మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట మున్సిపల్ అధికారుల నిర్వాకం వెలుగులోకి....మున్సిపాలిటీ పగటి దోపిడీ...​చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ఎక్స్క్లూజివ్... పూర్తి వివరాలు కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి..

చిలకలూరిపేట మున్సిపల్ అధికారుల నిర్వాకం వెలుగులోకి....మున్సిపాలిటీ పగటి దోపిడీ...​చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ఎక్స్క్లూజివ్... 

చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్):

అది చిలకలూరిపేట మున్సిపాలిటీ.. అక్కడ సామాన్యుడికి ఒక న్యాయం, అధికారులకో లెక్క! పన్నులు కట్టలేదని నోటీసులు ఇవ్వడం చూశాం.. కానీ, పన్నులు అన్నీ సక్రమంగా కట్టి, రసీదులు చేతిలో పెట్టుకున్న ఒక సామాన్యుడిని మున్సిపల్ అధికారులు పగటి దోపిడీకి గురిచేస్తున్న దారుణమిది. "కట్టిన పన్నుకే మళ్ళీ పెనాల్టీలు వేసి 58 వేలు కట్టమంటారా?" అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పని అధికారులు, మానసిక వేధింపులకు గురిచేస్తున్న సంచలన విషయం స్పీడ్ న్యూస్ దృష్టికి వచ్చింది.

​🏢 అసలేం జరిగిందంటే..?

చిలకలూరిపేట గాంధీపేట 3వ లైన్ లో నివాసం ఉండే జయరామమూర్తి అనే సామాన్య పౌరుడు మున్సిపాలిటీ వేధింపులకు బలవుతున్నాడు. వాస్తవానికి ఆయన తన ఇంటికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి (31-03-2025 వరకు) ఆస్తి పన్ను, నీటి పన్ను కలిపి రూ. 3,608లు పూర్తిగా చెల్లించారు. ఇందుకు సంబంధించిన అధికారిక రసీదులు కూడా ఆయన వద్ద భద్రంగా ఉన్నాయి. కానీ, మున్సిపాలిటీ అధికారులు ఒక్కసారిగా అసాధారణ రీతిలో పన్నులు పెంచేసి, ఏరియర్స్, పెనాల్టీలు అంటూ ఏకంగా రూ. 58 వేలకు పైగా డిమాండ్ నోటీసు (CDMA రిపోర్ట్ ప్రకారం) పంపడం తీవ్ర కలకలం రేపుతోంది.

​🛑 రసీదులున్నా.. కనికరించని అధికారులు!

ఈ అన్యాయంపై బాధితుడు మార్చి 9వ తేదీన కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్.. "2024-25 వరకు మీరు పన్ను పూర్తిగా చెల్లించారు, కేవలం 2025-26 సంవత్సరానికే కట్టాలి" అంటూ ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు. కానీ, ఆ ఒక్క సంవత్సరానికి ఎంత కట్టాలో మాత్రం చెప్పకుండా, పాత బకాయిలు అంటూ పదే పదే 58 వేలు కట్టాలని ఇంటికి నోటీసులు పంపుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.

​😡 అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి బెదిరింపులు.. దొంగచాటుగా కంప్లైంట్ క్లోజ్!

బాధితుడు న్యాయం కోసం కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేయగా.. అధికారులు సమస్యను పరిష్కరించాల్సింది పోయి, రాత్రి పూట సచివాలయ సిబ్బందిని ఇంటికి పంపి బెదిరింపులకు దిగారు. "ఈ ఎండార్స్మెంట్ మీద సంతకం పెట్టేయండి.. కంప్లైంట్ క్లోజ్ చేస్తాం" అంటూ ఒత్తిడి తెచ్చారు. దానికి జయరామమూర్తి గారు ఒప్పుకోకపోవడంతో, ఆయన ప్రమేయం లేకుండానే దొంగచాటుగా ఆ ఫిర్యాదును ఆన్లైన్లో క్లోజ్ చేయడం అధికారుల నిర్లక్ష్యానికి, నియంతృత్వానికి అద్దం పడుతోంది.

​⚖️ మూడేళ్ల పోరాటం.. ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా దక్కని న్యాయం!

గత మూడేళ్లుగా జయరామమూర్తి గారు ఈ సమస్యపై ఒంటరి పోరాటం చేస్తున్నారు.

  • ​🏛️ జిల్లా కలెక్టర్ గారిని స్వయంగా మూడుసార్లు కలిసి ఫిర్యాదు చేశారు.
  • ​🗣️ స్థానిక శాసనసభ్యులు (MLA) శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు.
  • ​📝 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సైతం లిఖితపూర్వకంగా విన్నవించుకున్నారు.

​అయినా కింది స్థాయి అధికారులు మాత్రం ఆ పై అధికారుల ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ, బాధితుడికి న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా మొన్న 29వ తారీఖున బాధితుడు మళ్ళీ జాయింట్ కలెక్టర్ (మేడం) గారిని కలిసి, క్లోజ్ చేసిన తన ఫైలును రీ-ఓపెన్ చేయించారు. ఆమె ఈ ఫైలును మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఎస్కలేట్ చేశారు.

​🗞️ స్పీడ్ న్యూస్ సూటి ప్రశ్న!

ఒక సామాన్యుడు పన్నులు కట్టినా.. ఇంతలా వేధిస్తారా? మున్సిపల్ చట్టాలు ప్రజల కోసమా? లేక అధికారుల జేబులు నింపడానికా? జయరామమూర్తి లాంటి వాళ్ళు ఎంతమంది ఇలా మున్సిపల్ అధికారుల చేతిలో నలిగిపోతున్నారో? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, చిలకలూరిపేట మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ పన్నుల దందాపై విచారణ జరిపి, బాధితుడికి న్యాయం చేయాలని స్పీడ్ న్యూస్ డిమాండ్ చేస్తోంది!

 దీనికి సంబంధించిన వీడియో కోసం కింది లింకుపై క్లిక్ చేయండి 

https://www.instagram.com/reel/DaakQ10p9zs/?igsh=c2IxeDBuZXh3ZHdx

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి