చిలకలూరిపేటలో క్రిమినల్ కేసు! - ఏబీఎన్ ఆర్కేకు బిగ్ షాక్ - ఆర్కేపై భగ్గుమన్న చిలకలూరిపేట వైసీపీ కేడర్ !
మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం.. మాజీ మంత్రి విడదల రజిని ఆదేశాలతో కదిలిన క్యాడర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలను, మహిళలను ఉద్దేశించి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన అత్యంత జుగుప్సాకరమైన, అమర్యాదకర వ్యాఖ్యలపై చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. జర్నలిజం ముసుగులో నాయకుల కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని ప్రసారం చేసిన కథనాలు, రాసిన రాతలను స్థానిక నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఖండించారు.
పాత్రికేయ విలువలకు పాతర:
ఒక ప్రధాన మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ, సామాజిక నైతికతకు, పాత్రికేయ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయమని నాయకులు విమర్శించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మహిళలను పావులుగా వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. పచ్చ మీడియా పైశాచిక ఆనందం కోసం మహిళల గౌరవాన్ని తుంగలో తొక్కడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. రాధాకృష్ణ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బేషరతుగా యావత్ మహిళా లోకానికి, ప్రజాస్వామ్యానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చర్యలు తీసుకోకుంటే సహించేది లేదు:
మహిళల గౌరవాన్ని కాపాడటం సమాజంలోని ప్రతి పౌరుడి నైతిక బాధ్యత అని, ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి రాతలు రాయాలన్నా, కూతలు కూయాలన్నా భయపడేలా చట్టపరమైన శిక్షలు ఉండాలని సంబంధిత అధికారులను కోరారు.
పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు:
ఈ నేపథ్యంలో, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారి స్పష్టమైన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు భారీగా కదిలాయి. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు, వారి గౌరవానికి భంగం కలిగించినందుకు ఆయనపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి, కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను గట్టిగా డిమాండ్ చేశారు. పచ్చపత్రికల రాతలకు భయపడే ప్రసక్తే లేదని, న్యాయపోరాటం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు తేల్చి చెప్పారు.
— చిలకలూరిపేట స్పీడ్ న్యూస్
ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.





No comments:
Post a Comment