చిలకలూరిపేటలో కలకలం.. భార్యపై కక్షతో..గంజాయి మత్తులో ఉన్మాదం.. అద్దె ఇంటికే పెట్రోల్ పోసి తగలబెట్టిన సైకో భర్త!
భార్యను సజీవ దహనం చేసేందుకు యత్నం... కసి తీరక అద్దె ఇంటికి నిప్పంటించిన గంజాయి బ్యాచ్ దుండగుడు!
చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో గంజాయి బ్యాచ్ అరాచకాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. విడిపోయిన భార్యపై కక్ష పెంచుకున్న ఓ యువకుడు, గంజాయి మత్తులో ఏకంగా ఆమెను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించి, అద్దె ఇంటికి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే...
💔 మొదటి భర్తకు దూరం... రెండో భర్తతో ప్రాణ సంకటం!
సంధ్య అనే మహిళ మొదటి భర్తతో వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా అతన్ని వదిలేసి ఒంటరిగా ఉంటోంది. ఆ సమయంలో ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన పవన్ తో పరిచయం ఏర్పడి, అది పెళ్లికి దారితీసింది. పవన్ గతంలో చిలకలూరిపేట కృష్ణమహల్ సెంటర్లో సెల్ ఫోన్ షాప్ నడిపేవాడు, ప్రస్తుతం గుంటూరులో పనిచేస్తున్నాడు. అయితే, కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య కూడా గొడవలు రావడంతో మళ్లీ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు.
🏃♀️ వేధింపులు తాళలేక ఎన్టీఆర్ కాలనీకి మకాం...
సంధ్య ఒంటరిగా ఉంటోందని గ్రహించిన పవన్.. నిత్యం మద్యం, గంజాయి మత్తులో వచ్చి ఆమెతో గొడవలు పెట్టుకునేవాడు. అతని వేధింపులు భరించలేక, ప్రశాంతంగా ఉందామని సంధ్య ఎన్టీఆర్ కాలనీలోని ఆంజనేయ స్వామి గుడి రోడ్డులో ఉన్న మేరీ ప్రభావతి ఇంట్లో అద్దెకు దిగింది.
🔥 "నువ్వుంటే సజీవ దహనం చేసేవాడ్ని".. ఫోన్లో వార్నింగ్!
ఆమె ఎన్టీఆర్ కాలనీకి మారినా వదిలిపెట్టని పవన్.. రాత్రి అక్కడకు చేరుకుని నానా రచ్చ చేశాడు. ఆ సమయంలో సంధ్య అక్కడ కనిపించకపోవడంతో కోపంతో రగిలిపోయిన ఆ దుండగుడు.. నేరుగా ఆమె ఉంటున్న గదిలో మంచం, బట్టలపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఆ తర్వాత సంధ్యకు ఫోన్ చేసి.. "ఒకవేళ నువ్వు కూడా ఆ ఇంట్లో ఉండి ఉంటే.. నిన్ను కూడా సజీవ దహనం చేసి తగలబెట్టేవాడ్ని" అంటూ దారుణంగా బెదిరించాడు. అదృష్టవశాత్తూ ఇంటి ఓనర్ అప్రమత్తమై మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.
⚖️ గతంలోనూ సెటిల్మెంట్లు... ఆగని అరాచకం!
పవన్ కు ఇలాంటి దౌర్జన్యాలు చేయడం కొత్తేమీ కాదు. ఎప్పుడూ గంజాయి మత్తులో ఉంటూ స్థానికులను భయపెడుతుంటాడు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగితే పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు చేసి వదిలేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు, గంజాయి మత్తులో మరింత రెచ్చిపోతున్నాడు.
🌿 ఎన్టీఆర్ కాలనీలో గంజాయిదే రాజ్యం!
ఈ ఒక్క ఘటనే కాదు.. ఎన్టీఆర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో 18 ఏళ్ల లోపు యువకులు సైతం గంజాయికి బానిసలై రాత్రి వేళల్లో రోడ్లమీద కొట్టుకోవడం, బూతులు తిట్టుకుంటూ హంగామా సృష్టించడం నిత్యకృత్యంగా మారింది. వీళ్ల దెబ్బకు స్థానికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు.
🚓 పోలీసులు ఉక్కుపాదం మోపాలి!
భార్యను చంపేస్తానని బెదిరించి, కోపం వస్తే పెట్రోల్ పోసి ఇళ్లను తగలబెట్టే స్థాయికి వీరు బరితెగించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం పోలీస్ స్టేషన్లలో రాజీలు, సెటిల్మెంట్లు కాకుండా.. వెంటనే చిలకలూరిపేట పోలీసులు పవన్ ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్టీఆర్ కాలనీలో గస్తీ పెంచి గంజాయి బ్యాచ్ ఆటకట్టించాలని ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియో కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.
https://www.instagram.com/reel/Dbw_IkFpMu_/?igsh=d24xb3l0NjFzNWNq





No comments:
Post a Comment