చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిగాల్లో పల్టీలు కొట్టిన కారు.. అక్కడికక్కడే మృతి చెందిన గణపవరం యువకుడు
చిలకలూరిపేట - నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
👮♂️ పట్టణ ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ సీఐ రమేష్
చిలకలూరిపేట పట్టణ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను (New Year Celebrations) అత్యంత క్రమశిక్షణతో, చట్టానికి లోబడి జరుపుకోవాలని అర్బన్ సీఐ రమేష్ గారు సూచించారు. 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూనే, ప్రజల భద్రత దృష్ట్యా ఆయన కీలక హెచ్చరికలు జారీ చేశారు.
నిఘా నీడలో చిలకలూరిపేట:
డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధులు మరియు కీలక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక బృందాలు (Special Teams) రంగంలోకి దిగాయి.
🛑 యువతకు సీఐ సీరియస్ వార్నింగ్:
ఉత్సాహం పేరుతో యువత హద్దు మీరవద్దని సీఐ రమేష్ హెచ్చరించారు. ముఖ్యంగా ఈ క్రింది పనులు చేస్తే కేసులు తప్పవు:
- ❌ నడిరోడ్డుపై కేక్ కటింగ్స్ చేయకూడదు.
- ❌ రోడ్లపై బైక్ రేసింగ్‌లు, రాష్ డ్రైవింగ్ చేయడం నిషేధం.
- ❌ మద్యం సేవించి వాహనాలు నడపడం (Drunk & Drive) చట్టరీత్యా నేరం.
- ❌ బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం చేస్తే సహించేది లేదు.
కఠిన చర్యలు తప్పవు:
ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, కఠిన శిక్షలు ఉంటాయని సీఐ స్పష్టం చేశారు. ఆనందం అనేది ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకే బాగుంటుందని హితవు పలికారు.
🙏 పోలీసుల విజ్ఞప్తి:
పట్టణ ప్రజలందరూ పోలీసులకు సహకరించి, ఎవరి ఇంటి వద్ద వారు ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సీఐ రమేష్ కోరారు.
మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి - చిలకలూరిపేట స్పీడ్ న్యూస్
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423
మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
2024 vs 2025: పల్నాడులో తగ్గిన ఫ్యాక్షన్... పెరిగిన టెక్నాలజీ! వార్షిక నేర సమీక్షలో ఆసక్తికర విషయాలు....
చెల్లి చావుకు ప్రతీకారం? నరసరావుపేటలో భావన కాలేజీ డైరెక్టర్ పై కత్తితో దాడి
చెల్లి చావుకు ప్రతీకారం? నరసరావుపేటలో భావన కాలేజీ డైరెక్టర్ పై కత్తితో దాడి
పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలకలం: భావన కాలేజీ డైరెక్టర్ ఎం.ఎస్.ఆర్ పై కత్తితో దాడి
వివరాలు: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇవాళ సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భావన కాలేజీ డైరెక్టర్ ఎం.ఎస్.ఆర్ (MSR) పై హత్యాయత్నం జరిగింది.
ఘటన వివరాలు: డైరెక్టర్ ఎం.ఎస్.ఆర్ వాకింగ్ చేస్తున్న సమయంలో, మంకీ క్యాప్ ధరించిన వెంకటేష్ అనే యువకుడు ఆయను వెంబడించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఎం.ఎస్.ఆర్‌కు రెండు చోట్ల కత్తి గాయాలయ్యాయి.
ఆసుపత్రికి తరలింపు: తీవ్ర గాయాలపాలైన ఆయన్ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నిందితుడు అరెస్ట్: దాడికి పాల్పడిన వెంకటేష్‌ను నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాడికి కారణం (నేపథ్యం):
గత ఏడాది నిందితుడు వెంకటేష్ సోదరి ఇదే కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే మనోవేదనతో వారి తండ్రి కూడా మరణించారు. తన చెల్లి, తండ్రి మరణాలకు కాలేజీ యాజమాన్యమే కారణమని భావించిన వెంకటేష్, డైరెక్టర్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే నేడు (సోమవారం) పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Chilakaluripet Speed News - మన ఊరు మన వార్తలు.
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423
మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
చిలకలూరిపేట రూరల్ - గాఢనిద్రలో ఉన్న భార్యపై రోకలిబండతో భర్త దాడి.. వేలూరులో విషాదం
చిలకలూరిపేట - పసుమర్రు క్రాస్ రోడ్డు వద్ద విషాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి.. ఆందోళనలో స్థానికులు
బొప్పూడిలో పేకాట రాయుళ్ల భరతం పట్టిన పోలీసులు - భారీగా నగదు, కార్లు స్వాధీనం
బొప్పూడిలో పేకాట రాయుళ్ల భరతం పట్టిన పోలీసులు - భారీగా నగదు, కార్లు స్వాధీనం
చిలకలూరిపేట: మండలంలోని బొప్పూడి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట శిబిరం గుట్టును రూరల్ పోలీసులు రట్టు చేశారు. గ్రామంలోని కళ్యాణ మండపం పక్కన ఉన్న ఓ డాబా ఇంట్లో కొందరు వ్యక్తులు 'కోత ముక్క' ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా మెరుపు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో వారి వద్ద నుండి రూ. 1,25,700/- నగదును, అలాగే పేకాట ఆడేందుకు ఉపయోగించిన రెండు కార్లు మరియు ఆరు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.