మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - ఆటో ఎలక్ట్రికల్ షాప్ దగ్ధం...అగ్నిప్రమాద బాధితుడికి రూ. 20 వేల ఆర్థిక సాయం చేసిన పఠాన్ యూసుఫ్... పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి....

చిలకలూరిపేట - ఆటో ఎలక్ట్రికల్ షాప్ దగ్ధం...అగ్నిప్రమాద బాధితుడికి రూ. 20 వేల ఆర్థిక సాయం చేసిన పఠాన్ యూసుఫ్...


ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ పఠాన్ చిన్న సత్తార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, పఠాన్ జువెలర్స్ అధినేత శ్రీ పఠాన్ యూసుఫ్ తన ఉదారత చాటుకున్నారు. అగ్నిప్రమాదంలో ఉపాధి కోల్పోయిన ఓ చిరు వ్యాపారికి ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించారు.

అగ్నికి ఆహుతైన ఎలక్ట్రికల్ షాప్

పసుమర్రు గ్రామానికి చెందిన పఠాన్ బాజీ.. పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ (ఓగేరు వాగుకి వెళ్లే మార్గం, శివాబార్ సమీపం) వద్ద టూ వీలర్, ఫోర్ వీలర్లకు సంబంధించిన ఆటో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ షాపు నడుపుకుంటున్నాడు. జూన్ 25 రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపులో దట్టమైన మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షాపులోని వస్తువులన్నీ కాలిపోయాయి. అప్పు చేసి తెచ్చుకున్న సామాగ్రి బూడిద అవ్వడంతో సుమారు రూ. 3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. దీంతో బాజీ కుటుంబం రోడ్డున పడింది.

రూ. 20,000/- ఆర్థిక సాయం అందజేత

బాజీ పరిస్థితిని తెలుసుకున్న పఠాన్ యూసుఫ్ తక్షణమే స్పందించారు. బాధిత కుటుంబానికి తన వంతు ఆసరాగా నిలుస్తానని చెప్పి, సోమవారం రాత్రి తన జ్యువెలర్స్ షాపులో బాజీకి రూ. 20,000/- (ఇరవై వేల రూపాయలు) నగదును సహాయంగా అందజేశారు. ఉపాధి కోల్పోయిన కష్టకాలంలో ఆదుకున్న యూసుఫ్ గారికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.

​ఈ కార్యక్రమంలో సనా కమిటీ సభ్యులు షేక్ నజీర్ అహ్మద్, పఠాన్ నజీర్, షేక్ కరిముల్లా (ఎస్.కె) తదితరులు పాల్గొన్నారు.

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి