిత్య సోలార్ పవర్  +91 8074300423 ఈ నెంబర్ కి కాల్ చేసి స్లాట్ ను బుక్ చేసుకోండి.
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి