మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - ఆదివారం ప్రార్థనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురికి గాయాలు

చిలకలూరిపేట - ఆదివారం ప్రార్థనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురికి గాయాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై చిలకలూరిపేట పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీ బైపాస్ రోడ్డు ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన ఏడుగురు ఆదివారం పట్టణంలోని భావనారుషి నగర్ వద్ద ఉన్న ఒక ప్రార్థనమందిరానికి వెళ్ళి తిరిగి వెళ్లే ఈ క్రమంలో గుంటూరు వెళ్లే రోడ్డు వైపు నుంచి హెచ్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా రజక  కాలనీ వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. ఈ సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తున్న కారు వేగంగా ఆటోను ఢీ కొట్టింది... ఈ సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గొల్ల శేవీరియేలు 60 సంవత్సరాలు  తలకు తీవ్ర గాయమైంది. ఎం.అక్షయ (14)కు కుడికాలు యాంకిల్ లో ఓపెన్ ఫ్రాక్చర్ అయింది. బొందు ప్రసన్న (25) తలకు గాయమైంది, బంధు విజయ్ (29) లెఫ్ట్ షోల్డర్ కి దెబ్బ తగిలింది. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 అంబులెన్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నలుగురికి ప్రథమ చికిత్స చేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.





Share:

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్


చిలకలూరిపేట విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు ఈరోజు అనగా శనివారం ఉదయం అంబులెన్స్ ఆటో యాక్సిడెంట్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే - సాయంత్రం 9 గంటల సమయంలో పట్టణంలో సుభాని నగర్కు చెందిన ఖాజావలి అనే వ్యక్తి విజయ బ్యాంక్ సెంటర్ నుండి పండరీపురం వైపు వెళ్లే సమయంలో చెన్నై నుండి గుంటూరు వైపుకు వెళుతున్న కారు ఢీకొన్నది. ఈ సమయంలో ఖాజావలి గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సదరు కారు సంబంధించిన వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒకే రోజు విజయ బ్యాంక్ సెంటర్లో రెండు ఘటనలు జరగటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.



Share:

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను పొలంలో చంపిన ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గూడవల్లి కిరణ్ అనే వ్యక్తి అప్పాపురం గ్రామానికి చెందిన బుజ్జి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే గత 12 సంవత్సరాలుగా వీరు అప్పాపురం లోనే ఉంటూ వ్యవసాయం మీద జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి నుండో కిరణ్కు భార్య పైన వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానం ఉండేది. అనుమానం రోజురోజుకు పెరిగి శనివారం ఉదయం భార్యతో పాటు పొలానికి మందు చల్లడానికి వెళ్లారు. 11 గంటల సమయంలో కిరణ్ బంధువులకు ఫోన్చేసి ఉన్నట్టుండి తన భార్యకు ముక్కులో నుండి రక్తస్రావంతో పడిపోయిందని తెలిపాడు. అక్కడికి చేరుకున్న బంధువులు ఆమె తలపై ఉన్న గాయంతో పాటుగా మేడపైన ఉన్న గొర్ల గుర్తుల ఆధారంగా ఆమెను హత్య చేసి ఉంటారని భావించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిశీలించగా విచారణలో కిరణ్ తన భార్యను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేసుకున్నారు.





Share:

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని విలేకర్ల సమావేశంలో తెలిపారు. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆదివారం నుండి 4 గంటలు కరెంటు కోతలు ఉంటాయి అనే వార్త చెక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు ఈ వార్తపై స్పందిస్తూ కరెంటు కోతలు వాస్తవమే కానీ రోజుకి 4 గంటల కరెంటు కోత ఉంటుందని, అది కూడా ఆదివారం నుండి అమలులోకి వస్తుంది అనే వార్త అవాస్తవమని తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి వార్తలను నమ్మవద్దని వారు తెలిపారు. ప్రస్తుతానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏమీ ఉండదని. సీఎం జగన్ ప్రజలెవరూ ఇబ్బందులకు గురి అవకుండా చూడాలని చెప్పినట్లు వారు తెలిపారు. గ్రామాలలో సాయంత్రం 6 నుండి 10 వరకు పట్టణాలలో రాత్రి 9 నుండి 12 వరకు నగరాలలో రాత్రి 11 నుండి మూడు గంటల వరకు కరెంటు కోతలు ఉంటాయని అవాస్తవమైన వార్త చెక్కర్లు కొడుతుంది.దయచేసి ఎవరు నమ్మవద్దు అని వారు తెలిపారు.







Share:

చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్

 చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్

చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ ముందు ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోని అంబులెన్స్ ఢీకొన్నది. వివరాల్లోకి వెళ్తే కలకత్తా నుండి చెన్నై వెళ్తున్న అంబులెన్స్ విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోను ఢీ కొట్టినది. ఆ సమయంలో ఆటో ఉన్న డ్రైవర్ షేక్ ఇస్మాయిల్ కు గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఇస్మాయిల్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్తో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న సీఐ రాజేశ్వరరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.



Share:

చిలకలూరిపేట:- పండక్కి పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం - స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ

చిలకలూరిపేట:- పండక్కి పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం - స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని శారదా హైస్కూల్ సమీపంలో పండగ సందర్భంగా పిండివంటలు చేస్తున్న ఒక ఇంట్లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే శారదా హైస్కూల్ సమీపంలోని కావమ్మ గుడి బజార్లోని నాయుడు భవాని అనే మహిళ పండుగ సందర్భంగా పిండి వంటలు చేస్తున్నారు. ఇంతలో గ్యాస్ సిలిండర్ పైపు లీక్ అవడంతో గ్యాస్ బయటికి వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంతలో సదరు మహిళ ప్రమాదాన్ని గమనించి ఇంట్లో నుంచి స్వల్ప గాయాలతో బయట పడ్డారు. స్థానికుల సహాయంతో మంటలు అదుపు చేసి అగ్నిప్రమాద సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నా అగ్నిమాపక సిబ్బంది వివరాలను నమోదు చేసుకున్నారు. మహిళకు స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆ ఈ ప్రాంతంలోని ప్రజలు ఊపిరి తీసుకున్నారు.



Share:

చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధం

 చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని అడ్ రోడ్డు సెంటర్ సమీపంలో ఎలక్ట్రికల్ వెహికల్ పూర్తిగా దగ్ధం అయినది. వివరాల్లోకి వెళితే అడ్ రోడ్డు సెంటర్ సమీపంలోని ఒక ఎలక్ట్రికల్ టూ వీలర్ షో రూమ్ నందు వెహికల్ కొనుగోలుకు వచ్చిన వ్యక్తి దానిని టెస్ట్ డ్రైవ్ చేయడానికి రోడ్డుపైకి తీసుకొని వచ్చారు. అయితే సదరు వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా వెహికల్ సీటు వేడిగా ఉండటంతో ఆ వ్యక్తి వెహికల్కు స్టాండ్ వేసి పక్కకు వచ్చారు. ఇదే సమయంలో వెహికల్లో నుంచి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దగ్ధమైన ఎలక్ట్రికల్ వెహికల్ విలువ సుమారు 60 వేల రూపాయలు వరకు ఉండవచ్చు అని అంచనా.





Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి