|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిపల్నాడులో ఏసీబీ హైఓల్టేజ్ రైడ్స్.. రిజిస్ట్రార్ ఆఫీసులో కట్టల కొద్దీ నోట్లు సీజ్!
CHILAKALURI PET SPEED NEWSTuesday, December 23, 2025ఏసీబీ దాడులు, చిలకలూరిపేట, చిలకలూరిపేట స్పీక్ న్యూస్, పల్నాడు
No comments
పల్నాడులో ఏసీబీ హైఓల్టేజ్ రైడ్స్.. రిజిస్ట్రార్ ఆఫీసులో కట్టల కొద్దీ నోట్లు సీజ్!
💥 నరసరావుపేటలో తనిఖీలు: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారుల మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. మన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లెక్కకు రాని నగదును సీజ్ చేసినట్లు సమాచారం.
⚡ 12 చోట్ల ఏకకాలంలో: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో (SRO) ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఇందులో ఒంగోలు, నెల్లూరు, ఇబ్రహీంపట్నం మరియు వైజాగ్ కార్యాలయాలు ఉన్నాయి.
🕵️♂️ ప్రైవేట్ వ్యక్తుల హల్చల్: చాలా కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు బదులుగా ప్రైవేట్ వ్యక్తులు (మిడిల్ మెన్) అనధికారికంగా పనులు చక్కబెడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. అలాగే పలువురి వద్ద లెక్కల్లో చూపని లక్షల రూపాయల నగదు పట్టుబడింది.
⚠️ హెచ్చరిక: ప్రజలను ఇబ్బంది పెట్టినా, లంచం డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
📢 - చిలకలూరిపేట స్పీడ్ న్యూస్
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి సోలార్ సిస్టంని బిగించుకోండి. మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423
చిలకలూరిపేట వాసికి రాష్ట్ర స్థాయి పురస్కారం.. మురికిపూడి ప్రసాద్‌కు అరుదైన గౌరవం!
CHILAKALURI PET SPEED NEWSTuesday, December 23, 2025#ChilakaluripetPride #StateLevelAward #ConsumerActivist #MurikipudiPrasad #SpeedNewsUpdate
No comments
🏆 చిలకలూరిపేట వాసికి రాష్ట్ర స్థాయి పురస్కారం.. మురికిపూడి ప్రసాద్‌కు అరుదైన గౌరవం!
🌟 రాష్ట్ర స్థాయి గుర్తింపు: పల్నాడు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు, మన చిలకలూరిపేట వాసి మురికిపూడి ప్రసాద్ 'రాష్ట్ర స్థాయి బెస్ట్ కన్స్యూమర్ ఆక్టివిస్ట్' అవార్డుకు ఎంపికయ్యారు.
🤝 సేవకు సత్కారం: వినియోగదారుల హక్కులపై ప్రజలను చైతన్యపరచడంలో ఆయన చేస్తున్న విశేష కృషికి ఈ గుర్తింపు లభించింది. గత ఏడాది జిల్లా స్థాయి అవార్డు అందుకోగా, ఈసారి రాష్ట్ర స్థాయికి ఎంపికవడం విశేషం.
🏅 మంత్రి చేతుల మీదుగా: బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో.. మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రసాద్ గారు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
📢 - చిలకలూరిపేట స్పీడ్ న్యూస్
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి సోలార్ సిస్టంని బిగించుకోండి. మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423
చిలకలూరిపేటలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
CHILAKALURI PET SPEED NEWSSunday, December 21, 2025#Chilakaluripeta #YSJaganBirthday #VidadalaRajini #YSRCP #BloodDonation #Edlapadu #Solasa #ChilakaluripetaSpeedNews
No comments
చిలకలూరిపేటలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
చిలకలూరిపేటలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
🔥 ఢిల్లీని ఢీకొన్న ధైర్యశాలి వైఎస్ జగన్: మాజీ మంత్రి విడదల రజిని
చిలకలూరిపేట/ఎడ్లపాడు:
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆదివారం అత్యంత ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
వేడుకల హైలైట్స్:
భారీ కేక్ కటింగ్: చిలకలూరిపేటలోని విడదల రజిని నివాసం వద్ద కార్యకర్తల సమక్షంలో భారీ కేక్‌ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కూటమికి భయం పుట్టించిన నేత: ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ.. ఇచ్చిన మాట కోసం ప్రజల పక్షాన నిలబడి, ఢిల్లీ అధిష్టానాన్నే ఢీకొన్న ధైర్యశాలి జగన్ అని కొనియాడారు. విడిపోతే ఓడిపోతామనే భయాన్ని కూటమి నేతలకు చూపించిన ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.
ర్యాలీ మరియు సేవా కార్యక్రమాలు:
ఆసుపత్రిలో పంపిణీ: విడదల రజిని నివాసం నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు (ఫ్రూట్స్) పంపిణీ చేశారు.
సొలసలో రక్తదాన శిబిరం: ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మద్దూరి విజయ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని విడదల రజిని ప్రారంభించారు. రక్తదానం చేసిన కార్యకర్తలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
✒️ - రిపోర్టింగ్, చిలకలూరిపేట స్పీడ్ న్యూస్
(మన ఊరు - మన వార్తలు)
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి సోలార్ సిస్టంని బిగించుకోండి. మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423
✈️ విమానాశ్రయాలకు దీటుగా ఆర్టీసీ బస్టాండ్లు.. చిలకలూరిపేటలో జోనల్ చైర్మన్ రమేష్ బాబు పిలుపు
CHILAKALURI PET SPEED NEWSSunday, December 21, 2025#APSRTC #Chilakaluripeta #RameshBabu #RTCUpdates #SwachhBharat #NelloreZone #ChilakaluripetaSpeedNews
No comments
✈️ విమానాశ్రయాలకు దీటుగా ఆర్టీసీ బస్టాండ్లు.. చిలకలూరిపేటలో జోనల్ చైర్మన్ రమేష్ బాబు పిలుపు
చిలకలూరిపేట:
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ, ఆర్టీసీ బస్టాండ్లను విమానాశ్రయాల స్థాయిలో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని నెల్లూరు జోనల్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రమేష్ బాబు పిలుపునిచ్చారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆయన, కార్మికులు మరియు బస్టాండ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
ప్రయాణికులే ప్రాధాన్యం: బస్టాండ్ల నిర్వహణ విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండాలని, ప్రయాణికులు బస్టాండ్‌లోకి అడుగుపెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలని సూచించారు.
కార్మికులకు భరోసా: సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ కార్మికులకు, సిబ్బందికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి సమస్యలను పరిష్కరించడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు.
స్వచ్ఛభారత్ - స్వచ్ఛ బస్టాండ్: 'స్వచ్ఛభారత్' స్ఫూర్తితో బస్టాండ్ ఆవరణను, డిపోను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ కోసం అవసరమైన ఆధునిక పరికరాలను త్వరలోనే అందజేస్తామని తెలిపారు.
ఘన సత్కారం:
ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్, ఇతర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ రమేష్ బాబు గారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ ఎదుగుదల లో భాగమైన సిబ్బందిని, కార్మికులను, డ్రైవర్ మరియు కండక్టర్లను జోనల్ చైర్మన్ రమేష్ బాబు సత్కరించారు.
✒️ - రిపోర్టింగ్, చిలకలూరిపేట స్పీడ్ న్యూస్
(మన ఊరు - మన వార్తలు)
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి సోలార్ సిస్టంని బిగించుకోండి. మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423
బాదుడే బాదుడు.. రైలు ఛార్జీలు పెరిగాయి! మీ టికెట్ రేటు ఎంత పెరిగిందో తెలుసుకోండి!
CHILAKALURI PET SPEED NEWSSunday, December 21, 2025Chilakaluripet Speed న్యూస్, చార్జీలు, చిలకలూరిపేట, పెరిగిన రైలు చార్జీలు, రైలు
No comments
బాదుడే బాదుడు.. రైలు ఛార్జీలు పెరిగాయి! మీ టికెట్ రేటు ఎంత పెరిగిందో తెలుసుకోండి!
రైల్వే ప్రయాణికులకు చేదు వార్త! సామాన్యుడి రవాణా సాధనమైన రైలు ప్రయాణం ఇకపై కొంచెం భారం కానుంది. రైల్వే శాఖ తాజాగా ఛార్జీలను సవరిస్తూ ప్రకటన విడుదల చేసింది.
ముఖ్యమైన మార్పులు ఇవే:
దూర ప్రయాణాలను (Long Journey) లక్ష్యంగా చేసుకుని ఈ ధరల పెంపు జరిగింది. 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ వాత తప్పదు.
ఆర్డినరీ క్లాస్ (Ordinary Class): కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెంచారు.
ఎక్స్ ప్రెస్ & ఏసీ (Mail/Express/AC): కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెంచారు.
మీ జేబుపై పడే భారం ఎంత?
ఉదాహరణకు, మీరు ఒక 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలనుకుంటే.. నాన్-ఏసీ కోచ్ టికెట్ పై అదనంగా రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది.
అమలు తేదీ: ఈ కొత్త ధరలు ఈ నెల 26 నుండి అమల్లోకి వస్తాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఫాలో అవ్వండి..
👉 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ (Chilakaluripeta Speed News)
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి సోలార్ సిస్టంని బిగించుకోండి. మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423
గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట: 17వ వార్డులో పర్యటించిన టీడీపీ నాయకులు - ప్రజా సమస్యలపై ఆరా
CHILAKALURI PET SPEED NEWSSunday, December 21, 2025# Chilakaluripet speed news, #Chilakaluripeta #TDP #PrathipatiPullaRao #GoodMorningChilakaluripeta #CPTSpeedNews #PoliticalNews #PublicIssues
No comments
గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట: 17వ వార్డులో పర్యటించిన టీడీపీ నాయకులు - ప్రజా సమస్యలపై ఆరా
తేదీ: డిసెంబర్ 21, 2025
న్యూస్ సోర్స్: చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ (CPT Speed News)
పూర్తి వివరాలు:
చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా "గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట" కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు, టీడీపీ పట్టణ నాయకత్వం ఈరోజు 17వ వార్డులో విస్తృత పర్యటన చేపట్టింది.
కార్యక్రమ విశేషాలు:
ఈరోజు (ఆదివారం) ఉదయం 6:30 గంటల నుండి 8:00 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి ఆధ్వర్యంలో నాయకులు వడ్డెర కాలనీ (17వ వార్డు)లోని పలు ప్రాంతాలను సందర్శించారు. క్లస్టర్, యూనిట్ ఇంచార్జిలు, బూత్ కన్వీనర్లు మరియు స్థానిక ముఖ్య నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా గుర్తించిన సమస్యలు:
స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలు మరియు కొత్త కల్వర్టుల ఆవశ్యకతను నాయకులు పరిశీలించారు. వార్డులో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను నోట్ చేసుకున్నామని, వీటిని త్వరలోనే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో కింది నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు:
కో-క్లస్టర్: సయ్యద్ వహబ్
యూనిట్ ఇంచార్జి: పిల్లి లెనిన్
17వ వార్డ్ అధ్యక్ష, కార్యదర్శులు: మచ్చా వెంకటేశ్వర్లు, నక్కా నరసింహారావు
బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు: పుల్లారావు
బీసీ నాయకులు: గుంజి వీరాంజనేయులు
క్లస్టర్ ఇంచార్జిలు: ముల్లా కరీముల్లా (8వ క్లస్టర్), మస్తాన్ వలి (10వ క్లస్టర్)
బూత్ కన్వీనర్లు: రాజేష్, పుల్లేశ్వరరావు, గోపి
ఇతర ముఖ్య నాయకులు: పట్టణ కమిటీ కార్యదర్శి ముస్తఫా, వేటపాలెం సుభాని, అజహారుద్దీన్, గోల్డ్ సుభాని, శ్రీకాంత్, మద్దిబోయిన శేఖర్, ప్రశాంత్, ప్రసాద్, బాబీ తదితరులు.
అధిక కరెంటు బిల్లులతో బాధపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి సోలార్ ని బిగించుకోండి :- ఆదిత్య సోలార్ +91 80743 00423
సుబ్బయ్య తోట లింకు రోడ్డును వెంటనే బాగు చేయాలి, ప్రమాదాలకు అడ్డాగా మెయిన్ రోడ్డు:- సీపీఐ నేత శివకుమార్
CHILAKALURI PET SPEED NEWSSunday, December 21, 2025Chilakaluripet speed news, చిలకలూరిపేట స్పీడ్ న్యూస్, రోడ్డు ప్రమాదాలు, సుబ్బయ్య తోట
No comments
చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ :-
🚧 సుబ్బయ్య తోట లింకు రోడ్డును వెంటనే బాగు చేయాలి: సీపీఐ నేత శివకుమార్ డిమాండ్
చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోట, రాయుడు కంటి ఆసుపత్రి రోడ్డులోని సచివాలయం వద్ద ఉన్న దుస్థితిపై సీపీఐ నాయకులు నాయుడు శివకుమార్ స్పందించారు.
📍 ప్రధాన సమస్యలు:
👉 సుబ్బయ్య తోట నుండి NH16 (జాతీయ రహదారి)ను కలిపే లింకు రోడ్డు చాలా కాలంగా అధ్వానంగా ఉంది.
👉 ఇక్కడ కల్వర్టు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
👉 పక్కనే ఉన్న రెండు రోడ్లకు కల్వర్టులు కట్టి బాగు చేసినా, ఈ రోడ్డును మాత్రం అధికారులు విస్మరించారు.
🗣️ నాయుడు శివకుమార్ ఏమన్నారంటే:
"గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదు. పక్క రోడ్లు బాగుచేసి దీన్ని వదిలేయడం సరికాదు. వెంటనే కల్వర్టు నిర్మించి, లింకు రోడ్డును ఏర్పాటు చేయాలి. లేదంటే ప్రమాదాలకు అధికారులే బాధ్యత వహించాలి. గతంలో చాలా ప్రమాదాలు జరిగి ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని త్వరగా నిధులు మంజూరు చేసి రోడ్డును బాగు చేయాలని ఆయన కోరారు "
అధిక కరెంట్ బిల్లులతో బాధపడుతున్నారా ఇప్పుడే వెంటనే సోలార్ ని బిగించండి. ఆదిత్య సోలార్ పవర్ +91 8074300423 ఈ నెంబర్ కి కాల్ చేసి స్లాట్ ను బుక్ చేసుకోండి.




