చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేటలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
✈️ విమానాశ్రయాలకు దీటుగా ఆర్టీసీ బస్టాండ్లు.. చిలకలూరిపేటలో జోనల్ చైర్మన్ రమేష్ బాబు పిలుపు
బాదుడే బాదుడు.. రైలు ఛార్జీలు పెరిగాయి! మీ టికెట్ రేటు ఎంత పెరిగిందో తెలుసుకోండి!
గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట: 17వ వార్డులో పర్యటించిన టీడీపీ నాయకులు - ప్రజా సమస్యలపై ఆరా
సుబ్బయ్య తోట లింకు రోడ్డును వెంటనే బాగు చేయాలి, ప్రమాదాలకు అడ్డాగా మెయిన్ రోడ్డు:- సీపీఐ నేత శివకుమార్
భావితరాలకు వెలుగునిద్దాం - ఇంధనం పొదుపు చేద్దాం: చిలకలూరిపేటలో ఘనంగా విద్యుత్ పొదుపు వారోత్సవాల ర్యాలీ
భావితరాలకు వెలుగునిద్దాం - ఇంధనం పొదుపు చేద్దాం: చిలకలూరిపేటలో ఘనంగా విద్యుత్ పొదుపు వారోత్సవాల ర్యాలీ
చిలకలూరిపేట స్పీడ్ న్యూస్:
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను పురస్కరించుకుని చిలకలూరిపేట డివిజన్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. "ఇంధనం పొదుపు చేద్దాం - భావితరాలకు వెలుగునిద్దాం" అనే నినాదంతో జరిగిన ఈ ర్యాలీని ఈఆర్వో (ERO) ఆఫీసు నుండి గడియార స్తంభం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వై. ఏడుకొండలు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. అశోక్ కుమార్, ఏఈలు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
డిసెంబర్ 14 నుండి 20 వరకు జరుగుతున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, విద్యుత్ పొదుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఈఈ వై. ఏడుకొండలు గారు మాట్లాడుతూ విద్యుత్ ఆదా చేయడానికి ప్రజలకు పలు సూచనలు చేశారు.
విద్యుత్ పొదుపు కోసం 4 ముఖ్య సూత్రాలు:
అనవసర వినియోగం వద్దు: గదుల్లో ఎవరు లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
స్టార్ రేటింగ్: విద్యుత్ పరికరాలు (AC, Fridge వంటివి) కొనుగోలు చేసేటప్పుడు 3 కంటే ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్నవాటిని ఎంచుకోవడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది.
సోలార్ వినియోగం: గీజర్లు, వాటర్ మోటార్లకు సోలార్ విద్యుత్ వాడటం ద్వారా కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు.
ప్లగ్ ఆఫ్ చేయాలి: టీవీలు, మొబైల్ ఛార్జర్లు వాడకం అయిపోయాక కేవలం రిమోట్ ద్వారా లేదా పిన్ తీసి కాకుండా, మెయిన్ స్విచ్ కూడా ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చు.
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన:
తరిగిపోతున్న సహజ వనరులను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద లభించే రాయితీని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపాలని అధికారులు కోరారు.
చిలకలూరిపేట సోలార్ కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి 80743 00423
స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు:
స్మార్ట్ సిటీ కింద ఎంపికైన చిలకలూరిపేటలో విద్యుత్ శాఖ సిబ్బంది స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. దీనివల్ల బిల్లులు ఎక్కువగా వస్తాయనే ప్రచారంలో నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు www.apcpdcl.in సైట్ లేదా యాప్ ద్వారా తమ రోజువారీ విద్యుత్ వినియోగాన్ని స్వయంగా పరిశీలించుకోవచ్చని తెలిపారు.
విద్యుత్ వినియోగదారులకు సువర్ణావకాశం (50% రాయితీ):
ఇళ్లలో విద్యుత్ లోడ్ (Load) పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అదనపు లోడ్ రెగ్యులరైజేషన్ కోసం చెల్లించాల్సిన డెవలప్‌మెంట్ చార్జీలలో 50% రాయితీ ప్రకటించారు.
గడువు: ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మీరు తీసుకున్న లోడ్ కంటే ఎక్కువ వాడుతున్నట్లయితే, వెంటనే దగ్గరలోని విద్యుత్ రెవిన్యూ కార్యాలయాన్ని సంప్రదించి, రాయితీతో లోడును క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.
వోల్టేజ్ సమస్యలు, స్తంభాలు లేదా లైన్లకు సంబంధించిన సమస్యలు ఉంటే సంబంధిత ఏఈలను సంప్రదించాలని, సలహాలు లేదా సూచనల కోసం టిడ్కో గృహాల వద్ద ఉన్న కార్యాలయంలో తనను నేరుగా కలవవచ్చని ఈఈ వై. ఏడుకొండలు తెలిపారు.
వైసీపీ మేనిఫెస్టో విడుదల
వైసీపీ మేనిఫెస్టో విడుదల
YSRCP Manifesto 2024 : మేనిఫెస్టో(Manifesto) అంటే పవిత్రమైన గ్రంథమని అన్నారు వైసీపీ అధినేత జగన్(YS Jagan). 2019లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామని గుర్తు చేశారు. 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన.... మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో సమానంగా చూసి అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోకు కావాల్సిన గుర్తింపును ఇచ్చామని చెప్పారు. నవరత్నాల పాలనకు మేనిఫెస్టో అద్దంపట్టిందన్నారు. నవరత్నాల కింద 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను డీబీటీల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇది ఒక చరిత్ర అని జగన్ చెప్పుకొచ్చారు.
2019లో(YSRCP Manifesto 2019) ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఆంధ్రా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా...గడిచిన 58 నెలల కాలంలో అమలు చేశామని చెప్పారు. చేయగలిగివే చెప్పి చేసి చూపించామన్నారు. అవి అమలు చేసే ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తున్నామని ఉద్ఘింటించారు. సమస్యలకు పరిష్కారం చూపుతూ 58 నెలల వైసీపీ ప్రభుత్వ పాలన జరిగిందని చెప్పారు. కొవిడ్ లాంటి సమస్యలు వచ్చినా... సాకులు చూపలేదన్నారు.
YSRCP Manifesto -వైసీపీ మేనిఫెస్టో -2024 వివరాలు:
2024 ఎన్నికలకు సంబంధించి రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను(YSRCP Manifesto 2024) విడుదల చేసింది.
విద్య, వైద్యం,వ్యవసాయానికి ప్రాధ్యానత ఇస్తూ మేనిఫెస్టో రూపకల్పన
- మహిళలు, అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద గతంలో రూ. 75 వేలుగా ఉండేది. ఈసారి కూడా ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తామని జగన్ తెలిపారు.
వైఎస్ఆర్ కాపు నేస్తం కింద మరో నాలుగు ధపాల కింద డబ్బులు ఇస్తాం.
- వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద మూడు దఫాలు ఇచ్చాం. మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తాం.
జగనన్న అమ్మఒడి కింద రూ. 15 వేలు ఉండేది. ఈసారి రూ. 17 వేలకు పెంచుతామని ప్రకటన
సున్నా వడ్డీ కింద రుణాల మాఫీ స్కీమ్ కొనసాగుతుంది.
-వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ ముబారక్ స్కీమ్ ను కొనసాగిస్తామని జగన్ తెలిపారు.
వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేల పెంపు, వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంపు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేల వరకు పెంచుతామని జగన్ ప్రకటించారు.
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ స్కీమ్ కొనసాగింపు ఉంటుంది.
లారీడ్రైవర్లకు కూడా వాహనమిత్ర - రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా.
వైఎస్ఆర్ లా నేస్తం కొనసాగింపు ఉంటుంది.
వైఎస్ఆర్ రైతు భరోసా రూ. 16వేలకు పెంపు.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీని మరింత బలోపేతం చేస్తామని జగన్ ప్రకటన.
రాష్ట్రంలో తలపెట్టిన 12 కొత్త మెడికల్ కాలేజీలను వేగంగా పూర్తి చేస్తాం.
కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువస్తాం.
దళితుల జనాభా 500కి పైగా ఉంటే ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటన.
దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధులు.
అప్కో బకాయిలను ఈ దఫా కూడా కొనసాగిస్తాం.
కాపు సంక్షేమం కోసం వైసీపీ పాలనలో రూ. 34వేల కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో మరింత సంక్షేమం చేస్తాం.
ఔట్ సోర్సింగ్ కింద రూ. 25వేల వరకు జీతం పొందే ఉద్యోగులకు విద్య, వైద్యానికి సంబంధించిన నవరత్నాల స్కీమ్ లను వర్తింపజేస్తారు.
వైఎస్ఆర్ బీమా స్కీమ్ కింద ఆన్ లైన్ లో పుడ్ ఆర్డర్స్ ను సప్లయ్ చేసే వారికి వర్తింపజేస్తారు.
బోగాపురం పోర్టు పనులను మరింత వేగంగా పూర్తి చేస్తామని జగన్ ప్రకటన.
వచ్చే ఐదేళ్లలో సురక్షితమైన తాగు నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం.
వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే… విశాఖపట్నం నుంచి పాలన ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని జగన్ కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం.






