చిలకలూరిపేట స్పీడ్ న్యూస్' ఇంపాక్ట్...అక్షరానికి దక్కిన విజయం.... కదిలిన యంత్రాంగం.. యుద్ధ ప్రాతిపదికన సింగ్ నగర్ రోడ్డు పనులు!
చిలకలూరిపేట స్పీడ్ న్యూస్' కథనానికి భారీ స్పందన! యుద్ధ ప్రాతిపదికన సింగ్ నగర్ రోడ్డు నిర్మాణం 🚧
📢 "భూమి బద్దలైందా?".. కథనంతో కదిలిన యంత్రాంగం!
"చిలకలూరిపేటలో భూమి బద్దలైందా?" అనే సంచలన శీర్షికతో 'చిలకలూరిపేట స్పీడ్ న్యూస్' (Chilakaluripeta Speed News) ప్రసారం చేసిన వార్త అధికారుల కళ్లు తెరిపించింది. సింగ్ నగర్ లోని అధ్వాన్నమైన రోడ్డు పరిస్థితిని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న ప్రజల కష్టాలను మా ఛానెల్ ఆధారాలతో సహా ఎత్తిచూపిన విషయం తెలిసిందే. ఈ రియాలిటీ చెక్‌కు స్పందించిన సంబంధిత శాఖల అధికారులు తక్షణమే నిధులు మంజూరు చేసి రంగంలోకి దిగారు.
పాత వార్త కోతులు కింది లింక్ పై క్లిక్ చేయండి
https://chilakaluripetspeednews.blogspot.com/2026/05/blog-post_3622.html?m=1
🚧 యుద్ధ ప్రాతిపదికన కొత్త రోడ్డు పనులు..
గడిచిన రెండు మూడు రోజులుగా యంత్రాంగం శరవేగంగా పనులు చేపట్టింది. గుంతలు పడి, పనికిరాకుండా పోయిన పాత సిమెంట్ రోడ్డును పూర్తిగా పగలగొట్టి తొలగించారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, గతంలో కంటే మెరుగ్గా కొత్త రోడ్డును తీర్చిదిద్దుతున్నారు. అదనంగా మరో 4 అడుగుల వెడల్పు పెంచుతూ, 200 అడుగుల పొడవు, 16 అంగుళాల ఎత్తుతో అత్యంత నాణ్యమైన రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
🛑 తప్పిన ప్రమాదాలు.. సింగ్ నగర్ వాసుల హర్షం!
గతంలో ఈ రోడ్డు నరకాన్ని తలపించేది. నిత్యం ఎవరో ఒకరు ఆ రోడ్డు మధ్యలో చీలిపోయిన ప్రమాదకరమైన గుంతల్లో పడిపోవడం, ద్విచక్ర వాహనాల చక్రాలు ఇరుక్కుని తీవ్ర గాయాలపాలవడం పరిపాటిగా మారింది. రోజూ కళ్లెదుటే జరిగే ఈ ప్రమాదాలను చూసి భయపడిన సింగ్ నగర్ వాసులు.. ఇప్పుడు కొత్త రోడ్డు నిర్మాణంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎట్టకేలకు తమ ప్రాణ సంకటం తీరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
🤝 ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చొరవ.. మా అక్షరానికి దక్కిన విజయం!
ఈ రోడ్డు నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయించి, పనులు వేగవంతం చేయడంలో స్థానిక శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) శ్రీ మర్రి రాజశేఖర్ గారి చొరవ ఎంతో ఉందని స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదే సమయంలో, ప్రజల ప్రాణసంకటాన్ని వెలుగులోకి తెచ్చిన 'చిలకలూరిపేట స్పీడ్ న్యూస్' చేసిన కృషి వల్లే ఈ స్థాయిలో అధికారుల నుంచి స్పందన వచ్చిందని ప్రజలు ఛానెల్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.





No comments:
Post a Comment