మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Showing posts with label gst. Show all posts
Showing posts with label gst. Show all posts

నకిలీ GST పేరుతో టోకరా.. చిలకలూరిపేట సుబ్బయ్యతోట వాసి బ్యాంక్ ఖాతా సీజ్!

నకిలీ GST పేరుతో టోకరా.. చిలకలూరిపేట సుబ్బయ్యతోట వాసి బ్యాంక్ ఖాతా సీజ్!

​** బాధితుడికి అండగా నిలిచిన వినియోగదారుల సంఘం**
** వినియోగదారుల కోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధం**
​చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్):
చేయని తప్పుకు, సంబంధం లేని వ్యాపారానికి పన్ను కట్టలేదంటూ ఓ సామాన్యుడి బ్యాంక్ ఖాతాను అధికారులు స్తంభింపజేశారు. తన ఆధార్ నంబర్ దుర్వినియోగం చేసి వేరే రాష్ట్రంలో ఎవరో చేసిన మోసానికి చిలకలూరిపేట వాసి బలయ్యారు. ఈ ఘటనపై న్యాయం కోరుతూ బాధితుడు పల్నాడు జిల్లా వినియోగదారుల సంఘాన్ని ఆశ్రయించారు.
​ఘటన వివరాలు:
చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో కిరాణా షాపు నిర్వహించే శిఖాకొల్లి శ్రీనివాసరావు, తన భార్య రజనీకుమారి పేరుమీద ఉన్న ఆస్తిని ఇటీవల విక్రయించారు. ఆ డబ్బును కొనుగోలుదారులు ఆమె యాక్సిస్ బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్ (RTGS) ద్వారా జమ చేశారు. అయితే ఆ నగదును డ్రా చేసేందుకు వెళ్లగా, ఖాతా సీజ్ (Freeze) అయినట్లు బ్యాంకు మేనేజర్ తెలిపారు.
​ఖమ్మంలో నకిలీ వ్యాపారం - రూ. 18 లక్షల బకాయి:
ఖాతా ఎందుకు నిలిపివేశారని ఆరా తీయగా.. తెలంగాణలోని ఖమ్మంలో వీరి పేరుతో ఓ వ్యాపార సంస్థ ఉందని, దానికి సంబంధించి రూ. 18 లక్షల GST బకాయి ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకే ఖాతా సీజ్ చేశామన్నారు. దీంతో ఖమ్మం వెళ్లి అక్కడి అధికారులను నిలదీయగా.. ఆధార్ అథెంటికేషన్ ద్వారా లైసెన్స్ తీసుకున్నారని, పన్ను కట్టనందుకే చర్యలు తీసుకున్నామని సమాధానమిచ్చారు.
​వినియోగదారుల సంఘం భరోసా:
తాము ఎటువంటి వ్యాపారం చేయకపోయినా తమ ఆధార్‌ను ఎవరో దుర్వినియోగం చేశారని బాధితుడు వాపోతున్నారు. దీనిపై ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా, ఘటన ఖమ్మంలో జరిగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని సూచించారు.
​ఈ క్రమంలో సోమవారం బాధితుడు శ్రీనివాసరావు.. పల్నాడు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన మురికిపూడి ప్రసాద్, వినియోగదారుల కోర్టులో కేసు నమోదు చేసేందుకు తమ స్వచ్ఛంద సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.


అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి