మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - ​గొడ్డలి, కోడికత్తి, గులకరాయితో వైఎస్సార్సీపీకి కొత్త జెండాను బహుకరించిన నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం - అమరావతికి 'ప్లాన్ బి' కాదు.. జగన్‌కే 'ప్లాన్ బి' ఇచ్చాం

చిలకలూరిపేట - ​గొడ్డలి, కోడికత్తి, గులకరాయితో వైఎస్సార్సీపీకి కొత్త జెండాను బహుకరించిన నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం - అమరావతికి 'ప్లాన్ బి' కాదు.. జగన్‌కే 'ప్లాన్ బి' ఇచ్చాం - రావు 


జగన్ పార్టీకి 'ప్లాన్ బి' జెండా..! గొడ్డలి, కోడికత్తి, గులకరాయితో సరికొత్త నమూనా విడుదల

చిలకలూరిపేట (అమరావతి న్యూస్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చిలకలూరిపేట వేదికగా నవతరం పార్టీ తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పార్టీకి సరైన జెండా, ఎజెండా లేక ఇబ్బంది పడుతున్న జగన్‌కు తనవంతు సాయంగా నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఒక వినూత్నమైన 'ప్లాన్ బి' జెండా నమూనాను మీడియాకు విడుదల చేశారు. మూడు రంగుల నేపథ్యంతో రూపొందించిన ఈ జెండాలో, మధ్యలో రక్త వర్ణపు వృత్తాన్ని ఉంచి.. అందులో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గుర్తులను ప్రధానంగా హైలైట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

​గతంలో స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్.. ఇప్పుడు 'మావిగన్' పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగానే ఈ జెండాను ప్లాన్ బి కింద రూపొందించినట్లు రావు సుబ్రహ్మణ్యం ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని చూసిన పాపానికి, ఆయన పార్టీ ఎన్నికల గుర్తు అయిన సీలింగ్ ఫ్యాన్ ముక్కలై 11 చెక్కలుగా (సీట్లు) విడిపోయిందని చురకలంటించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని దయనీయ స్థితిలో ఉన్న జగన్‌కు.. ఈ సమయంలో ఇటువంటి జెండా అత్యవసరమని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో అన్యథా భావించకుండా రాజధాని 'మావిగన్' ఎజెండాతో పాటు, ఈ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి జెండాతో మావయ్య జగన్ ముందుకు రావాలని సూచించారు.

​అధికారం వారి చేతుల్లోకి వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో, వారి చేతుల్లో ఏముంటాయో ప్రజలకు ఈ జెండా ద్వారా ఇట్టే అర్థమవుతుందని.. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేసింది. రాజధాని అమరావతికి జగన్ 'ప్లాన్ బి' ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండే తాము 'ప్లాన్ బి' కింద ఈ జెండాను జగన్‌కు అందిస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం కుండబద్దలు కొట్టారు. మొత్తానికి నవతరం పార్టీ విడుదల చేసిన ఈ సెటైరికల్ జెండా నమూనా ఇప్పుడు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

1 comment:

  1. నవతరం పార్టీ అధ్యక్షులు గారు మొదట మీ పార్టీ గురించి మీరు చూసుకోండి మీ పార్టీ ఉన్నట్టు మీరంటూ ఒకరు పేటలో ఉన్నట్టు కూడా పెట్ట ప్రజల వాళ్లకి ఎవ్వరికి తెలియదు అలాంటిది మీరు కూడా జగన్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు మొదట మీది మీరు చూసుకోండి దీని అంటారు ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అని ఈ రెండు సామెతలకి అర్ధాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా

    ReplyDelete

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి