మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులలో ఆందోళన !!!

చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులలో ఆందోళన !!!

https://chilakaluripetspeednews.blogspot.com/
చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 2వ తారీఖున పలువురు బ్యాంకు సిబ్బంది కరోనా రావటంతో 3వ తరుకు నుండి బ్యాంకు మూసివేశారు . అప్పటినుండి మధ్యలో 1,2 రోజులు ఓపెన్ చేసినా బ్యాంకు పనుల నిమిత్తం ఖాతా దారులకు అనుమతి లేకుండా బ్యాంకు పనులు చూసుకొని మళ్లీ మూసివేశారు. ఇప్పటికే 15 రోజుల అవుతున్న కారణంగా వ్యాపారలావాదేవీలు కోసం వ్యాపారస్తులు, అత్యవసర లావాదేవీలు జరపటానికి బ్యాంకు మూసి ఉండటంతో బ్యాంకు ఖాతా దారులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బ్యాంకు ఓపెన్ చేసి అత్యవసర లావాదేవీలకు అనుమతించాలి అని కోరుతున్నారు 










































Share:

భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సేఫ్టీ పౌడర్ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫీసులకు అందజేసారు.

భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సేఫ్టీ పౌడర్ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫీసులకు అందజేసారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని భగవత్ గీతా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా సేఫ్టీ కొరకు ప్రత్యేకంగా తాయారు చేయించిన పొడిని ఫ్రంట్ లైన్ వర్కర్స్ (మునిసిపాలిటీ ఆఫీస్, పోలీస్టేషన్, హాస్పిటల్స్ ) ఆఫీసు నందు అందజేశారు. ఈ పౌడర్ని ఏడు రకాల సుగంధ ద్రవ్యాలతో( జాజికాయ, జాపత్రి జాజిపువ్వు, అనాసపువ్వు, యాలుకాయలు, లవంగాలు, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం ) తాయారు చేసారు. ట్రస్ట్ అధ్యక్షులు గుడిపల్లి నాగభూషణం గారు  వీటి వలన కరోనా బాక్టీరియా గాలిలో విస్తరించకుండా కొంత వరకు కాపాడుతుంది అని తెలిపారు.కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా తాయారు చేయించారు అని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు వీటిని  మునిసిపల్ చైర్మన్ రఫ్ఫాని గారికి, అర్బన్ CI బిలాలుద్దీన్ గారికి, రూరల్ CI సుబ్బారావు గారికి, కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ కి అందించారు. ఈ కార్యక్రమంలో వడాల భాస్కర్, కందుల రవికుమార్, నాయుడు ఫణి, ఇతర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.   

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/







































Share:

చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం

చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున కరోనా మృతి దేహాలను తరలించటానికి ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేసారు. 
కరోనా కారణంగా పట్టణంలో చాలామంది చనిపోయారు.  హాస్పిటల్ ట్రాట్మెంట్ కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ చివరికి చాల మంది ఆక్సిజన్ అంధక, వ్యాధి తీవ్రతని ముందుగా గ్రహించలేక చివరకి చాలామంది మృతిదేహాలతో బయటకి వస్తున్నారు. అప్పటికే లక్షల రూపాయల ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి గురి అయిన  మృతి చెందిన కుటుంబానికి ఆ మృతుదేహాలను ఖననం కొరకు శ్మశానం వరకు తరలించటానికి ఎవరు సహకరించక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తు మళ్లీ అక్కడ ఇంకో 50 వేలు వరకు దోపిడీకి గురి అవుతున్న నేపథ్యంలో, అలాంటి వాటి అన్నింటికీ తెర దించుతూ పట్టణంలోని మునిసిపాలిటీ పురపాలకసంఘం ఆధ్వర్యంలో ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మెన్ షేక్ రఫాని గారు, మునిసిపల్ కమిషనర్ ఫణి కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఫాని గారు ,మాట్లాడుతూ ఎవరైనా కరొనతో మృతు చెందిన వారికీ ఈ వాహనం సేవలు ఉపయోగించుకోవాలి అని తెలియజేశారు. 
ఉచిత వాహనం కొరకు రవికుమార్ :- 9948923050 , మస్తాన్ రెడ్డి :- 9951079006 ఈ నంబర్లకు కాల్ చేసి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు, తలహఖాన్ గారు , దరియావాలి గారు పాల్గొన్నారు. 










































Share:

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - కరోనా వైద్య చికిత్సలు అందిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా రోగుల,వైద్యుల భద్రత కొరకు చిలకలూరిపేట ఇంటర్నేషనల్ సేవా సంస్థ అసిస్ట్ 5 లక్షల రూపాయల విలువగల వైద్య సామగ్రి అందజేశారు. ఆసుపత్రి వైద్యురాలు భవాని గారికి పి పి ఏ కిట్లు, ఎన్ 95 మాస్కులు , శానిటైజెర్ , సెలైన్ స్టాండ్లు,ధర్మామీటర్లు అందజేశారు. ఈ సందర్భంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఇంకా వైద్య సదుపాయాలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ కృష్ణ. రంగారావు గారు, సూర్యనారాయణ, డేవిడ్, రాజు,ఇమ్రాన్,వంశీ తదితరులు పాల్గొన్నారు 
































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి

చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట కరోనా మొదటి వేవ్ నందు గ్రామాల ప్రజలు తపించుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్ మాత్రం గ్రామాలను కూడా వదలటం లేదు. చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామాలలో మాత్రం ఈసారి ఏ పల్లెటూరుని కూడా వదలటం లేదు. ఎక్కడ నిర్లక్ష్యం గా వ్యవహరించినా అసలు కనికరం చూపటంలేదు. ముఖ్యంగా యడ్లపాడు, పసుమర్రు ఏరియాలలో చాపక్రింద నీరులాగా వ్యాపిస్తుంది. గ్రామాలలోని ప్రజలు కొన్ని రోజులపాటు 10 రోజులకు సరిపడా సరుకులను ఒకేసారి తెచ్చుకొని బయటకు రాకుండా ఉంటే పట్టణంలో కన్నా గ్రామాలలో త్వరగా తీవ్రతను తగ్గించవచ్చు. దయచేసి గ్రామాలలో ఉన్న యువకులు ముందుకి వచ్చి ఈ కరోనా సమయంలో ప్రోటోకాల్ పాటిస్తూ తమ తమ గ్రామాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను సంప్రదించి ఊరులోని వ్యక్తులు బయట జాబ్ చేసుకునే వాళ్ళ నుండి కరోనా విపత్తు వివరించి చందాలు పోగుచేసి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వాళ్ళని ఇళ్లలో నుండి బయటకి రావద్దు అని చెప్పి వారికీ ఆహార సదుపాయాలు చూసుకుంటే కొన్ని రోజులలోనే కరోనా విపత్తు నుండి బయటపడవచ్చు. గ్రామపెద్దలు సహకారంతో యువకులు ముందుకు వచ్చి నిలబడాలి అని కోరుకుంటున్నాము. ఎంతో మంది డబ్బు ఉన్నవారు కరొనతో చనిపోయినవారు ఉన్నారు కానీ అక్కడ డబ్బు ఉపయోగపడలేదు. మనుషులు మాత్రమే ముఖ్యం.  యువకులు తలుచుకుంటే ఏది అయిన చెయ్యవచ్చు. మన గ్రామాలను అందులోని మనుషులను కాపాడుకుందాం. కరోనా తతీవ్రత తగ్గినప్పటి నుండి గ్రామాలలో వ్యాక్సిన్ ప్రక్రియకు కూడా మీ సహకారం అందించి గ్రామ సుభిక్షతకు తోడ్పడండి.  



























Share:

చిలకలూరిపేటలో రేపు 15-05-2021 ఈ ఏరియాలలో కరెంటు ఉండదు !

చిలకలూరిపేటలో రేపు 15-05-2021 ఈ ఏరియాలలో కరెంటు ఉండదు !

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట రేపు శనివారం కారణంగా విధ్యుత్ మరమ్మతులు కోసం పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో కరంటు కోత విధిస్తున్నట్లు డి ఈ ఈ సీహెచ్ రంబొట్ట్లు గారు తెలిపారు. పట్టణంలోని ఎన్ ఆర్ టి సెంటర్ నుండి విజయ బ్యాంకు వరకు స్టేట్ బ్యాంకు , సిటీ యూనియన్ బ్యాంకు , హనుమాయమ్మ సత్రం,గాంధీపేట,హైస్కూల్ రోడ్డు, మునిసిపల్ ఆఫీస్ రోడ్డు, కొత్త పోలీస్టేషన్ రోడ్డు, డిక్మెన్ నగర్  ఉదయం 8:30 నుండి 11:30 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది అని తెలిపారు . 






































Share:

చిలకలూరిపేట- బోసిపోయిన అడ్డరోడ్డు సెంటర్ - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ రంజాన్ వేడుకలు

చిలకలూరిపేట- బోసిపోయిన అడ్డరోడ్డు సెంటర్ - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ రంజాన్ వేడుకలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ నందు ప్రతి సంవత్సరం ఎర్పాటు చేసే సామూహిక ప్రార్ధనలూ కరోనా కారణంగా ఈసారి నిర్వహించలేక రోడ్లు అన్ని బోసిపోయాయి. అయినా పట్టణంలో రంజాన్ వేడుకలు కరోనా ప్రొటొకాల్ పాటిస్తూ ఘనంగా జరుగుతున్నాయి. పరిమితి సంఖ్యలో ముస్లిం సోదరులు మసీదులకు చేసుకొని మత పెద్దల సహకారంతో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అలాగే మసీదులకు రాని వారు తమ తమ ఇళ్లలోనే ప్రార్ధనలు నిర్వహించుకుంటున్నారు. దేశంలోని ప్రజలు ఆరోగ్యంగా గా ఉండాలి అని ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. అలాగే ప్రతి ఒక్కరు కరోనా వైరస్ కట్టడికి కలిసి కట్టుగా కృషి చెయ్యాలి అని తెలిపారు మత పెద్దలు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ , శానిటైజేర్ వాడాలి అని తెలిపారు. 





























 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి