చిలకలూరిపేట బ్రేకింగ్: రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి పంపిన ప్రత్తిపాటి.
చిలకలూరిపేట/ఎడ్లపాడు: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో తనకెవరూ సాటిలేరని చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మరోసారి నిరూపించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సకాలంలో వైద్యం అందేలా చేసి ప్రాణదాతగా నిలిచారు.
ప్రమాదం జరిగిందిలా..
ఎడ్లపాడు మండలం చంగిస్ ఖాన్ పేట గ్రామ మాజీ అధ్యక్షులు ఆంజనేయులు తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చెంగిస్ ఖాన్ పేట - సంక్రాంతిపాడు గ్రామాల మధ్య బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బైక్ నడుపుతున్న ఆంజనేయులు తల బలంగా రోడ్డు మార్జిన్‌కు తగలడంతో కంటిపై తీవ్ర గాయమైంది. రక్తస్రావం ఎక్కువగా జరగడంతో ఆయన అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి (కోమాలోకి) వెళ్లిపోయారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి..
సరిగ్గా అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు రోడ్డు పక్కన పడి ఉన్న క్షతగాత్రులను గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి కిందకు దిగి వారి వద్దకు చేరుకున్నారు. గాయపడిన వ్యక్తి చంగిస్ ఖాన్ పేట మాజీ అధ్యక్షులు ఆంజనేయులుగా గుర్తించిన ఆయన.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సొంత వాహనంలోనే మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరులోని శంకర కంటి ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.
"నేనున్నాను".. అంటూ కుటుంబ సభ్యులకు భరోసా:
కేవలం ఆసుపత్రికి పంపించి ఊరుకోకుండా.. స్వయంగా ఆసుపత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి ఆంజనేయులు గారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, త్వరితగతిన మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం ఆంజనేయులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. "నేనున్నాను.. అధైర్యపడొద్దు" అంటూ వారికి కొండంత అండగా నిలిచారు.
నాయకుడు అంటే కష్టకాలంలో ఆదుకునేవాడే అని ప్రత్తిపాటి పుల్లారావు గారు చేసిన ఈ సాయం పట్ల నియోజకవర్గ ప్రజలు, చంగిస్ ఖాన్ పేట గ్రామస్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
వీడియో కోసం క్రింది లింక్ క్లిక్ చెయ్యండి
https://www.instagram.com/reel/DWYRrDRiVrC/?igsh=MnByZjZjMWw5aXY=
- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ⚡
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.




