మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

🚨 చిలకలూరిపేటలో 'పటాసుల' దందా.. అధికారుల కనుసన్నల్లోనే కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగవేత! 🚨చిలకలూరిపేటలో టపాసుల ముసుగులో యథేచ్ఛగా పన్నుల ఎగవేత.. చోద్యం చూస్తున్న యంత్రాంగం!... పూర్తి వివరాల కోసం క్రింది లింకు పైకి ఇచ్చేయండి..

🚨 చిలకలూరిపేటలో 'పటాసుల' దందా.. అధికారుల కనుసన్నల్లోనే కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగవేత! 🚨


దీపావళి అంటేనే వెలుగులు.. కానీ ఆ వెలుగుల వెనుక మన చిలకలూరిపేటలో కోట్లాది రూపాయల చీకటి దందా నడుస్తోంది. నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసి, అధికారుల కళ్లుగప్పి కొందరు వ్యాపారులు రెచ్చిపోతున్నారు. నాలుగు, ఐదు జిల్లాలకు దీపావళి టపాసులకు కేరాఫ్ అడ్రస్ మన చిలకలూరిపేటే. కానీ, ఇక్కడ జరిగే టాక్స్ ఎగవేత వ్యాపారం రాష్ట్రంలో మరెక్కడా జరగదు అంటే అతిశయోక్తి కాదు. "చిలకలూరిపేట స్పీడ్ న్యూస్" ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ మీకోసం.. ⚡

📝 'వైట్ పేపర్' మీదే కోట్ల వ్యాపారం.. జీఎస్టీకి భారీ గండి! 💸 నాలుగు వేల రూపాయల సరుకు కొన్నా.. 40 లక్షలు కొన్నా కస్టమర్ల చేతిలో పెట్టే బిల్లు మాత్రం ఓ సాదాసీదా వైట్ పేపరే! పక్కాగా జీఎస్టీ కట్టి వ్యాపారం చేయాల్సిన చోట, నిస్సిగ్గుగా పన్నుల ఎగవేత ఏరులై పారుతోంది. కోట్లల్లో బిజినెస్ జరుగుతున్నా, ప్రభుత్వ ఖజానాకు మాత్రం భారీగా గండి కొడుతున్నారు. వైట్ పేపర్ బిళ్లలతో సాగిపోతున్న ఈ కోట్లాది రూపాయల లావాదేవీలను అడిగే నాథుడే కరువయ్యాడు.

🏷️ సొంత ఎమ్మార్పీలు.. సామాన్యుల జేబులకు చిల్లులు! ✂️ అసలు మాయాజాలం ఇక్కడే ఉంది! తయారీదారులు ఒక రేటు వేస్తే, వీరు బాక్సులపై సొంతంగా ఎమ్మార్పీ స్టిక్కర్లు వేయించేసుకుంటారు. రకరకాల కొత్త బ్రాండ్ పేర్లు చెబుతూ, రేట్లు ఇష్టానుసారంగా మార్చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారు. ఊరు చివర ఉన్న హోల్ సేల్ షాపులు కదా, ఇక్కడ రేట్లు తక్కువగా ఉంటాయని ఎంతో దూరం నుంచి నమ్మి వచ్చే సామాన్యుల జేబులను నిలువునా దోచుకుంటున్నారు. 'డిస్కౌంట్' అనే భ్రమ కల్పించి అందినకాడికి దండుకుంటున్నారు. 😡

🚒 ప్రాణాలు గాలికి.. సేఫ్టీ రూల్స్ బుట్టదాఖలు! 🛑 కేవలం మూడు నెలల క్రితమే ఇక్కడ జరిగిన ఓ ఫైర్ యాక్సిడెంట్‌లో ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. అయినా వ్యాపారుల్లో గానీ, అధికారుల్లో గానీ ఎలాంటి మార్పూ రాలేదు. నివాస ప్రాంతాలకు, కొనుగోలుదారులకు పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. ప్రాణాలు పోయినా సరే లాభాలే ముఖ్యమన్నట్లుగా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయి.

💰 అధికారులకు మామూళ్ల మత్తు.. ఇన్స్పెక్షన్ల పేరుతో నాటకాలు! 🙈 ఇంత బహిరంగంగా మోసం జరుగుతున్నా అధికారులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనేదే అసలు ప్రశ్న. పండుగకు నెల రోజుల ముందు నుంచే ఈ దందా మొదలవుతుంది. కానీ అధికారులు మాత్రం ఫార్మాలిటీగా రావడం, పైపైన చెక్ చేసి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఇన్స్పెక్షన్‌కి వచ్చే ఏ స్థాయి అధికారినైనా సరే.. 'నోట్ల కట్టలతో' చల్లబరచడం ఈ షాపుల ఓనర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరికి వెళ్లాల్సిన మామూళ్లు వారికి పక్కాగా అందుతుండటంతోనే.. అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 💵

📢 ఇంకెన్నాళ్లీ మౌనం.. ఉన్నతాధికారులు స్పందించేనా? 🔍 ఒకప్పుడు చిలకలూరిపేటలో చిన్న చితకా షాపులు పెట్టుకోవాలంటేనే పర్మిషన్ల కోసం అరిగోస పడేవారు. కానీ నేడు ఊరు చివర వెలసిన ఈ బడా హోల్ సేల్ దుకాణాలకు మాత్రం ఎలాంటి రూల్స్ వర్తించడం లేదు. ఈ బాగోతంపై కేవలం స్థానిక అధికారులే కాకుండా.. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాన్యుల ప్రాణాలతో, ప్రభుత్వ ఆదాయంతో చెలగాటమాడుతున్న ఈ 'టపాసుల దందా'పై విజిలెన్స్ దాడులు చేసి, కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రభుత్వ ఖజానాకు రక్షణ.. ప్రజలకు నిజమైన దీపావళి! 🎇

(మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం చూస్తూనే ఉండండి.. మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్) 🎤 మొహమాటం లేదు.. దాపరికమూ లేదు!

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి