మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - నెత్తురోడుతున్న ఎన్టీఆర్ కాలనీ రహదారి...ఇంకెన్ని ప్రాణాలు బలి కావాలి?.. తాజాగా మరో ఘటన? పూర్తి వివరాల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి

చిలకలూరిపేట - నెత్తురోడుతున్న ఎన్టీఆర్ కాలనీ రహదారి...ఇంకెన్ని ప్రాణాలు బలి కావాలి?.. తాజాగా మరో ఘటన?


చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ పెట్రోల్ బంక్ సమీప ప్రాంతం ఇప్పుడు వాహనదారులకు, స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణాన ఏ ఘోరం జరుగుతుందో, ఏ నిండు ప్రాణం గాల్లో కలిసిపోతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.

​⚠️ వణికిపోతున్న జనం.. నెల రోజుల్లోనే 6 ఘోర ప్రమాదాలు! ⚠️

గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతం యాక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. కేవలం గడిచిన ఒక్క నెల రోజుల్లోనే ఏకంగా ఆరు ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ పనుల నిమిత్తం వెళ్లే సామాన్యులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఈ దారి గుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు. వరుస ఘటనల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోవడం, ఎంతోమంది వికలాంగులుగా మారడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

​🚧 ఇరుకు రోడ్డు.. గుంతల గోడు.. పక్కకు దిగితే ప్రాణం పోయినట్టే! 🚧

ఈ వరుస ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు అత్యంత ఇరుకుగా ఉండటమే! రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలు తొలగించినా, రహదారిని మాత్రం వెడల్పు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు తారు రోడ్డు చాలా సన్నగా ఉండి, దానికి ఇరువైపులా పెద్ద ఎత్తున గుంతలు, గతుకులు ఏర్పడ్డాయి. ఎదురుగా వచ్చే వాహనానికి సైడ్ ఇవ్వాలంటే.. తారు రోడ్డు మీద నుంచి బండి కిందకు దించాలి. అలా దించితే బండి అదుపుతప్పి ప్రమాదానికి గురికావడం ఖాయం అన్నట్లుగా రోడ్డు పరిస్థితి తయారైంది.

​🚑 తాజా ఉదాహరణ: మృత్యుంజయుడిలా పోరాడుతున్న నాగరాజు! 🚑

ఈ ఇరుకు రోడ్డు వల్ల ఆదివారం మధ్యాహ్నం మరో ఘోరం జరిగింది. గాంధీపేటకు చెందిన గోపి దేశి నాగరాజు అనే వ్యక్తి తన గొర్రెల ఫామ్ నుండి భోజనానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల వెనుక నుంచి వచ్చిన ఒక వాటర్ ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగరాజు తల రోడ్డుకేసి బలంగా గుద్దుకుని తీవ్ర రక్తస్రావం జరిగింది. చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు కేవలం 'చిన్న గాయం' అని ఆరు కుట్లు వేసి నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. అనుమానంతో కుటుంబ సభ్యులు గుంటూరు తరలించడంతో మెదడులో బ్లడ్ క్లాట్ అయినట్లు తేలింది. ప్రస్తుతం మెరుగైన చికిత్స పొందుతున్నాడు. (పారిపోతున్న ఆటోను వెంబడించి పట్టుకున్న స్థానికుల చొరవ అభినందనీయం).

​📣 అధికారులూ మేల్కొనండి.. "డబుల్ రోడ్డే" ఏకైక పరిష్కారం! 📣

ఇన్ని ఘోరాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెంతమంది అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటారు? అని ప్రశ్నిస్తున్నారు. నరసరావుపేట సెంటర్ నుండి బైపాస్ వరకు తక్షణమే డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, యుద్ధ ప్రాతిపదికన రోడ్డు వెడల్పు చేసి, గుంతలు పూడ్చాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

​గౌరవనీయులైన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకపోతే.. ఈ మృత్యుదారికి ఇంకెంతోమంది బలయ్యే ప్రమాదం ఉంది. "ప్రాణం పోయాక పరిహారం ఇచ్చే కంటే.. ప్రాణాలు నిలబెట్టే రోడ్డు వేయడం ముఖ్యం!" అని చిలకలూరిపేట ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి