|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Showing posts with label JAGAN. Show all posts
Showing posts with label JAGAN. Show all posts
భూమండలం మీద ఇంత పెద్ద 'క్రెడిట్ దొంగ' ఎవరూ ఉండరు - ఎన్నికల సమయంలో IVRS కాల్స్ చేయించి, భూములు పోతాయని రైతులను భయపెటించారు - జగన్ ఫైర్! Live
CHILAKALURI PET SPEED NEWSThursday, January 22, 2026CHNADRANABU, JAGAN, YSRCP, చంద్రబాబు, జగన్, జగన్ ప్రెస్ మీట్, వైస్సార్సీపీ
No comments
భూమండలం మీద ఇంత పెద్ద 'క్రెడిట్ దొంగ' ఎవరూ ఉండరు - ఎన్నికల సమయంలో IVRS కాల్స్ చేయించి, భూములు పోతాయని రైతులను భయపెటించారు - జగన్ ఫైర్! లైవ్
చిలకలూరిపేట స్పీడ్ న్యూస్:
తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూమండలం మీద ఇంత దారుణంగా క్రెడిట్ దొంగిలించే వారు మరొకరు ఉండరని ఆయన మండిపడ్డారు. ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో జగన్ ప్రస్తావించిన ముఖ్యాంశాలు:
👉 బాబుకు ఆ ఆలోచన వచ్చిందా?:
నాలుగు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా రైతుల కోసం భూములు రీ-సర్వే చేయాలన్న ఆలోచన వచ్చిందా అని జగన్ ప్రశ్నించారు. 2019 పాదయాత్రలో రైతుల కష్టాలను చూసి, ఈ సర్వేను ఒక మహాయజ్ఞంలా చేపట్టామని తెలిపారు.
👉 వందేళ్ల తర్వాత రికార్డు:
బ్రిటిషర్ల కాలం తర్వాత, వందేళ్లకు మళ్లీ భూముల రీ-సర్వే చేసింది వైసీపీ ప్రభుత్వమేనని జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశామని, యూరప్, అమెరికాలో వాడే అత్యాధునిక టెక్నాలజీ (డ్రోన్లు, GNSS రోవర్లు) ఉపయోగించి 5 సెం.మీ తేడా కూడా లేకుండా పక్కాగా కొలతలు వేశామని వెల్లడించారు.
👉 కేంద్రం ప్రశంసలు - ప్లాటినం గ్రేడ్:
తాము చేపట్టిన సర్వే విధానాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఏపీకి 'ప్లాటినం గ్రేడ్' ఇచ్చిందని, నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు. కేరళ, అసోం, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఏపీకి వచ్చి ఈ విధానాన్ని అధ్యయనం చేశాయని తెలిపారు.
👉 రంగులు మార్చడం తప్ప చేసిందేమీ లేదు:
"మేం ఇచ్చిన పాస్ బుక్ లోని క్యూఆర్ కోడ్, యూనిక్ నెంబర్, డేటా అంతా అలాగే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఆ పుస్తకాలకు పసుపు రంగులు వేసుకుంటోంది. కోట్లు ఖర్చు చేసి సర్వే రాళ్లపై మా పేర్లు చెరిపేస్తున్నారు తప్ప, కొత్తగా ఒక్క అడుగు కూడా వేయలేదు" అని జగన్ ఎద్దేవా చేశారు
రెడ్ బుక్ పేరుతో ఊళ్ళు విడిచిపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు.. ఇల్లు, వాకిలి వదిలేసి పోయే పరిస్థితి కలిగిస్తున్నారు. విపక్ష నేత హోదా ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏంటి ఇబ్బంది? విపక్ష నేత హోదా ఇస్తే.. సభలో సమయం ఇవ్వాల్సివస్తుందని భయం. విపక్ష నేతగా నేను ప్రభుత్వాన్ని ఎండగడతానని వారి ఆందోళన: వైఎస్ జగన్
👉 గ్రామ సచివాలయ వ్యవస్థే కీలకం:
కేవలం ఒక్క నోటిఫికేషన్ తోనే 1.34 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, 15 వేల గ్రామ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను ప్రజల ముంగిటకే తెచ్చామని జగన్ పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో IVRS కాల్స్ చేయించి, భూములు పోతాయని రైతులను భయపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అదే సర్వేను తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని జగన్ విమర్శించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఫాలో అవ్వండి - చిలకలూరిపేట స్పీడ్ న్యూస్
☀️ కరెంట్ బిల్లుల మోతకు చెక్! "పీఎం సూర్య ఘర్" పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు బిల్లును 'జీరో' చేసుకోండి.
💰 కేంద్ర ప్రభుత్వం అందించే ₹78,000/- భారీ సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి; మిగిలిన కరెంట్ అమ్మి ఆదాయం కూడా పొందండి!
🏡 నాణ్యమైన సోలార్ సిస్టమ్స్ కోసం మన చిలకలూరిపేటలోని *"ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్"* వారిని నేడే సంప్రదించండి.
📞 మరిన్ని వివరాలకు కాల్ చేయండి: +91 8074300423
చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి




