🚨 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ 🚨
💥 సుబ్బయ్యతోటలో "సెల్ టవర్" రగడ.. రేడియేషన్ పై భగ్గుమంటున్న ప్రజలు!.. ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు! - గుడిపల్లి మధు సతీష్ 💥
చిలకలూరిపేట (పల్నాడు జిల్లా): అభివృద్ధి పేరుతో ప్రజల ప్రాణాలను పణంగా పెడితే ఊరుకునేది లేదని చిలకలూరిపేట వాసులు ముక్తకంఠంతో గర్జిస్తున్నారు. పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన సుబ్బయ్యతోట, గౌడపాలెం వాసులు ప్రస్తుతం ఓ భయంకరమైన సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి తమ ఇళ్ల మధ్య ఓ ప్రైవేట్ భవనంపై ఏర్పాటు చేస్తున్న 'ఎయిర్‌టెల్' భారీ సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని స్థానికులు కదం తొక్కారు.
⚠️ పిల్లల భవిష్యత్‌తో ఆటలా.. రేడియేషన్ తో ముప్పే! 🏫 టవర్ నిర్మిస్తున్న ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ప్రముఖ 'RVSCVS' హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలు, పలు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ భారీ టవర్ నుండి వెలువడే ప్రమాదకర విద్యుదయస్కాంత వికిరణం (Electromagnetic Radiation) వల్ల లేత వయసులో ఉన్న వందలాది విద్యార్థుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. చదువుకోవాల్సిన పిల్లల మెదళ్లపై రేడియేషన్ ప్రతాపం చూపితే బాధ్యత ఎవరిది? అని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
🏥 వృద్ధులు, రోగుల ప్రాణాలకు గ్యారెంటీ ఏది? 🫀 ఇది అత్యంత జనసాంద్రత కలిగిన నివాస మరియు కమర్షియల్ ప్రాంతం. ఇక్కడ డయాలసిస్ పేషెంట్లు, గుండె, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, పసిపిల్లలు నివసిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా టవర్ జనరేటర్ల మోత, 24 గంటల రేడియేషన్ వల్ల వీరు మరింత అనారోగ్యం పాలయ్యే పరిస్థితి దాపురించింది. సురక్షితంగా ఉండాల్సిన ఇల్లే.. రేడియేషన్ వలయంగా మారితే సామాన్యులు ఎక్కడికి వెళ్లాలి?
🌪️ గాలివాన వస్తే గాల్లో కలిసిపోవాల్సిందేనా? 🏢 ఇళ్లు పక్కపక్కనే అగ్గిపెట్టెల్లా ఉండే ఈ డెవలప్డ్ ఏరియాలో భవనంపై అంత భారీ టవర్ నిర్మించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. రేపు ఏదైనా తుఫాను లేదా ఈదురు గాలులు వస్తే.. ఆ టవర్ ఏమాత్రం పట్టుతప్పి కుప్పకూలినా జరిగే ప్రాణ, ఆస్తి నష్టాలకు ఎవరు బదులు చెబుతారు? అని స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు.
✊ ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు - కౌన్సిలర్ మధు సతీష్ ఫైర్! 🛑 స్థానికులు ఇంతలా ఆందోళన చేస్తున్నా.. కాంట్రాక్టర్లు యథావిధిగా పనులు కొనసాగిస్తుండటంపై 24వ వార్డు కౌన్సిలర్ గుడిపల్లి మధు సతీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. "ప్రజలకు ఆటంకం కలిగించే ఏ చర్యను ఉపేక్షించేది లేదు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా జరుగుతున్న ఈ టవర్ నిర్మాణాన్ని తక్షణమే ఆపాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని ఘాటుగా హెచ్చరించారు.
📝 అధికారులకు వినతి.. స్పందించకుంటే మహా ఆందోళన! 🔥 ఈ అక్రమ నిర్మాణంపై ఇప్పటికే పల్నాడు జిల్లా కలెక్టర్, చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ (MRO) గార్లకు సుబ్బయ్యతోట, గౌడపాలెం ప్రజలు వినతిపత్రం అందజేశారు. అధికారులు వెంటనే స్పందించి అనుమతులు రద్దు చేసి టవర్ నిర్మాణాన్ని అడ్డుకోకపోతే.. రాబోయే రోజుల్లో ప్రజలంతా ఏకమై రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
నివేదన: చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ టీమ్ 🎤 📸
#Chilakaluripet #SpeedNews #SubbayyaThota #CellTowerIssue #PublicSafety #PalnaduDistrict





No comments:
Post a Comment