మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట రూరల్ - భర్త అనుమానం.. బలిగొన్న ప్రాణం

చిలకలూరిపేట రూరల్ - భర్త అనుమానం.. బలిగొన్న ప్రాణం

కట్టుబడివారిపాలెంలో విషాదం.. వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
అనాథలైన ముగ్గురు పసిపిల్లలు.. కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు
​చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): భర్త అనుమానం ఆ సంసారంలో చిచ్చురేపింది. కట్టుకున్న వాడే కక్ష కట్టడంతో ఆ వివాహిత తల్లడిల్లిపోయింది. రోజురోజుకూ వేధింపులు శృతిమించడంతో.. ఆ నరకం భరించలేక తన ప్రాణాలనే తీసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
​పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మక్కే తిరుమల (28) అనే మహిళను ఆమె భర్త వీరాంజనేయులు గత కొంతకాలంగా అనుమానంతో తీవ్రంగా వేధిస్తున్నాడు. భర్త పెట్టే శారీరక, మానసిక హింసను భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన తిరుమల జీవితంపై విరక్తి పెంచుకుంది. ఈ క్రమంలోనే గత నెల 28వ తేదీ (శుక్రవారం) సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి, ఓ శీతల పానీయంలో ఎలుకల మందు (పేస్టు) కలుపుకుని తాగేసింది.
​అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తిరుమలను హుటాహుటిన మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH)కి తరలించారు. దాదాపు వారం రోజుల పాటు అక్కడ మృత్యువుతో పోరాడిన తిరుమల.. పరిస్థితి విషమించడంతో ఈరోజు చికిత్స పొందుతూ కన్నుమూసింది.
​అనాథలైన ముగ్గురు పిల్లలు..
తిరుమల మృతితో కట్టుబడివారిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పసిప్రాయంలోనే తల్లి దూరం కావడంతో ఆ ముగ్గురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో అనాథలుగా మారారు. తల్లి లేని లోటును తలచుకుని వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
​తన కుమార్తె మరణానికి అల్లుడు వీరాంజనేయులు పెట్టిన వేధింపులే కారణమని, నిష్కారణంగా తన బిడ్డను పొట్టనబెట్టుకున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి తాటికొండ శివపార్వతి పోలీసులకు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
Share:

చిలకలూరిపేటలో 20 ఏళ్ల నిస్వార్థ సేవ.. ఉచిత యోగాతో 10 వేల మందికి ఆరోగ్య సిరి! త్వరలో కొత్త బ్యాచ్!

చిలకలూరిపేటలో 20 ఏళ్ల నిస్వార్థ సేవ.. ఉచిత యోగాతో 10 వేల మందికి ఆరోగ్య సిరి! త్వరలో కొత్త బ్యాచ్!

చిలకలూరిపేటలో 20 వసంతాల ఉచిత యోగా సేవలు.. నేడు ఘనంగా 82వ శిబిరం ముగింపు!

​ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు 'శ్రీ వెంకటేశ్వర యోగా సేవా సంస్థ' ఒక సంజీవనిలా నిలుస్తోంది. చిలకలూరిపేట పట్టణంలో గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా యోగా శిక్షణ అందిస్తూ ఎంతో మందికి ఆరోగ్య ప్రదాతగా ఈ సంస్థ సేవలందిస్తోంది.

10 వేల మందికి పైగా యోగా విద్య..

స్థానిక శ్రీ సాదినేని చౌదరియ్య గారి స్కూల్ ప్రాంగణంలో 2005వ సంవత్సరం నుండి ఈ ఉచిత యోగా సేవా సంస్థను విజయవంతంగా నడుపుతున్నారు. ప్రతి శిబిరం 28 రోజుల పాటు కొనసాగుతుంది. గత 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పటివరకు 82 శిబిరాలను దిగ్విజయంగా నిర్వహించారు. ఈ శిబిరాల ద్వారా చిలకలూరిపేట మరియు పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు పదివేల మంది సాధకులు యోగ విద్యను అభ్యసించి శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందారు.

వ్యాధులకు అనుగుణంగా ప్రత్యేక ఆసనాలు..

ఈ సంస్థ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. సాధకుల వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను బట్టి వారికి అనువైన ఆసనాలు నేర్పించడం. సాధారణ యోగాభ్యాసంతో పాటు ముద్రలు, ధ్యానం (Meditation) లో శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా నేటి సమాజాన్ని వేధిస్తున్న నడుము నొప్పి, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ సమస్యలు, బీపీ (BP), షుగర్ (మధుమేహం), గుండె సంబంధిత రుగ్మతలు, హెర్నియా వంటి సుమారు 60 రకాల దీర్ఘకాలిక సమస్యలకు ఇక్కడ ప్రత్యేక ఆసన ప్రయోగాలు నేర్పుతారు. ఎలాంటి మందులు అవసరం లేకుండా యోగా ద్వారానే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధానాలను ఇక్కడ నేర్పుతారు.

నేడు 82వ శిబిరం ముగింపు.. త్వరలో కొత్త శిబిరం..

ఈరోజు (గురువారం) 82వ యోగా శిబిరం ముగింపు కార్యక్రమం జరుగుతోంది. కాగా, సరిగ్గా ఒక నెల రోజుల తర్వాత '83వ ఉచిత యోగా శిబిరం' ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

​చిలకలూరిపేట పట్టణ ప్రముఖులు, ప్రజలు అందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని తమ సొంతం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి

:శిఖాకొల్లి రాంబాబు,యోగా గురువు, చిలకలూరిపేట.ఫోన్ నెంబర్: 9959373880

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట గర్వించదగ్గ ముద్దుబిడ్డ, పద్మశ్రీ పురస్కార గ్రహీత.. నాదస్వర మాంత్రికుడు షేక్ మహబూబ్ సుభాని కన్నుమూత

చిలకలూరిపేట గర్వించదగ్గ ముద్దుబిడ్డ, పద్మశ్రీ పురస్కార గ్రహీత.. నాదస్వర మాంత్రికుడు షేక్ మహబూబ్ సుభాని కన్నుమూత


​నాదమే ప్రాణంగా, సంగీతమే లోకంగా బతికిన మన చిలకలూరిపేట ముద్దుబిడ్డ, ప్రముఖ నాదస్వర విద్వాంసుడు షేక్ మహబూబ్ సుభాని (71) ఇకలేరు. మార్చి 4, 2026 న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం చిలకలూరిపేటకే కాకుండా యావత్ కర్ణాటక సంగీత లోకానికి తీరని లోటు. సంగీతానికి మతం లేదని నిరూపించిన ఈ అరుదైన కళాకారుడు, తన నాదస్వరంతో మన పట్టణ కీర్తిని ఖండాంతరాలు దాటించారు.

కష్టాలను జయించి.. శిఖరాలను అధిరోహించి:

  • బాల్యం, పోరాటం: 1954-55 ప్రాంతంలో మన చిలకలూరిపేటలో జన్మించిన సుభాని గారు.. కేవలం ఏడేళ్ల చిరుప్రాయంలోనే నాదస్వర ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే, పేదరికం, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన కొంతకాలం పొగాకు కంపెనీలో గుమస్తాగా పని చేయాల్సి వచ్చింది. కష్టాలు ఎదురైనప్పటికీ, నాదస్వరంపై ఉన్న మక్కువతో ఆయన తన సాధనను ఎన్నడూ ఆపలేదు. మన చిలకలూరిపేట మట్టిలో పుట్టిన ఆ పట్టుదలే ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చింది.
  • అద్భుత జంట: కర్నాటక సంగీతంలోని ఎన్నో అరుదైన రాగాలు, కృతులను నాదస్వరంపై పలికించడంలో సుభాని గారు సిద్ధహస్తులు. తన భార్య కలీషాబీ మహాబూబ్‌తో కలిసి ఆయన చేసిన నాదస్వర గానం ఒక అద్భుతం. ఈ దంపతులు జంటగా నాదస్వరం వాయిస్తూ మన చిలకలూరిపేట పేరును దేశ విదేశాల్లో మార్మోగేలా చేశారు.
  • ఆధ్యాత్మిక పీఠాలకు ఆస్థాన విద్వాంసులుగా: దైవ సన్నిధిలో వీరి నాదస్వర గానం ఎంతో పవిత్రమైనది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన విద్వాంసులుగా సుదీర్ఘకాలం సేవలందించిన ఈ దంపతులను, వారి సంగీత ప్రతిభకు మెచ్చి 2001లో ప్రతిష్ఠాత్మక శృంగేరి శారదా పీఠం ఆస్థాన విద్వాంసులుగా నియమించింది. ఏడుకొండల వాడికి, శారదామాతకు మన చిలకలూరిపేట నాదాన్ని వినిపించిన ఘనత వీరిదే.
  • పద్మశ్రీ పురస్కారం.. మన పేటకు గర్వకారణం: సుభాని గారి ప్రతిభకు ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు, 2020లో భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ దంపతులు అత్యున్నత పౌర పురస్కారం 'పద్మశ్రీ' ని అందుకోవడం మన చిలకలూరిపేట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం.

​'నాదబ్రహ్మ' గా పేరొందిన సుభాని గారి భౌతిక కాయం దూరమైనా, ఆయన పలికించిన నాదం, ఆయన సాధించిన కీర్తి చిలకలూరిపేట గాలిలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. నాదస్వర విద్వాంసుల లోకంలో ఒక శకం ముగిసింది.

Share:

చిలకలూరిపేటలో ఆందోళన - మున్సిపల్ డీఈ అబ్దుల్ రహీంపై భగ్గుమన్న సచివాలయ సిబ్బంది! - అసలేం జరిగింది ?

చిలకలూరిపేటలో ఆందోళన - మున్సిపల్ డీఈ అబ్దుల్ రహీంపై భగ్గుమన్న సచివాలయ సిబ్బంది! - అసలేం జరిగింది ?

- ఫోన్‌లో దుర్భాషలాడటంపై భగ్గుమన్న ఉద్యోగులు

- అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ర్యాలీ

- తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు వినతి

చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): చిలకలూరిపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో సచివాలయ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (D.E) అబ్దుల్ రహీం అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సిబ్బంది మూకుమ్మడిగా నిరసనకు దిగారు. కింది స్థాయి ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆయనపై తక్షణమే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

​అసలేం జరిగిందంటే.. పట్టణంలోని పోలిరెడ్డి పాలెం ప్రాంతంలో మంచినీటి పైపులైన్ మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. ఈ విషయమై సచివాలయ సిబ్బంది శ్రీనివాసరావు, రమేష్‌లతో డి.ఈ అబ్దుల్ రహీం చరవాణి (ఫోన్) ద్వారా మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన తీవ్రమైన పదజాలంతో, ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న తమను.. ఒక ఉన్నతాధికారి స్థాయిలో ఉండి ఇలా అవమానించడం పట్ల పల్నాడు జిల్లా సచివాలయ యూనియన్ నాయకులు, సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

​డి.ఈ తీరును నిరసిస్తూ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదంటూ అక్కడినుంచి నినాదాలు చేసుకుంటూ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా బయలుదేరారు. ఎన్.ఆర్.టి (N.R.T) సెంటర్‌కు చేరుకున్న అనంతరం.. అక్కడ ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నిరసనను తెలియజేశారు.

​ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబును కలసి సచివాలయ సిబ్బంది సంఘం నాయకులు ఒక వినతిపత్రం అందజేశారు. విధుల్లో ఉన్న సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేసిన డి.ఈ అబ్దుల్ రహీంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.

​ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ అసోసియేషన్ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అలీ, పల్నాడు జిల్లా కార్యదర్శి ప్రతాప్, తదితర చిలకలూరిపేట సచివాలయ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

ప్రపంచానికి నెలఖరు కష్టాలు... మన ఏపీలో మాత్రం పేదల ఇంట పెన్షన్ల పండుగ! - 23వ వార్డు కౌన్సిలర్ కంచర్ల కరుణ

ప్రపంచానికి నెలఖరు కష్టాలు... మన ఏపీలో మాత్రం పేదల ఇంట పెన్షన్ల పండుగ! - 23వ వార్డు కౌన్సిలర్ కంచర్ల కరుణ


​ప్రపంచమంతా నెల చివరి రోజులకు వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ లోని పేదవారి ఇళ్లలో మాత్రం ఆనందం వెల్లివిరుస్తోంది. ఒకటవ తేదీ (ఆదివారం) సెలవు దినం కావడంతో, వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు... చిలకలూరిపేట పట్టణవ్యాప్తంగా శనివారం నాడే "ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ల పంపిణీ రంగా రంగా వైభవంగా జరిగింది.

​ఈ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యంగా 23వ వార్డు కౌన్సిలర్ కంచర్ల కరుణ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

​నెల చివరి రోజుల్లో ముఖాల్లో చిరునవ్వులు: కంచర్ల కరుణ

​చిలకలూరిపేట 23వ వార్డు పరిధిలోని సుబ్బయ్య తోట, గౌడ పాలెంలో వృద్ధులు, వికలాంగులకు కౌన్సిలర్ కంచర్ల కరుణ స్వయంగా పెన్షన్ల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "ప్రపంచం మొత్తం నెల చివర వచ్చిందంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. నెల మొదలయ్యే సమయానికి కుటుంబ పరిస్థితులతో సతమతమవుతూ ఉంటారు. కానీ, మన ఆంధ్రప్రదేశ్ లో దానికి పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది. నెల చివర వస్తుందంటే చాలు.. ఇక్కడి వృద్ధులు, వికలాంగుల్లో ఒకటే కోలాహలం! ఎందుకంటే కూటమి ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ ఒకరోజు ముందుగానే వారి ఇళ్ల వద్దకు వస్తోంది. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు" అని ఆమె కొనియాడారు. కౌన్సిలర్ కరుణ గారి చేతుల మీదుగా పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.


​దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెన్షన్ల పంపిణీ: ఎమ్మెల్యే ప్రత్తిపాటి

​చిలకలూరిపేట పట్టణంలోని 6, 7 వార్డులలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి నగదు అందజేశారు.

  • ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమం: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, భారీ బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలకు ఎక్కడా విఘాతం కలగకుండా చూస్తున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
  • ​ఖజానా ఖాళీగా ఉన్నా సకాలంలో పెన్షన్లు ఇస్తున్న ఘనత కూటమిదేనని, "ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఉండాలి" అన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

​పట్టణమంతా పండుగలా పంపిణీ (వివిధ వార్డుల్లో ఇలా..)

​ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచనలతో పట్టణంలోని అన్ని వార్డులలో భారీ ఎత్తున పెన్షన్ల పంపిణీ జరిగింది:

  • 37వ వార్డు: పండరీపురంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, కౌన్సిలర్ శివకుమారితో కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కమిషనర్ తెలిపారు.
  • 10వ వార్డు: గుర్రాల చావిడి మెయిన్ రోడ్డు, జాకీర్ హుస్సేన్ బజార్, బేరింగ్ బజార్ తదితర ప్రాంతాల్లో వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, స్థానిక టీడీపీ నేతలు ఉదయం నుండే పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు అధ్యక్షుడు షేక్ అజారుద్దీన్, సెక్రటరీ షేక్ దరియావలి, క్లస్టర్ ఇంచార్జ్ ముల్లా కరీముల్లా, యూనిట్ ఇంచార్జ్ అబ్దుల్ మజీద్, టీడీపీ సీనియర్ నేతలు ఎస్.ఎం కమల్ భాష, అమీర్ హంజా, సయ్యద్ హుస్సేన్, షేక్ హనీఫ్ బి, మజ్హరుద్దీన్, పట్టణ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ కరిముల్లా, షేక్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
  • 30వ వార్డు: స్థానిక 30వ వార్డులో వార్డు వైస్ ప్రెసిడెంట్ షేక్. మొహిదీన్ మియా - ఖైరునీసా దంపతులు ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

​సెలవు దినం రోజున ఇబ్బంది పడకుండా, ఒకరోజు ముందుగానే సకాలంలో చేతికి నగదు అందడం పట్ల చిలకలూరిపేట పట్టణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు


ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g.

Share:

చిలకలూరిపేట రూరల్ - నాదెండ్లలో పట్టపగలే భారీ చోరీ: వృద్ధురాలి ఇంట్లో నగదు, బంగారం అపహరణ!

​ చిలకలూరిపేట రూరల్ - నాదెండ్లలో పట్టపగలే భారీ చోరీ: వృద్ధురాలి ఇంట్లో నగదు, బంగారం అపహరణ!

నాదెండ్ల (చిలకలూరిపేట):

మండల పరిధిలోని నాదెండ్ల గ్రామంలో గురువారం మధ్యాహ్నం పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన నల్లమోతు పుష్పావతి (65) అనే వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ఆమె ఇంట్లో లేని సమయాన్ని చూసి చేతివాటం ప్రదర్శించారు.

ఘటన వివరాలు:

​గురువారం మధ్యాహ్నం సుమారు 3:00 గంటల సమయంలో పుష్పావతి గారు బయటకు వెళ్లిన తరుణంలో దొంగలు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. ఇంటి వరండాలో ఉన్న ఇనుప గ్రిల్ వెల్డింగ్‌ను చాకచక్యంగా పగలకొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం గదిలోని బీరువా లాకర్లను ధ్వంసం చేసి, అందులో ఉన్న సుమారు 3 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు 30,000 రూపాయల నగదును అపహరించుకుపోయారు.

క్లూస్ టీం రంగ ప్రవేశం:

​బాధితురాలి ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు నేడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా నుండి వచ్చిన క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలు మరియు ఇతర కీలక ఆధారాలను సేకరించారు. దొంగలు పక్కా రెక్కీ నిర్వహించి ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

దర్యాప్తు ముమ్మరం:

​ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పట్టపగలే ఊరి నడిబొడ్డున దొంగతనం జరగడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. తమ ఇళ్లకు పటిష్టమైన భద్రత కల్పించుకోవాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

రిపోర్టింగ్: చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

#ChilakaluripetSpeedNews #NadendlaNews #TheftInNadendla #ChilakaluripetCrime #LocalNews

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - పోతవరం రోడ్డులో ఆటో బోల్తా.. కాన్వాయ్ ఆపి సాయం చేసిన మంత్రి జనార్దన్ రెడ్డి.

చిలకలూరిపేట - పోతవరం రోడ్డులో ఆటో బోల్తా.. కాన్వాయ్ ఆపి సాయం చేసిన మంత్రి జనార్దన్ రెడ్డి.


చిలకలూరిపేట: చిలకలూరిపేట - కోటప్పకొండ ప్రధాన రహదారిపై శుక్రవారం అనుకోని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోతవరం గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి ప్రమాదవశాత్తు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ భయంకర ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడి, నెత్తురోడుతూ రోడ్డుపైనే పడిపోయాడు.

కాన్వాయ్ ఆపి.. కదిలొచ్చిన మంత్రి:

సరిగ్గా అదే సమయానికి బనగానపల్లె వెళ్లేందుకు ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రాష్ట్ర మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి.. ఈ ప్రమాదాన్ని గమనించారు. ప్రమాద తీవ్రతను చూసిన మంత్రి క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే తన కాన్వాయ్ ని రోడ్డు పక్కన ఆపించారు. తన భద్రతా సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్ర గాయాల పాలై నరకయాతన అనుభవిస్తున్న ఆటో డ్రైవర్ ను పరామర్శించారు.

దగ్గరుండి ఫస్ట్ ఎయిడ్.. ఆస్పత్రికి తరలింపు:

కేవలం చూసి వెళ్లిపోకుండా.. మంత్రి తన సిబ్బంది సాయంతో బాధితుడికి వెంటనే ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) అందించారు. అనంతరం 108 అంబులెన్స్ కు సమాచారం అందించి, క్షతగాత్రుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమే కాకుండా, అతనికి తక్షణమే అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని స్థానిక అధికారులకు, వైద్యులకు ఫోన్ ద్వారా కఠిన ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి ఔదార్యంపై సర్వత్రా హర్షం:

సాధారణంగా వీఐపీలు, రాజకీయ నాయకులు ఇలాంటి ఘటనలు చూసినా తమ ప్రయాణాన్ని ఆపకుండా వెళ్లిపోతుంటారు. కానీ, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన పర్యటనను సైతం పక్కనపెట్టి, ఓ సామాన్యుడి ప్రాణాలు కాపాడేందుకు చూపించిన చొరవ అక్కడి వారిని కదిలించింది. మంత్రి స్వయంగా స్పందించిన తీరును ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు వేనోళ్ల కొనియాడారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి ఆయన నిజమైన నాయకుడి లక్షణాన్ని చాటుకున్నారని చిలకలూరిపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి