మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు

చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్  బంద్ - రోడ్ల పైకి రాని RTC  బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు 


https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణములో  టీడీపీ,వైస్సార్సీపీ,సిపిఐ,సిపిఎం, కాంగ్రెస్ మద్దతుతో ఈరోజు బంద్ జరుగుతుంది. బంద్ సందర్భంగా పట్టణంలోని కాలేజీలు,స్కూలు మూతపడ్డాయి.  ఉదయం నుండే  APSRTC బస్సులు నిలిపివెయ్యబడ్డాయి. అలాగే వ్యాపారులు బంద్ కి సహకరిస్తూ షాప్స్ మూసివేశారు. అయితే పొద్దున చలివేంద్రం బజార్,మెయిన్ రోడ్  లో కొంచం హడావిడి కనిపించినా తర్వాత దుకాణాలు అన్ని మూసివేసి వారీ మద్దతు తెలియచేసారు. పట్టణంలో అఖిలపక్షం, కార్మికసంఘాలు,ప్రజాసంఘాలు  భారీ ర్యాలీ తో పురవీధులలో తిరిగి కొత్తగా ఎర్పాటుచేసిన రైతు చట్టాలను , పెరుగుతున్న  పెట్రోల్ & డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ  ప్రదర్శనలూ చేస్తూ దుకాణాలను,బ్యాంకులను స్వచ్చంధంగా మూసివేసి బంద్ కి సహకరించాలి అని కోరారు. 



https://chilakaluripetspeednews.blogspot.com/












Share:

చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???

చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది  !!! ???


https://chilakaluripetspeednews.blogspot.com/


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరపాలక, పురపాలక సంస్థల చట్టాలను సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్సుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్సు ప్రకారం నగరపాలక సంస్థలకు రెండవ డిప్యూటీ మేయర్, పురపాలక సంస్థలకు రెండవ వైస్  ఛైర్మెన్ నియమితులు కానున్నారు. 
 అయితే చిలకలూరిపేట కు రెండవ వైస్ ఛైర్మెన్ గా ఎవరిని ఎన్నుకోవాలి  అనే ఆలోచనలో ఉన్నారు పాలకవర్గం . రిజర్వేషన్ ఖరారు అయితే ఎవరికీ దక్కుతుందో చెప్పలేము. మొన్న జరిగిన ఎన్నికలలో అత్యధికంగా మహిళా కౌన్సిలర్లు  గెలిచారు . అయితే ఈసారికి రెండవ వైస్ ఛైర్మెన్ పదవి మహిళలకి దక్కవచ్చు. 






Share:

26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది

26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది :--


https://chilakaluripetspeednews.blogspot.com/

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ  మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలిపు మేరకు 26-03-2021 న జరిగే భారత్ బంద్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షడు అయిన శ్రీ కొనకళ్ల విద్యాధరావు లేఖ విడుదల చేసారు. కనుక దుకాణాలు&వ్యాపార సంస్థలు మూసివేసి భారత్ బంద్ కి సహకరించవల్సినదిగా కోరుతున్నారు.  ఇప్పటికే టీడీపీ , వైస్సార్సీపీ,కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. 








Share:

దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

 దేశంలో రెండవరోజు కూడా  స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు :--


https://chilakaluripetspeednews.blogspot.com/

దేశంలో వరుసగా రెండవ రోజు తగ్గిన పెట్రోల్, డిజిల్ ధరలు. ఈ రోజు పెట్రోల్ పైన 21పైసలు , డిజిల్ పైన 20 పైసలు తగ్గినది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం అక్కడ అక్కడ  లాక్ డౌన్  , బ్రెజిల్ లో కరోనా బీభత్సము, ప్రపంచంలో కరోనా, స్ట్రైన్, తాకిడి వలన వాహనం వినియోగం తగ్గటం  మరియు  దేశంలో 5 రాష్ట్రాలలో  ఎలక్షన్ వంటి ప్రభావాలు పెట్రోల్ రెట్లపైన పడ్డాయి అనే చెప్పొచ్చు. గత 4 వారాల నుండి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. 







Share:

చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య

చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పసుమర్రులో సూర్యనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెం కి చెందిన సూర్యనారాయణ (61) అనే వ్యక్తి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం పైన పసుమర్రు వెళ్ళాడు. పసుమర్రు శివారుల్లో  రహదారి పక్కనే ఉన్న  సిమెంట్ బల్లపై గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ గా తెలుస్తుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వారు ప్రాధమిక నివేదికలో తేలిచ్చారు. మృతుడు కొంతకాలంగా చిలకలూరిపేట లో నివాసం ఉంటున్నాడు. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 




 

Share:

చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు

 చిలకలూరిపేట మోడరన్ డిగ్రీ కళాశాల నందు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన రురల్ పోలీసువారు :--

https://chilakaluripetspeednews.blogspot.com/
 
నేటి యువత మత్తుకి బానిస అవకుండా ఉండటం కోసం పట్టణంలోని ప్రముఖ మోడరన్ డిగ్రీ కళాశాల నందు రురల్ CI  సుబ్బారావు గారి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రురల్ SI రాంబాబు గారు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సుభాని గారు, కళాశాల ఉపాధ్యాయులు, పెద్ద ఎత్తున విధ్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలూ కావద్దు అని , వాటివల్ల కలిగే దుష్పరిణామాలు తెలియచేసారు. అయితే నిన్న పట్టుబడ్డ గంజాయి అమ్మే వ్యక్తి నుండి రాబట్టిన సమాచారం మేరకు విద్యార్థులు ఈ మత్తు పధార్ధాలకి దూరంగా ఉంచటం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించటం పట్ల CHILAKALURIPET SPEED NEWS తరుపున పోలీస్ వారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 





Share:

చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు

చిలకలూరిపేటలో నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు  

https://chilakaluripetspeednews.blogspot.com/


గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం చిలకలూరిపేటలో నూతనముగా ఎన్నుకోబడిన మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ పదవుల అనంతరం బుధవారం ఉదయం ఆయా సేఖలలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఛైర్మెన్ గా షేక్ రఫాని గారు మరియు వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు గారు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యకరంలో MLA  రజని గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బోలేదు చిన్నగారు , పట్టణ వైస్సార్సీపీ బూత్ కన్వీనర్ విడదల గోపిగారు, ముస్లిం నాయకులూ, మతపెద్దలు, వైస్సార్సీపీ నాయకులూ పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. 




Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి