|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
కరోనా న్యూస్
,
చిలకలూరిపేట న్యూస్
,
చిలకలూరిపేట మండలం
» చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి
చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి
చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి
చిలకలూరిపేట కరోనా మొదటి వేవ్ నందు గ్రామాల ప్రజలు తపించుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్ మాత్రం గ్రామాలను కూడా వదలటం లేదు. చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామాలలో మాత్రం ఈసారి ఏ పల్లెటూరుని కూడా వదలటం లేదు. ఎక్కడ నిర్లక్ష్యం గా వ్యవహరించినా అసలు కనికరం చూపటంలేదు. ముఖ్యంగా యడ్లపాడు, పసుమర్రు ఏరియాలలో చాపక్రింద నీరులాగా వ్యాపిస్తుంది. గ్రామాలలోని ప్రజలు కొన్ని రోజులపాటు 10 రోజులకు సరిపడా సరుకులను ఒకేసారి తెచ్చుకొని బయటకు రాకుండా ఉంటే పట్టణంలో కన్నా గ్రామాలలో త్వరగా తీవ్రతను తగ్గించవచ్చు. దయచేసి గ్రామాలలో ఉన్న యువకులు ముందుకి వచ్చి ఈ కరోనా సమయంలో ప్రోటోకాల్ పాటిస్తూ తమ తమ గ్రామాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను సంప్రదించి ఊరులోని వ్యక్తులు బయట జాబ్ చేసుకునే వాళ్ళ నుండి కరోనా విపత్తు వివరించి చందాలు పోగుచేసి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వాళ్ళని ఇళ్లలో నుండి బయటకి రావద్దు అని చెప్పి వారికీ ఆహార సదుపాయాలు చూసుకుంటే కొన్ని రోజులలోనే కరోనా విపత్తు నుండి బయటపడవచ్చు. గ్రామపెద్దలు సహకారంతో యువకులు ముందుకు వచ్చి నిలబడాలి అని కోరుకుంటున్నాము. ఎంతో మంది డబ్బు ఉన్నవారు కరొనతో చనిపోయినవారు ఉన్నారు కానీ అక్కడ డబ్బు ఉపయోగపడలేదు. మనుషులు మాత్రమే ముఖ్యం. యువకులు తలుచుకుంటే ఏది అయిన చెయ్యవచ్చు. మన గ్రామాలను అందులోని మనుషులను కాపాడుకుందాం. కరోనా తతీవ్రత తగ్గినప్పటి నుండి గ్రామాలలో వ్యాక్సిన్ ప్రక్రియకు కూడా మీ సహకారం అందించి గ్రామ సుభిక్షతకు తోడ్పడండి.






No comments:
Post a Comment