చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త
|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త
చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను పొలంలో చంపిన ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గూడవల్లి కిరణ్ అనే వ్యక్తి అప్పాపురం గ్రామానికి చెందిన బుజ్జి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే గత 12 సంవత్సరాలుగా వీరు అప్పాపురం లోనే ఉంటూ వ్యవసాయం మీద జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి నుండో కిరణ్కు భార్య పైన వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానం ఉండేది. అనుమానం రోజురోజుకు పెరిగి శనివారం ఉదయం భార్యతో పాటు పొలానికి మందు చల్లడానికి వెళ్లారు. 11 గంటల సమయంలో కిరణ్ బంధువులకు ఫోన్చేసి ఉన్నట్టుండి తన భార్యకు ముక్కులో నుండి రక్తస్రావంతో పడిపోయిందని తెలిపాడు. అక్కడికి చేరుకున్న బంధువులు ఆమె తలపై ఉన్న గాయంతో పాటుగా మేడపైన ఉన్న గొర్ల గుర్తుల ఆధారంగా ఆమెను హత్య చేసి ఉంటారని భావించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిశీలించగా విచారణలో కిరణ్ తన భార్యను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేసుకున్నారు.





No comments:
Post a Comment