మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట: 17వ వార్డులో పర్యటించిన టీడీపీ నాయకులు - ప్రజా సమస్యలపై ఆరా


​గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట: 17వ వార్డులో పర్యటించిన టీడీపీ నాయకులు - ప్రజా సమస్యలపై ఆరా

తేదీ: డిసెంబర్ 21, 2025
న్యూస్ సోర్స్: చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ (CPT Speed News)

​పూర్తి వివరాలు:
​చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా "గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట" కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు, టీడీపీ పట్టణ నాయకత్వం ఈరోజు 17వ వార్డులో విస్తృత పర్యటన చేపట్టింది.

​కార్యక్రమ విశేషాలు:
ఈరోజు (ఆదివారం) ఉదయం 6:30 గంటల నుండి 8:00 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి ఆధ్వర్యంలో నాయకులు వడ్డెర కాలనీ (17వ వార్డు)లోని పలు ప్రాంతాలను సందర్శించారు. క్లస్టర్, యూనిట్ ఇంచార్జిలు, బూత్ కన్వీనర్లు మరియు స్థానిక ముఖ్య నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

​ప్రధానంగా గుర్తించిన సమస్యలు:
స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలు మరియు కొత్త కల్వర్టుల ఆవశ్యకతను నాయకులు పరిశీలించారు. వార్డులో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను నోట్ చేసుకున్నామని, వీటిని త్వరలోనే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

​పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో కింది నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు:
​కో-క్లస్టర్: సయ్యద్ వహబ్
​యూనిట్ ఇంచార్జి: పిల్లి లెనిన్
​17వ వార్డ్ అధ్యక్ష, కార్యదర్శులు: మచ్చా వెంకటేశ్వర్లు, నక్కా నరసింహారావు
​బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు: పుల్లారావు
​బీసీ నాయకులు: గుంజి వీరాంజనేయులు
​క్లస్టర్ ఇంచార్జిలు: ముల్లా కరీముల్లా (8వ క్లస్టర్), మస్తాన్ వలి (10వ క్లస్టర్)
​బూత్ కన్వీనర్లు: రాజేష్, పుల్లేశ్వరరావు, గోపి
​ఇతర ముఖ్య నాయకులు: పట్టణ కమిటీ కార్యదర్శి ముస్తఫా, వేటపాలెం సుభాని, అజహారుద్దీన్, గోల్డ్ సుభాని, శ్రీకాంత్, మద్దిబోయిన శేఖర్, ప్రశాంత్, ప్రసాద్, బాబీ తదితరులు.

 అధిక కరెంటు బిల్లులతో బాధపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి సోలార్ ని బిగించుకోండి :-  ఆదిత్య సోలార్ +91 80743 00423
Share:

సుబ్బయ్య తోట లింకు రోడ్డును వెంటనే బాగు చేయాలి, ప్రమాదాలకు అడ్డాగా మెయిన్ రోడ్డు:- సీపీఐ నేత శివకుమార్


 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ :- 
​🚧 సుబ్బయ్య తోట లింకు రోడ్డును వెంటనే బాగు చేయాలి: సీపీఐ నేత శివకుమార్ డిమాండ్
​చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోట, రాయుడు కంటి ఆసుపత్రి రోడ్డులోని సచివాలయం వద్ద ఉన్న దుస్థితిపై సీపీఐ నాయకులు నాయుడు శివకుమార్ స్పందించారు.
​📍 ప్రధాన సమస్యలు:
👉 సుబ్బయ్య తోట నుండి NH16 (జాతీయ రహదారి)ను కలిపే లింకు రోడ్డు చాలా కాలంగా అధ్వానంగా ఉంది.
👉 ఇక్కడ కల్వర్టు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
👉 పక్కనే ఉన్న రెండు రోడ్లకు కల్వర్టులు కట్టి బాగు చేసినా, ఈ రోడ్డును మాత్రం అధికారులు విస్మరించారు.
​🗣️ నాయుడు శివకుమార్ ఏమన్నారంటే:
"గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదు. పక్క రోడ్లు బాగుచేసి దీన్ని వదిలేయడం సరికాదు. వెంటనే కల్వర్టు నిర్మించి, లింకు రోడ్డును ఏర్పాటు చేయాలి. లేదంటే ప్రమాదాలకు అధికారులే బాధ్యత వహించాలి. గతంలో చాలా ప్రమాదాలు జరిగి ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని త్వరగా నిధులు మంజూరు చేసి రోడ్డును బాగు చేయాలని ఆయన కోరారు "


 అధిక కరెంట్ బిల్లులతో బాధపడుతున్నారా ఇప్పుడే వెంటనే సోలార్ ని బిగించండి. ఆదిత్య సోలార్ పవర్  +91 8074300423 ఈ నెంబర్ కి కాల్ చేసి స్లాట్ ను బుక్ చేసుకోండి.
Share:

భావితరాలకు వెలుగునిద్దాం - ఇంధనం పొదుపు చేద్దాం: చిలకలూరిపేటలో ఘనంగా విద్యుత్ పొదుపు వారోత్సవాల ర్యాలీ

భావితరాలకు వెలుగునిద్దాం - ఇంధనం పొదుపు చేద్దాం: చిలకలూరిపేటలో ఘనంగా విద్యుత్ పొదుపు వారోత్సవాల ర్యాలీ
 

Chilakaluripeta News, Electricity Department, Energy Conservation, Local News


చిలకలూరిపేట స్పీడ్ న్యూస్:

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను పురస్కరించుకుని చిలకలూరిపేట డివిజన్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. "ఇంధనం పొదుపు చేద్దాం - భావితరాలకు వెలుగునిద్దాం" అనే నినాదంతో జరిగిన ఈ ర్యాలీని ఈఆర్వో (ERO) ఆఫీసు నుండి గడియార స్తంభం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వై. ఏడుకొండలు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. అశోక్ కుమార్, ఏఈలు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

​డిసెంబర్ 14 నుండి 20 వరకు జరుగుతున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, విద్యుత్ పొదుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఈఈ వై. ఏడుకొండలు గారు మాట్లాడుతూ విద్యుత్ ఆదా చేయడానికి ప్రజలకు పలు సూచనలు చేశారు.

​విద్యుత్ పొదుపు కోసం 4 ముఖ్య సూత్రాలు:

​అనవసర వినియోగం వద్దు: గదుల్లో ఎవరు లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

​స్టార్ రేటింగ్: విద్యుత్ పరికరాలు (AC, Fridge వంటివి) కొనుగోలు చేసేటప్పుడు 3 కంటే ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్నవాటిని ఎంచుకోవడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది.

​సోలార్ వినియోగం: గీజర్లు, వాటర్ మోటార్లకు సోలార్ విద్యుత్ వాడటం ద్వారా కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు.

​ప్లగ్ ఆఫ్ చేయాలి: టీవీలు, మొబైల్ ఛార్జర్లు వాడకం అయిపోయాక కేవలం రిమోట్ ద్వారా లేదా పిన్ తీసి కాకుండా, మెయిన్ స్విచ్ కూడా ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చు.

​ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన:

తరిగిపోతున్న సహజ వనరులను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద లభించే రాయితీని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపాలని అధికారులు కోరారు.

  చిలకలూరిపేట సోలార్ కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి 80743 00423

​స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు:

స్మార్ట్ సిటీ కింద ఎంపికైన చిలకలూరిపేటలో విద్యుత్ శాఖ సిబ్బంది స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. దీనివల్ల బిల్లులు ఎక్కువగా వస్తాయనే ప్రచారంలో నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు www.apcpdcl.in సైట్ లేదా యాప్ ద్వారా తమ రోజువారీ విద్యుత్ వినియోగాన్ని స్వయంగా పరిశీలించుకోవచ్చని తెలిపారు.

​విద్యుత్ వినియోగదారులకు సువర్ణావకాశం (50% రాయితీ):

ఇళ్లలో విద్యుత్ లోడ్ (Load) పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అదనపు లోడ్ రెగ్యులరైజేషన్ కోసం చెల్లించాల్సిన డెవలప్‌మెంట్ చార్జీలలో 50% రాయితీ ప్రకటించారు.

​గడువు: ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

​మీరు తీసుకున్న లోడ్ కంటే ఎక్కువ వాడుతున్నట్లయితే, వెంటనే దగ్గరలోని విద్యుత్ రెవిన్యూ కార్యాలయాన్ని సంప్రదించి, రాయితీతో లోడును క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.

​వోల్టేజ్ సమస్యలు, స్తంభాలు లేదా లైన్లకు సంబంధించిన సమస్యలు ఉంటే సంబంధిత ఏఈలను సంప్రదించాలని, సలహాలు లేదా సూచనల కోసం టిడ్కో గృహాల వద్ద ఉన్న కార్యాలయంలో తనను నేరుగా కలవవచ్చని ఈఈ వై. ఏడుకొండలు తెలిపారు.


Share:

వైసీపీ మేనిఫెస్టో విడుదల

 వైసీపీ మేనిఫెస్టో విడుదల

వైసీపీ మేనిఫెస్టో విడుదల

YSRCP Manifesto 2024 : మేనిఫెస్టో(Manifesto) అంటే పవిత్రమైన గ్రంథమని అన్నారు వైసీపీ అధినేత జగన్(YS Jagan). 2019లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామని గుర్తు చేశారు. 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన.... మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో సమానంగా చూసి అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోకు కావాల్సిన గుర్తింపును ఇచ్చామని చెప్పారు. నవరత్నాల పాలనకు మేనిఫెస్టో అద్దంపట్టిందన్నారు. నవరత్నాల కింద 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను డీబీటీల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇది ఒక చరిత్ర అని జగన్ చెప్పుకొచ్చారు.

2019లో(YSRCP Manifesto 2019) ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఆంధ్రా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా...గడిచిన 58 నెలల కాలంలో అమలు చేశామని చెప్పారు. చేయగలిగివే చెప్పి చేసి చూపించామన్నారు. అవి అమలు చేసే ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తున్నామని ఉద్ఘింటించారు. సమస్యలకు పరిష్కారం చూపుతూ 58 నెలల వైసీపీ ప్రభుత్వ పాలన జరిగిందని చెప్పారు. కొవిడ్ లాంటి సమస్యలు వచ్చినా... సాకులు చూపలేదన్నారు.


YSRCP Manifesto -వైసీపీ మేనిఫెస్టో -2024 వివరాలు:

2024 ఎన్నికలకు సంబంధించి రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను(YSRCP Manifesto 2024) విడుదల చేసింది.

విద్య, వైద్యం,వ్యవసాయానికి ప్రాధ్యానత ఇస్తూ మేనిఫెస్టో రూపకల్పన

- మహిళలు, అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద గతంలో రూ. 75 వేలుగా ఉండేది. ఈసారి కూడా ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తామని జగన్ తెలిపారు.

వైఎస్ఆర్ కాపు నేస్తం కింద మరో నాలుగు ధపాల కింద డబ్బులు ఇస్తాం.

- వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద మూడు దఫాలు ఇచ్చాం. మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తాం.

జగనన్న అమ్మఒడి కింద రూ. 15 వేలు ఉండేది. ఈసారి రూ. 17 వేలకు పెంచుతామని ప్రకటన

సున్నా వడ్డీ కింద రుణాల మాఫీ స్కీమ్ కొనసాగుతుంది.

-వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ ముబారక్ స్కీమ్ ను కొనసాగిస్తామని జగన్ తెలిపారు.

వైఎస్సార్‌ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేల పెంపు, వైఎస్సార్‌ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంపు, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేల వరకు పెంచుతామని జగన్ ప్రకటించారు.

 పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ స్కీమ్ కొనసాగింపు ఉంటుంది.

లారీడ్రైవర్లకు కూడా వాహనమిత్ర - రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా.

వైఎస్ఆర్ లా నేస్తం కొనసాగింపు ఉంటుంది.

వైఎస్ఆర్ రైతు భరోసా రూ. 16వేలకు పెంపు.

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీని మరింత బలోపేతం చేస్తామని జగన్ ప్రకటన.

రాష్ట్రంలో తలపెట్టిన 12 కొత్త మెడికల్ కాలేజీలను వేగంగా పూర్తి చేస్తాం.

కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువస్తాం.

దళితుల జనాభా 500కి పైగా ఉంటే ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటన.

దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధులు.

అప్కో బకాయిలను ఈ దఫా కూడా కొనసాగిస్తాం.

కాపు సంక్షేమం కోసం వైసీపీ పాలనలో రూ. 34వేల కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో మరింత సంక్షేమం చేస్తాం.

ఔట్ సోర్సింగ్ కింద రూ. 25వేల వరకు జీతం పొందే ఉద్యోగులకు విద్య, వైద్యానికి సంబంధించిన నవరత్నాల స్కీమ్ లను వర్తింపజేస్తారు.

వైఎస్ఆర్ బీమా స్కీమ్ కింద ఆన్ లైన్ లో పుడ్ ఆర్డర్స్ ను సప్లయ్ చేసే వారికి వర్తింపజేస్తారు.

బోగాపురం పోర్టు పనులను మరింత వేగంగా పూర్తి చేస్తామని జగన్ ప్రకటన.

వచ్చే ఐదేళ్లలో సురక్షితమైన తాగు నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం.

వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే… విశాఖపట్నం నుంచి పాలన ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని జగన్ కీలక ప్రకటన చేశారు.

వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం.

Share:

చిలకలూరిపేట - అంతా పసుపు మాయం - తిరునాళ్లను తలపించిన ప్రత్తిపాటి నామినేషన్ రోడ్ షో - ప్రత్తిపాటి ఆస్తుల విలువ ఎంత అంటే ?

చిలకలూరిపేట - అంతా పసుపు మాయం - తిరునాళ్లను తలపించిన ప్రత్తిపాటి నామినేషన్ రోడ్ షో - ప్రత్తిపాటి ఆస్తుల విలువ ఎంత అంటే ?

చిలకలూరిపేట - అంతా పసుపు మాయం - తిరునాళ్లను తలపించిన ప్రత్తిపాటి నామినేషన్ రోడ్ షో - ప్రత్తిపాటి ఆస్తుల విలువ ఎంత అంటే ?


చిలకలూరిపేట :- ప్రత్తిపాటి నామినేషన్ కార్యక్రమం అత్యంత కోలాహాలంగా భారీ రోడ్ షో తో జన సమీకరణతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ పసుపుమయం అయిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ జన సమీకరణతో కార్యకర్తలు తిరునాళ్ళని తెలిపించే విధంగా ప్రత్తిపాటి పేరుని హోరెత్తించారు.

నిన్న జరిగిన భారీ రోడ్ షో ద్వారా అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం వలన చిలకలూరిపేటలో ప్రత్తిపాటి విజయం చాలా సులువుగా అవుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లోని ఎంపీటీసీ, జడ్పిటిసి,  గ్రామంలోని ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు భారీ ఎత్తున పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇదే ఉత్సాహం రెట్టింపు ఉత్సాహమై పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రత్తిపాటి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రోడ్ష అనంతరం ప్రత్తిపాటి తమనమినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.

ప్రత్తిపాటి నామినేషన్ అఫిడవిట్ లో సమర్పించిన ఆస్తుల వివరాలు

అభ్యర్థి: ప్రత్తిపాటి పుల్లారావు(TDP) 

భార్య: వెంకాయమ్మ

విద్యార్హతలు: బికాం

చరాస్తి విలువ: రూ.32.33కోట్లు

భార్య చరాస్తి విలువ: రూ.23.37కోట్లు

కేసులు : 13

అప్పులు: రూ.22.72కోట్లు

చేతిలో ఉన్న డబ్బులు: రూ. 1,55,011

బంగారం: 409.8గ్రాములు,

 భార్య కు 323.5గ్రాముల బంగారం.


మరిన్ని వార్తలు కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

Share:

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

పట్టణంలోని ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పర్వం మొదలైంది, నేడు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు నామినేషన్ దాఖలు చేయగా రేపు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భారీ ర్యాలీతో నామినేషన్ వేనున్నారు. అందులో భాగంగా నేడు ప్రత్తిపాటి స్వగృహంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో మంచి-చెడుల మధ్య యుద్ధంలో కూటమిదే విజయమన్నారు మాజీమంత్రి, కూటమి చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. మంగళవారం చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నేపథ్యంలో విజయం సాధించాలని సంకల్పిస్తూ పట్టణంలోని తన నివాసంలో సోమవారం సుదర్శన నరసింహస్వామి హోమం వైభవంగా నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ క్రతువులో ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి వెంకటకుమారి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు హోమాలు, వైదిక కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిపించారు. నారసింహ, సుదర్శన యంత్రాలతో హోమం నిర్వహించారు. హోమ ద్రవ్యాలను యజ్ఞ గుండాల్లో సమర్పించి పూర్ణాహుతి జరిపించారు. చిలకలూరిపేటతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు. పలువురు కుటుంబసభ్యులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి చెడు గెలిచిన సందర్భాలు చరిత్రలోనే కాదు పురాణేతిహాసాల్లో ఎక్కడ వెదికినా కనిపించవన్నారు. కూటమి తరపున ప్రజాబలానికి దైవ సంకల్పం కూడా తోడు కావాలనే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ప్రత్తిపాటి.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో - పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ చాటిన విద్యార్థులు వీరే

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో - పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ చాటిన విద్యార్థులు వీరే

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో

బొప్పూడి గ్రామంలోని శ్రీ పూసల సుబ్బయ్య గుంటూరు వెంకటప్పయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని పరీక్షకు హాజరైన 58 మంది విద్యార్థులలో 51 మంది ఉత్తీర్ణులై 88% సాధించారు దీనిలో షేక్ అప్పాపురం షబ్బీర్ 571 షేక్ ఆసిఫ్ 554 కొమ్మూరి వాసవి 553 మార్కులు సాధించి ప్రథమ ద్వితీయ స్థానాలు పొందారు ఈ సందర్భంగా తల్లిదండ్రుల కమిటీ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ హైస్కూల్లో చదివిన కార్తీక్ రెడ్డి 585 మార్కులతో మండలం టాపర్గా నిలిచాడు.

పట్టణంలోని పాఠశాలలో


ఈరోజు ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో  విజయభేరి మ్రోగించిన వికాస్ విద్యార్థులు ఏ శరణ్య, బాల సాయిరాం, అష్రఫ్.


ఈరోజు వెలువడిన 2023 -24 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వికాస్ విద్యార్థులు ఏ శరణ్య 600 కి 591 మార్కులు , బాల సాయిరాం 589,

Sk. Md. అశ్రాప్ 587

 స్కూల్ టాపర్లగా నిలిచారు.


 *ఈ పరీక్షకు మొత్తం 87 మంది విద్యార్థులు హాజరు కాగా 87 మంది  విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణత శాతం* సాధించి వికాస్ విజయ పతాకాన్ని ఎగురవేశారు. 


వీరిలో 590 కి పైగా మార్కులు సాధించిన వారు.....1

585 కి పైన...3 

580 కి పైన....7

 575 కి పైన.....14 

570 కి పైన...... 20 

550 కి పైన.......36 

500 కి పైన....... 61.


VIIT THE SCHOOL సుబ్బయ్య తోట, VIKAS SCHOOL

 పెదనందిపాడు రోడ్డు  క్యాంపస్లలో  విద్యార్థులు అద్భుతంగా ప్రతిభ కనబరిచారని విద్యాసంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ తెలియజేశారు.


 నిరంతర కృషి పట్టుదల ఉంటే ఇలాంటి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తూ  ఇంతటి చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, కష్టపడి పనిచేసినఉపాధ్యాయులను అదేవిధంగా *ప్రిన్సిపాల్స్ కల్పనా , ప్రమీల ను డైరెక్టర్లు దండా పవన్ కుమార్ , దండా రోజశ్రీ  అభినందించారు* మరియు విద్యార్థులకు మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.



నేడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో మోడరన్ విద్యాసంస్థల విద్యార్ధులు మరొక సారి వారి విజయ పరంపరని కొనసాగించారు. అత్యధికంగా నాయుడు వర్షిత 583 మార్కులు,షేక్ తస్నీమ్ 580 మార్కులు సాధించారు

మొత్తం పరీక్షకు హాజరైన 89 మంది విద్యార్ధులకు 27 మంది విద్యార్ధులకు 550కి పైగా, 50 మందికి పైగా 500 మార్కులను సాధించారు. 100శాతం ఉత్తీర్ణతతో 84 మంది ప్రధమ శ్రేణిలో 5గురు ద్వితీయశ్రేణి లో ఉత్తీర్ణత సాధించారు. 

గణితంలో నూటికి నూరు మార్కులు 10మంది, 90కి పైగా 50మంది. సైన్స్,సోషల్ లో 41మంది మార్కులు సాధించారు.ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్ధులను,ఉపాధ్యాయులను మోడరన్ విద్యాసంస్థల అధినేత చేబ్రోలు మహేష్ అభినందించారు.            

 కార్యక్రమంలో మోడరన్ విద్యాసంస్థల ఛైర్మన్  చేబ్రోలు మహేష్ ,గ్రీన్ వ్యాలీ కుమార్, ప్రిన్సిపాల్స్ సురేష్, ఫణికుమార్, హేమ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయిలు,విద్యార్ధినీ విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొని అందరినీ అభినందించారు.

కింది లింక్ ని ఫాలో అవ్వండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి