మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Showing posts with label Chilakaluripet dogs. Show all posts
Showing posts with label Chilakaluripet dogs. Show all posts

చిలకలూరిపేటలో వీధి కుక్కల మారణహోమం.. యువకుడి ముఖాన్ని పీక్కుతిన్న వైనం!

చిలకలూరిపేటలో వీధి కుక్కల మారణహోమం.. యువకుడి ముఖాన్ని పీక్కుతిన్న వైనం!


​చిలకలూరిపేట పట్టణ ప్రజలు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకపక్క స్మార్ట్ సిటీ తరహాలో అభివృద్ధి అంటున్న మున్సిపల్ అధికారులు... కనీసం వీధి కుక్కల బారి నుండి ప్రజల ప్రాణాలను మాత్రం కాపాడలేకపోతున్నారు. తాజాగా మంగళవారం సుగాలి కాలనీలో ఒక వీధి కుక్క చేసిన బీభత్సం పట్టణ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

నెత్తురోడిన యువకుడు.. సుగాలి కాలనీలో ఉలిక్కిపడ్డ జనం:

సుగాలి కాలనీకి చెందిన ప్రవీణ్ అనే యువకుడు మంగళవారం ఉదయం తన ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏమరుపాటుగా ఉన్న ఆ యువకుడిపై ఎటునుండి వచ్చిందో కానీ ఓ వీధి కుక్క మృగంలా విరుచుకుపడింది. నేరుగా ప్రవీణ్ ముఖంపైకి దూకి, పళ్లు నూరింది. కుక్క విచక్షణారహితంగా దాడి చేయడంతో ప్రవీణ్ ముఖం, పెదవులు దారుణంగా తెగిపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ యువకుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు, ప్రాణాలకు తెగించి పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కను తరిమికొట్టారు. స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రవీణ్ ప్రాణాలు గాలిలో కలిసేవే అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నెత్తుటి మడుగులో ఉన్న ప్రవీణ్‌ను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు నరకయాతన అనుభవిస్తున్నాడు.


అధికారుల మొద్దునిద్ర.. నిలదీసినా మారని తీరు:

వీధి కుక్కల బెడదపై ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతలు ముక్తకంఠంతో అధికారులను నిలదీశారు. ముఖ్యంగా కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి తదితరులు 'జనాల ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నారు?' అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభలో 'వెంటనే డాగ్ క్యాచ్ స్క్వాడ్‌ను రప్పిస్తాం, కుక్కలను కట్టడి చేస్తాం' అని మభ్యపెట్టిన అధికారులు... ఆచరణలో మాత్రం గురకపెట్టి నిద్రపోతున్నారని తాజా ఘటనే నిరూపిస్తోంది. ఏసీ గదుల్లో కూర్చునే అధికారులకు, రోడ్ల మీద కుక్కల బారిన పడి రక్తం చిందిస్తున్న సామాన్యుడి బాధ ఎలా తెలుస్తుందని పట్టణ వాసులు మండిపడుతున్నారు.

భయం గుప్పిట్లో పౌరులు:

"చిన్నపిల్లలను స్కూల్‌కు పంపాలన్నా, వృద్ధులు మందుల కోసం మెడికల్ షాపుకు వెళ్లాలన్నా ఒణికిపోతున్నాం. పది పదిహేను కుక్కలు గుంపులుగా చేరి కాలనీల మీద పడుతున్నాయి. చేతిలో కర్ర లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నాం. ఇంకెంత మంది రక్తం చిందిస్తే మున్సిపల్ యంత్రాంగం కదులుతుంది?" అని సుగాలి కాలనీ వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు.

స్పీడ్ న్యూస్ డిమాండ్:

ఇప్పటికైనా చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ గారు, ఉన్నతాధికారులు స్పందించాలి. తక్షణమే నగరంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి వీధి కుక్కలను పట్టుకోవాలి. యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) ఆపరేషన్లు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహ జ్వాలలు మున్సిపల్ ఆఫీసును తాకకమానవు!

- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్


చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి