చిలకలూరిపేట సమీపంలో ఘోర ప్రమాదం: ముళ్ళపొదల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ స్కూల్ బస్సు! 🚌
రెప్పపాటు వ్యవధి.. ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం పసిప్రాణాల మీదకు తెచ్చింది. విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ అత్యుత్సాహం, నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి ముళ్ళపొదల్లోకి దూసుకెళ్లిన ఘటన చిలకలూరిపేటలో తీవ్ర కలకలం రేపింది.
🛑 రేసింగ్ పిచ్చా..? పసిప్రాణాలంటే లెక్కలేదా..? 😡
మార్టూరు నుండి చిలకలూరిపేట వస్తున్న రెండు ప్రైవేట్ పాఠశాల బస్సులు రహదారిపై ఒకదానికొకటి పోటీ పడుతూ దూసుకెళ్లాయి. ముందు వెళ్లాలనే ఆతురతతో.. బస్సులో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు చదువుతున్న 50 మందికి పైగా అమాయక విద్యార్థులు ఉన్నారనే కనీస స్పృహ కూడా లేకుండా డ్రైవర్లు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాణాంతక రేసింగ్ లో తీవ్ర వేగంతో ఉన్న ఒక బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ముళ్ళపొదల్లోకి దూసుకెళ్లింది.
💔 అద్దం పగిలి ముళ్ళకంచెలో పడ్డ చిన్నారి.. హృదయం ద్రవించే దృశ్యం! 👧🩸
ఈ ప్రమాద సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన అక్కడున్న వారి కంటతడి పెట్టించింది. బస్సు వేగంగా వెళ్లి ముళ్ళపొదల్లోకి దూసుకెళ్తున్న క్రమంలో డ్రైవర్ వేసిన సడన్ బ్రేక్ కు.. బస్సు ముందు భాగంలో అద్దం వద్ద కూర్చున్న ఒక చిన్నారి పాప తీవ్ర వేగానికి ఏకంగా అద్దం పగిలిపోయి బయటకు ఎగిరిపడింది. నేరుగా ఆ ముళ్ళపొదల్లో పడిపోవడంతో ఆ పాపకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోని విద్యార్థులంతా భయంతో హాహాకారాలు చేస్తూ ప్రాణభయంతో వణికిపోయారు.
🚑 హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు 🏥
కళ్లెదుటే జరిగిన ఈ ఘోరాన్ని చూసి వెంటనే స్పందించిన స్థానికులు పరుగులు తీసి పిల్లలను కాపాడే ప్రయత్నం చేశారు. అద్దంలోంచి బయటపడ్డ చిన్నారి పాపతో పాటుగా, బస్సులో ఉన్న మరో 10 మంది విద్యార్థులకు గాయాలు కావడంతో.. వారిని వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
⚠️ స్పీడ్ న్యూస్ సూటి ప్రశ్న: 🎤
అసలు స్కూల్ బస్సులకు స్పీడ్ కంట్రోల్స్ ఎందుకు పనిచేయడం లేదు? డ్రైవర్ల నిర్లక్ష్యానికి బలైపోతున్న పసిప్రాణాలకు బాధ్యత ఎవరిది? ఆర్టీఏ అధికారులు, విద్యాశాఖ అధికారులు ఇకనైనా కళ్లు తెరిచి ఇలాంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





No comments:
Post a Comment