మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - నటుడు ప్రకాష్ రాజ్‌పై మండిపడిన చిలకలూరిపేట విశ్వహిందూ పరిషత్ - దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ - మాస్ వార్నింగ్! 😡🔥

చిలకలూరిపేట - నటుడు ప్రకాష్ రాజ్‌పై మండిపడిన చిలకలూరిపేట విశ్వహిందూ పరిషత్ - దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ - మాస్ వార్నింగ్! 😡🔥


చిలకలూరిపేట: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ హిందూ దేవుళ్లపై, హిందూ సమాజంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ చిలకలూరిపేట పట్టణంలో విశ్వహిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీరుపై VHP నాయకులు, సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువుల సొమ్ముతో బతుకుతూ హిందూ ధర్మంపైనే విష చిమ్ముతారా?

శ్రీరామచంద్రుడు, లక్ష్మణ స్వామిని ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన వలస కూలీలుగా ప్రకాష్ రాజ్ వితండవాదం చేస్తూ అభివర్ణించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా తెలుగు సినిమాల్లో దేవుడి పాత్రలు, భక్తి రస పాత్రలు పోషిస్తూ, హిందువులు ఇచ్చే డబ్బుతో కోట్లు గడిస్తూ అదే హిందూ ధర్మంపై విషం చిమ్మడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. "పొట్ట చేత పట్టుకొని బతకడానికి దిక్కులేక ఆంధ్రాకు వచ్చి, ఇక్కడి ప్రజల ఆదరణతో ఎదిగి, ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం సిగ్గుచేటు. ఆయన పెంపకాన్ని చూసి తల్లిదండ్రులు సైతం సిగ్గుపడతారు" అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు..

సమాజంలో ఏ మతానికి చెందిన వారైనా సరే.. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా.. హిందూ ధర్మంపై, హిందూ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని VHP సభ్యులు స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియా అందుబాటులో ఉందనో, లేదా మైక్ దొరికిందనో చవకబారు పబ్లిసిటీ కోసం వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా, దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు.

ఇది దేవుళ్లు నడయాడిన పుణ్యభూమి..

భారతదేశం పవిత్రమైన పుణ్యభూమి అని, సాక్షాత్తూ దేవుళ్లు మనిషి రూపంలో అవతరించి నడయాడిన నేల అని వారు గుర్తుచేశారు. ఇలాంటి పవిత్ర దేశంలో ఉంటూ రాక్షస బుద్ధితో నోటికి అదుపు లేకుండా మాట్లాడే వ్యక్తులను సమాజానికి దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్ లాంటి చెడు ప్రభావం చూపే వ్యక్తులను దేశ బహిష్కరణ చేసి, వారిని సమాజం నుంచి వెలివేయడం ద్వారానే నేటి యువతకు సరైన మార్గదర్శనం చేయగలం అని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- చిలకలూరిపేట స్పీడ్ న్యూస్.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి